narayanapuram
-
నారాయణపురంలో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో
-
నారాయణపురం కాలువలో రాకాసి చేప
రాజాం: శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మందరాడ గ్రామం వద్ద నారాయణపురం కుడికాలువలో రైతులకు బుధవారం రాకాసి చేప కనిపించింది. రైతులు సరదాగా చేపలు పడుతుండగా ఈ వింత చేప లభించింది. నోరు కింద భాగాన ఉండడంతో పాటు చేప మొత్తం నలుపు రంగులో ఉండి, తెల్లటిచారలు కలిగి ఉంది. ఒంటిపై మొప్పలకు ముళ్లున్న ఈ చేపను ప్రమాదకర చేపగా భావించి చంపిన అనంతరం భూమిలో పాతిపెట్టేశారు. ఈ చేపను దెయ్యం చేప అంటారని, బల్లిచేప, అమెజాన్ సైల్ఫీన్, క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారని రాజాం ఫిషరీస్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. ఈ చేప చెరువుల్లో ఉంటే చిన్నచిన్న చేపలను తినేస్తుందని, రైతులకు నష్టం కలిగిస్తుందని వెల్లడించారు. నీటి ప్రవాహాల ద్వారా చెరువుల్లోకి వచ్చేస్తుందని, చెరువుల్లో చేరి ఆహారం తినేయడంతో పాటు ఆక్సిజన్ పూర్తిగా పీల్చేస్తుందని, మిగిలిన చేపలను బతకనివ్వదని తెలిపారు. 200 గ్రాములు ఉండే ఈ చేప పెరుగుదల పెద్దగా ఉండదని, కానీ ఏ చెరువులోకి వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని పేర్కొన్నారు. ఈ చేపను ఎవరూ తినకూడదని, కనిపించిన వెంటనే చంపేసి భూమిలో పాతిపెట్టేయాలని సూచించారు. ఈ చేప సాధారణ పరిస్థితుల్లో కూడా బతకగలదని, నీరులేని భూమిపై కూడా 15 రోజులు నుంచి నెలరోజులు బతుకుతుందని వివరించారు. -
తేలియా రుమాల్... కియా కమాల్
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలోని చేనేత హ్యాండ్లూమ్ క్లస్టర్ పరిధిలో తయారయ్యే తేలియా రుమాల్ వస్త్రానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఇది దాదాపు పేటెంట్ హక్కుతో సమానం. ఈ నెల 10న చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కార్యాలయం ఆమోదం తెలపగా, ఈ విషయాన్ని జీఐ అధికారులు గురువారం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధనాకు ఫోన్ ద్వారా తెలిపారు. తేలియా రుమాల్ అనే వస్త్రం ప్రాచీన కళకు సంబంధించింది. ఈ వస్త్రాన్ని సహజ రంగులు, ముడిపదార్థాలతో తయారు చేస్తారు. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. పుట్టపాకలోని చేనేత కళాకారులు ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేసి చీరలు, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్ రూపాల్లో తయారు చేస్తున్నారు. 2017లో హ్యాండ్లూమ్ క్లస్టర్ పేరు మీద జీఐ కోసం దరఖాస్తు చేశారు. జీఐ అధికారులు పలుమార్లు ఇక్కడికి వచ్చి వస్త్రం తయారీని పరిశీలించారు. చివరికి పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యం గుర్తించి భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇచ్చారు. ఇప్పుడు తేలియా రుమాల్ అనే వస్త్రం ఎక్కడ ఉన్నా, పుట్టపాకకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. జీఐ ఆధారంగా విదేశీయులు కూడా పుట్టపాకకు వచ్చే అవకాశం ఉంది. ఈ వస్త్రం తయారీ ద్వారానే పుట్టపాకలోని గజం గోవర్ధనా, గజం అంజయ్యతోపాటు ఎంతోమంది చేనేత కళాకారులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పత్రాలు అందుకున్నారు. శ్రమకు గుర్తింపు వచ్చింది పుట్టపాక చేనేత కళాకారుల శ్రమకు జీఐతో గుర్తింపు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ పటంలో పుట్టపాకకు గుర్తింపు ఉంటుంది. మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. – గజం గోవర్ధనా, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
30 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత
