దొంగతనానికి వెళ్లిన సమయంలో మొరిగిన ఐదు కుక్కలకు విషమిచ్చి చంపిన మోసెస్, ప్రభాకర్ అనే ఇద్దరిని జేజేనగర పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు(బనశంకరి): దొంగతనానికి వె ళ్లిన సమయంలో మొరిగిన ఐదు కుక్కలకు విషమిచ్చి చంపిన మోసెస్, ప్రభాకర్ అనే ఇద్దరిని జేజేనగర పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 5వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో రంగనాథకాలనీ 4 వక్రాస్ లో సుమారు 5 కుక్కలు, 5 కాకులు, మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానిక నివాసి సత్య జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పశ్చిమవిభాగం డీసీపీ లాబూరామ్ నేతృత్వంలో ఓ బృంధాన్ని ఏర్పాటు చేశారు. ఏసీపీ సత్యనారాయణ మార్గదర్శనంలో ఇన్స్‌స్పెక్టర్ వసంత్‌కుమార్, ఎస్‌ఐ అంజనప్ప సిబ్బందితో తీవ్రగాలింపులు చేపట్టారు. పోలీసులు నిందితుడు మోసెస్ ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. తనతో పాటు ప్రభాకర్ కూడా ఉన్నట్లు నోరువిప్పడంతో అతన్నీ అరెస్ట్ చేశారు.