![Hyderabad Dog Attack](/styles/webp/s3/article_images/2024/06/9/77_0.jpg.webp?itok=sATpMYK4)
దుండిగల్: వీధి కుక్కల దాడిలో 15 నెలల చిన్నారి గాయపడింది. దుండిగల్ మున్సిపాలిటీ డిపోచంపల్లి పరిధిలోని సత్యసాయి కాలనీలో మింటూసింగ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె ఆరుషి (15 నెలలు) శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తల, చేతికి గాయాలయ్యాయి. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతోంది.
మరో ఘటనలో 14 ఏళ్ల బాలుడిపై..
నిజాంపేట్: నిజాంపేట్‌లో 14 ఏళ్ల సాయిచరణ్ అనే బాలుడు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కల వెంటపడ్డాయి. వాటి బారి నుండి తప్పించుకునేందుకు యతి్నంచినా వెంబడించి గాయపరిచాయి. బాలుడి చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాల్లో కరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment