నిర్లక్ష్యం చేస్తే సహించం
నిర్లక్ష్యం చేస్తే సహించం
Published Wed, Aug 17 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
సంస్థాన్ నారాయణపురం: ఎరుకల జాతి హక్కులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఎరుకల సంఘం జాతీయ అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ ఎరుకల హెచ్చరించారు. సంస్థాన్ నారాయణపురంలో ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎరుకల హక్కుల సమస్యలపై పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వలిగి ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు కావస్తున్నా, ఎరుకల తెగ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేకుండా, దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నామన్నారు. ఎరుకల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలన్నారు. ఎరుకల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మానపాటి సతీష్‌కుమార్, కొండేటి సుగుణమ్మ, నల్లగొండ కళమ్మ, కుంభం సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలుగు వెంకటయ్య, రుద్రాక్షి రవి, కొండేటి లక్ష్మయ్య, తదితరులున్నారు.
Advertisement
Advertisement