ఏలూరు టౌన్: విశాఖ నుంచి విజయవాడకు కారులో తరలిస్తున్న 30 కిలోల బంగారు బిస్కెట్లను పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ సుమారు రూ.10 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఎం.రవిప్రకాష్ మీడియాకు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నామని.. ఇందులో భాగంగా ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద గణపవరం సీఐ రామ్‌కుమార్, చేబ్రోలు ఎస్ఐ, రెవెన్యూ అధికారులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వీలెన్స్ టీమ్.. వాహనాల తనిఖీలు చేపట్టాయన్నారు. ఈ సమయంలో విశాఖ నుంచి వస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తి కారును ఆపి తనిఖీ చేయగా.. 30 కిలోల బరువున్న 300 బంగారు బిస్కెట్లు లభించాయని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తిస్థాయిలో పత్రాలు లేవని, జిరాక్స్ కాపీలు మాత్రమే ఉండటంతో.. ఆ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందన్నారు. బంగారు బిస్కెట్లను ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. వారు పత్రాలను తనిఖీ చేసిన అనంతరం అన్నీ సక్రమంగా ఉంటే వారికే అప్పగిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, తాను అన్ని అనుమతులతోనే బంగారు బిస్కెట్లను తీసుకెళ్తున్నానని సత్యనారాయణ చెప్పారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్వీబీసీ గోల్డ్ షాపు నుంచి విజయవాడలోని తమ బ్రాంచ్‌కు వీటిని తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. -
మునుగోడును అభివృద్ధి చేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, రోడ్‌షో మండలంలోని గుడిమల్కాపురం, సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక గ్రామాల మీదుగా మునుగోడు మండలం వరకు సాగింది. అంతకు ముందు స్థానిక ప్రాచీన శివాలయంలో రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తానన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీ«ధర్‌రెడ్డి, నయీంషరీఫ్, కె.లింగయ్య, బుజ్జి, వెలిజాల రామచంద్రం, ఏపూర్ సతీష్, మందుగుల బాలకృష్ణ, బచ్చనగోని గాలయ్య, కుందారపు యాదయ్య, శంకర్, శంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, గడ్డం యాదయ్య, వంగూరు సత్తయ్య, యాదయ్య, రఘు, వెంకన్న తదితరులున్నారు. సర్వేల్లో ఉద్రిక్తత.. సర్వేల్ గ్రామంలో రాజగోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల ర్యాలీ అక్కడికి చేరుకుంది. ప్రజాకూటమి, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్ఐ మల్లీశ్వరి, తన సిబ్బందితో జోక్యం చేసుకొని ర్యాలీని అక్కడి నుంచి పంపించారు. గుజ్జలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీగా నువ్వు ఏం అభివృద్ధి చేశావు అంటూ రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. దీంతో కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రికంగా మారుతుండటంతో పోలీస్‌లు జోక్యం చేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణింది. అనంతరం రాజగోపాల్‌రెడ్డి ప్రచారం కొనసాగింది. మరిన్ని వార్తాలు... -
ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు
అనంతపురం రూరల్ : హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఎ.నారాయణపురం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. 8 కాండ్ల ఒంగోలు జాతి ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొనగా ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన రాజన్న ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. యల్లనూరు మండలానికి చెందిన రామలింగారెడ్డి ఎద్దులు రెండవ స్థానంలోనూ, ఆత్మకూరు మండలానికి చెందిన రాజగోపాల్ ఎద్దులు మూడవ స్థానంలోనూ నిలిచాయి. నార్పల మండలం జంగంరెడ్డిపేటకు చెందిన రామలింగ వృషభాలు నాల్గో స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ రూ.20వేలు, రెండవ బహుమతిగా నారాయణపురం గ్రామానికి చెందిన పి.నారాయణస్వామి రూ.15 వేలు, మూడో బహుమతిగా ఎంపీటీసీ సభ్యుడు నాగేంద్ర రూ.10వేలు, నాల్గో బహుమతిగా లక్ష్మీనారాయణ రూ.5వేలు అందజేశారు. అనంతరం గ్రామంలోని అనంత వీరాజంనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు. -
ఉపాధ్యాయుల ఉగాది సంబరాలు
నారాయణపురం (ఉంగుటూరు): సమాజానికి దిశా నిర్ధేశకులుగా నిలిచే ఉపాధ్యాయులు ఉగాది ఉత్సవం పేరిట తెలుగు సాంస్కృతిక పరిరక్షకులుగా నిలవడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం రాత్రి ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీనివాస రైతు సేవా భవనంలో ఉంగుటూరు మండల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో హేవళంబి నామ తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం భీమవరానికి చెందిన ప్రసిద్ధ పంచాంగకర్త పెదగాడి మోహనరవి శంకర్ తెలుగు సంవత్సర రాశి ఫలాలను వివరించారు. నూతన పంచాంగాన్ని రచించి, ఆవిష్కరించి పంచాంగ శ్రవణం చేశారు. నాలుగేళ్ల నుంచి ఉంగుటూరు మండల ఉపాధ్యాయులు తెలుగు భాషా సాంస్కృతిక వైభవాన్ని రేపటి తరానికి అందించేలా చేస్తోన్న కృషి ఎనలేనిదన్నారు. తెలుగు వారి తొలి పండుగ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జటావల్లభుల సాయిరాం ఉగాది ప్రాధాన్యతను వివరిస్తూ.. తెలుగు వారి తొలి పండుగ ఉగాది సంప్రదాయాల వెనుక ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందన్నారు. అనంతరం తెలుగు పండితురాలు సీహెచ్ దుర్గ, పంచాగకర్త మోహన రవి శంకర్, సాయిరాంలను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. హాజరైన వారందరికీ నూతన పంచాంగాలు అందజేశారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆరగించి ఉపాధ్యాయులు తెలుగు సంప్రదాయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎంఈవో డి. శుభాకరరావు, తాడేపల్లిగూడెం ఎంఈవో వి.హనుమ, ప్రధానోపాధ్యాయులు సీహెచ్ వెంకట రత్నం, జి.చంద్రారావు, అప్పసాని శేషగిరిరావు, ఉపాధ్యాయ ఉగాది ఉత్సవ కమిటీ సభ్యులు ఉప్పిలి వేంకటేశ్వరరావు, సీతాల సత్యనారాయణ, బాలేశ్వరరావు, పరిమి సత్తిరాజు, కె.ఫణీంద్రనా««థ్, పుప్పాల నరసింహారావు, కె. హరికృష్ణ, జి.ఆనందరావు, కె.శ్రీరామకృష్ణ, పిరిడి ప్రసాద్, మూకల ప్రసాద్‌లతో పాటు మండలంలోని ఉపాధ్యాయులంతా తమ కుటుంబ సభ్యులతో ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
ఏప్రిల్ 4న జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక
నారాయణపురం (ఉంగుటూరు) : జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక ఏప్రిల్ 4న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు బడేటి వెంకట్రామయ్య తెలిపారు. బుధవారం స్థానిక సమతా గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో అసోసియేషన్ అడ్హాక్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకులు సమక్షంలో ఎన్నిక నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లా క్రీడా సంఘాలన్నీ గుర్తింపు పత్రాలను మార్చి 10వ తేదీలోపు అడ్హాక్ కమిటీ కన్వీనర్ ఆదిరెడ్డి సత్యనారాయణకు అందజేసి నమోదు చేయించుకోవాలన్నారు. అడ్హాక్ కమిటీ ఎన్నిక ..ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బడేటి వెంకట్రామయ్య, కన్వీనర్‌గా ఆదిరెడ్డి సత్యనారాయణ, సభ్యులుగా వి.శ్రీనివాసరాజు, డి.నారాయణరాజు, పీఎస్ సుధాకర్ ఎన్నికయ్యారు. -
పాతకక్షలే కారణమా ?
అంజయ్య హత్యపై పోలీసుల అనుమానం సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ యాదగిరి ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐ సంస్థాన్ నారాయణపురం : మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో రైతు నోముల అంజయ్య (55) హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కొందరితో స్వల్ప గొడవలు ఉన్నాయని, వారే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నోముల అంజయ్య ఆదివారం తెల్లవారుజామున రోజు మాదిరిగానే తన ఇంటి నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ తనకున్న పశువుల దొడ్డిని శుభ్రం చేసి అక్కడే మంట వేసి చలి కాగుతున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన కత్తితో దాడి చేశారు. వెనుక నుంచి మెడపైన వేటు వేశారు. దాంతో ఆయన కిందపడిపోవడంతో గొంతు భాగంతో పాటు మరో రెండుసార్లు తీవ్రంగా నరికారు. తలకు, మొండానికి మధ్యలో 40 శాతం గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర బావుల వద్దకు వెళ్లే రైతులు రక్తపు మడుగులో పడి ఉన్న అంజయ్యను చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మల్లీశ్వరి అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ రంగప్రవేశం చేశాయి. నిందితులను గుర్తించడానికి ప్రయత్నించాయి. హత్యకు కారణం ఏంటి ? ఈ హత్య వెనుక కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. భూ తగాదాలా.. లేక మరేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసేటప్పుడు ఒక్కడే పాల్గొన్నాడా, అనేక మంది కలిసి హత్య చేశారా, ఎలాంటి ఆయుధం ఉపయోగించారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అంజయ్యకు ఎవరితోనైనా పాతకక్షలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతునికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ సంఘటన స్థలాన్ని యాదాద్రి భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి, చౌటుప్పల్ సీఐ నవీన్‌కుమార్ పరిశీలించారు. అనంతరం సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతోనే ఈ సంఘటనకు ఒడిగట్టారని తెలిపారు. మృతుడికి కొందరితో చిన్నచిన్న తగాదాలు ఉన్నట్లు తెలిసిం దని, వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నింది తులను పట్టుకుంటామని వివరించారు. ఎస్ఐ మల్లీశ్వరి, ఏఎస్ఐలు యాదవరెడ్డి, శ్రీనివాసులు, యాదగిరి, సత్యం, కొండల్ పాల్గొన్నారు. -
వేధింపులే కారణమా..?
సంస్థాన్ నారాయణపురం: ఆ విద్యార్థి చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవాడు..సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి అనారోగ్యం బారిన పడ్డాడు. రెండు రోజుల క్రితమే కాలేజీకి వచ్చి పరీక్ష కూడా రాశాడు. తోటి విద్యార్థులు వేధించారో. కాలేజీలో ఇమడలేకనో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సర్వేల్ గురుకుల విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, విద్యార్థులు, గ్రామాస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహడ్ గ్రామానికి చెందిన సల్వోజు మధునాచారి, సుజాతల కుమారుడు శేఖర్(17) సర్వేల్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి పండగ సెలవులకు వెళ్లి అనారోగ్యం బారిన పడడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. గత శనివారం కళాశాలకు ఉదయం వచ్చి పరీక్ష రాశాడు. కళాశాలకు వచ్చినప్పటికీ శేఖర్‌కు ఆడ్మిట్ పాస్‌ను అందజేయలేదు. సోమవారం తెల్లవారుజామున శేఖర్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లారెడ్డిగూడెం వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు. అక్కడే రైతుల గుడిసెల్లో దాచుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప రైతులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే శేఖర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తండ్రికి ఫోన్ చేసి.. సోమవారం ఉదయం 5గంటలకు శేఖర్ తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. తండ్రి నేను వస్తున్నాను, అంతపని చేయకు అని చెప్పి సర్వేల్‌కు బయలుదేరాడు. ఇదే విషయం తండ్రి కళాశాలకు సమాచారం ఇచ్చాడు. అధ్యాపకులు, తోటి విద్యార్థులు శేఖర్‌ను వెతకడం మొదలు పెట్టారు. అప్పటికే కళాశాల నుంచి శేఖర్ నడుచుకుంటూ వెళ్లిపోవడంతో వారికి కనిపించలేదు. 5 నుంచి 8 గంటల వరకు తండ్రికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడ విద్యార్థి మరణించి ఉండటాన్ని గమనించి గ్రామాస్తుల, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీస్‌లు, కళాశాల ప్రిన్సిపాల్ రాఘవరావు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ మల్లేశ్వరి కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. కారణాలపై పోలీసుల అన్వేషణ శేఖర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. తోటి విద్యార్థుల వేధించారా..?, గురుకులంలో ఇమడలేక మనస్తాపం చెందాడా, ఇంకా ఎమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ చదవలేనని చెప్పాడు తోటి విద్యార్థుల వేధింపులు ఎక్కువయ్యాయని, నేను ఇక్కడ చదవలేనని చెప్పాడని శేఖర్ తల్లితండ్రి మధనాచారి, సూజాత తెలిపారు. సర్ది చెప్పి పంపించామని, ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అయినా విద్యార్థుల వేధింపులు ఆగలేదని ఆరోపించారు. ఉదయం ఫోన్ చేసినప్పుడు తండ్రి నేను వస్తున్నానని, ఇంటికి తీసుకెళ్తానని, మళ్లీ పరీక్షలు రాసేటప్పుడే కళాశాలకు వెళ్లు అని చెప్పానని తెలిపారు.విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నా ప్రిన్సిపాల్, అధ్యాపకులు పట్టించుకోనందు వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమ కుమారుడు బాగా చదివే వాడని, ఎవరితోనూ గొడవలు, వాగ్వాదానికి దిగిన సందర్భాలు లేవన్నారు. మృతుడి బంధువుల ఆందోళన విద్యార్థుల వేధింపులు, కళాశాల నిర్లక్ష్యం వల్ల శేఖర్(17) మృతి చెందాడని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం రాత్రి మృతుడు బంధువులు అందోళనకు దిగారు. గురుకుల పాఠశాల ఏజీవో టీఎస్ ప్రసాద్ అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పాడు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. -
చెర్లగూడెం ఎడమ కాల్వ కోసం పరిశీలన
సంస్థాన్ నారాయణపురం :చెర్లగూడెం ఎడమ కాల్వ కోసం మండల పరిధిలోని జనగాం, చిల్లాపురం, నారాయణపురం, రాచకొండ గ్రామాల్లో చెరువులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రిటైర్డ్ ఇంజనీరింగ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇతర సభ్యులు, అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. మర్రిగూడ మండలం చెర్లగూడెం రిజర్వాయర్ నుంచి సంస్థాన్ నారాయణపురానికి వచ్చే ఎడమ కాల్వ ఏయే గ్రామాల నుంచి వెళ్తుంది, ఏయే చెరువులను ఏ విధంగా నింపవచ్చో వంటి అంశాలను మ్యాపుల ద్వారా పరిశీలించారు. చెర్లగూడెం సముద్రమట్టానికి 385 మీటర్ల ఎత్తులో ఉండడంతో, మండలంలోని చిల్లాపురంలోని పెద్దచెరువు 415మీటర్లు, మొల్కచెరువు 420మీటర్లు, మేళ్ల చెరువు 430మీటర్ల ఎత్తు ఉండడంతో చెరువులకు నీళ్లు ఏ విధంగా నింపాలని, ఎక్కడి నుంచి నింపాలని పరిశీలించారు. చెర్లగూడెం ఎడమకాల్వ11కి.మీ.ల వద్ద వాచ్యతండా వద్ద 70మీటర్ల ఎత్తుతో లిఫ్టింగ్ చేసి, జనగాం పరిధిలోని మొలక చెరువును నింపి, అక్కడి నుంచి చిల్లాపురం పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు సంస్థాన్ నారాయణపురం పరిధిలో ఉన్న మేళ్ల చెరువుకు నీళ్లందించవచ్చని గుర్తించారు. మొలక చెరువు నుంచి మేళ్ల చెరువుకు నీళ్లు అందించడానికి ఏదైనా ఆటంకం ఏర్పడితే నైజా కాలం నాటి రాచకాలువను కూడా పరిశీలించారు. మొలక చెరువు, పెద్ద చెరువు, మేళ్ల చెరువు, నీళ్లకొండ చెరువులను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఒక ప్రతిపాదన తయారు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కోరారు. మొలక చెరువులో ఒక టీఎంసీ నీళ్ల కెపాసిటీతో పాటు మేళ్లచెరువు, ఇతర చెరువులు కూడా నింపాలని గుర్తించారు. రైతులతో కూడా మాట్లాడి, వారి అభిప్రాయాలను సేకరించారు. అఖిలపక్ష నాయకులతో కూడా చర్చిం చారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా చెరువులు నింపే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. వారి వెంట రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులు ఇంద్రసేనారెడ్డి, రమణానాయక్, మెంగ లక్ష్మణ్, ఐబీ డీఈ సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ప్రజాప్రతినిధులు పాశం హాలియా, కరంటోతు విజయలక్ష్మి, మేఘావత్ పద్మ, ఆత్కూరి రాములు, దుబ్బాక భాస్కర్, బచ్చనగోని దేవేందర్, ఏర్పుల అంజమ్మ, కత్తుల లక్ష్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీధర్‌రెడ్డి, పాశం ఉపేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నలపరాజు రమేష్, జక్కిలి అయిలయ్య, వీరారెడ్డి, కె.లింగయ్య, జి.శ్రీనివాసాచారి, గాలయ్య, యాదయ్య తదితరులున్నారు. -
ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్–17 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నాకౌట్ దశకు చేరుకున్నాయి. బాలికల విభాగంలో లీగ్దశలో విజయం సాధించి కేరళ, పంజాజ్, తమిళనాడు, బీహర్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, హర్యానా జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. బాలుర విభాగంలో కేరళ, ఉత్తరాఖండ్, ధిల్లీ, కర్నాటక, గుజరాత్, యూపీ, బీహర్, హర్యానా జట్లు నాకౌట్‌కు దశకు చేరుకున్నాయని నిర్వాహకులు ఆదిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. -
హోరాహోరీగా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయి అండర్–17 బాలికల, బాలుర వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అంతర్జాతీయ న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్‌కుమార్ పోటీలను పర్యవేక్షించారు. ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, క్రీడా నిర్వాహక కార్యదర్శి ఎ.సాయి పాల్గొన్నారు. -
తప్పిన ప్రమాదం..మోటార్ సైకిల్ తునాతునాకులు
నారాయణపురం(ఉంగుటూరు) : జాతీయరహదారి నారాయణపురం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మోటార్ సైకిల్ తునాతునకలైంది. పోలీసుల కథనం ప్రకారం.. రాచూరుకు చెందినబొడ్డు వెంకట అప్పరెడ్డి మోటార్ సైకిల్‌పై పెట్రోల్ బంకుకు వెళ్తుండగా ఏలూరు వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అప్పిరెడ్డి తప్పించుకోగా మోటార్ సైకిల్ తునాతునకలైంది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లా క్రికెట్ బాలుర జట్టు ఎంపిక
నారాయణపురం (ఉంగుటూరు) : జిల్లా అండర్–19 క్రికెట్ బాలుర జట్టును బుధవారం ఉంగుటూరు మండల నారాయణపురం బాపిరాజు క్రీడా మైదానంలో ఎంపిక చేశారు. జిల్లా ఒలింపిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, స్కూల్ గ్రేమ్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.ఐజాక్ పీడీలు పర్యవేక్షించారు. జిల్లా జట్టు ఇదే.. టి.అఖిల్ (భీమవరం, నారాయణ జూనియర్ కాలేజ్), బళ్ల ఉమా కాశీ విశ్వేశ్వరావు(నల్లజర్ల శశి జూనియర్ కాలేజ్), కేజేఆర్కే రాజు(భీమవరం ఆదిత్య జూనియర్ కాలేజ్), ఎ.దినేష్(భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), సీహెచ్ మణి కంఠ(భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), కె.రమేష్ (కేఆర్ పురం ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్), ఎ¯ŒSకే చైతన్య(ఆకివీడు విద్యా వికాస్ జూనియర్ కాలేజ్), కె.చిరంజీవి (భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), సీహెచ్ వంశీ(నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఏఎల్వీఎస్ఎ¯ŒSఎస్ రామరాజు(భీమవరం డీఎన్నార్ జూనియర్ కాలేజ్), ఎ¯ŒS.రవి కిరణ్(భీమవరం శ్రీ చైతన్య), యు.మోహ¯ŒSసాగర్(భీమవరం ఎస్వీ జూనియర్ కాలేజ్), ఎస్.కార్తీక్ ( దుంపగడప ప్రభుత్వ జూనియర్ కాలేజ్), కె.లక్ష్మణ కుమార్( తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఎం.శ్రీనివాస్(అత్తిలి ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఆర్.మహేష్ బాబు(ఆచంట ప్రభుత్వ జూనియర్ కాలేజ్). వీరుకాక స్టాండ్‌బైగా పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి
సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలిగించాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ నెల 15న సాక్షి దినపత్రికలో పీహెచ్సీలో ప్రసవ వేదన అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ బుధవారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో రోగుల గదులను, ఆపరేషన్ థియేటర్, ప్రసవ గదిని, వివిధ గదులను, రికార్డులను పరిశీలించారు. ప్రసవ వేదనతో ఒక గర్భిణి వస్తే, ప్రసవం చేయకుండా ఇలానే చూసేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే, ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఉండాల్సిన సిబ్బంది ఎవరని, ఎక్కడ ఉన్నారని, ఏం చేస్తున్నారని, 24గంటలు వైద్య సేవలు అందుతాయని ప్రజలు వస్తే, మీరు ఇలా పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలుగుతుందా అని హెచ్చరించారు. సిబ్బంది ఏదో చెప్పబోతుండగా, తన సెల్లో సంస్థాన్ నారాయణపురంలోని పీహెచ్సీలో మహిళ ప్రసవం ఫొటోలను వైద్యులకు, సిబ్బందికి చూపించారు. ఇలాంటి సాకులు చెప్పొద్దని, బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. పేదవాళ్లు వస్తే ఇంత అలుసుగా చూస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రిసెప్షన్లో ఏఎంసీ రిజిస్ట్రర్ రాయకపోవడంపై, మీ పనితీరు తెలుస్తుందన్నారు. ఈడీడీ రిజిస్ట్రర్ కూడా 2సంవత్సరాల నుంచి నిర్వహించకపోవడంపై వైద్యాధికారిపై అసహనం వ్యక్తం చేశారు. మీ రికార్డుల నిర్వహణ తీరు చూస్తుంటేనే తెలుస్తుందన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పీహెచ్సీలో అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనిచేయని వారికి శిక్షలు వేయడం ఒక్కటే జవాబు కాదని, వారిలో మార్పు తీసుకొచ్చి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహించాలన్నారు. సమయపాలన ప్రకారం వైద్యులు, సిబ్బంది వచ్చి సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, 24గంటల్లో ఎప్పుడు వైద్యానికి వచ్చినా అందించాలన్నారు. పీహెచ్‌సీలపై తనిఖీలు నిర్వహించి, ప్రజలకు వైద్యం అందేలా చూడాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌కుమార్, ఎంపీడీఓ జి.రజిత, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, మండల వైద్యాధికారి మోహనయ్య తదితరులున్నారు. -
ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డిలు అన్నారు. సీపీఐ మండల నిర్మాణ సభ మంగళవారం సంస్థాన్ నారాయణపురంలో జరిగింది. పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలతో ఎన్నికైన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సాగిందన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాలు జిల్లాలో ఇప్పటి వరకు మొదలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య, నెల్లికంటి సత్యం, కె.లింగయ్య, వీరమళ్ల యాదయ్య, దుబ్బాక భాస్కర్, ఎర్ర మల్లేష్, సుజాత, ఎంఏ.హమీద్, మంచాల సైదులు, లోడె యాదయ్య, కలకొండ సంజీవ తదితరులున్నారు. -
నిర్లక్ష్యం చేస్తే సహించం
సంస్థాన్ నారాయణపురం: ఎరుకల జాతి హక్కులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఎరుకల సంఘం జాతీయ అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ ఎరుకల హెచ్చరించారు. సంస్థాన్ నారాయణపురంలో ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎరుకల హక్కుల సమస్యలపై పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వలిగి ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు కావస్తున్నా, ఎరుకల తెగ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేకుండా, దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నామన్నారు. ఎరుకల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలన్నారు. ఎరుకల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మానపాటి సతీష్‌కుమార్, కొండేటి సుగుణమ్మ, నల్లగొండ కళమ్మ, కుంభం సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలుగు వెంకటయ్య, రుద్రాక్షి రవి, కొండేటి లక్ష్మయ్య, తదితరులున్నారు. -
ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతం పల్లగట్టుతండానుంచి ఐదుదొనల తండాకు వెళ్లే దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురువారం తండావాసులు గుర్తించారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ వాచర్ సేవ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి.అశోక్‌కుమార్ స్థలాన్ని పరిశీలించారు. తండావాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల తండావాసులు వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. -
ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండ అటవీ ప్రాంత పల్లగట్టుతండా నుంచి ఐదుదొనల తండాకు వెళ్లే దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురువారం తండావాసులు గుర్తించారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ వాచర్ సేవ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి.అశోక్‌కుమార్ స్థలాన్ని పరిశీలించారు. తండావాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల తండావాసులు వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. -
‘సర్వేల్’ని నంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా నిలబెడతా
సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ రాష్ట్రంలోని సర్వేల్ గురుకుల పాఠశాలను నంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా నిలబెడతానని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలను, కళాశాలను సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్సీసీ విద్యార్థులు పరేడ్‌తో పాఠశాలలోకి స్వాగతం పలికారు. గురుకుల పాఠశాలను కలియ తిరుగుతూ, తరగతి గదులకు వెళ్లి పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుకుంటే అలా లేదు.. నేనెంతో ఊహించుకున్నానన్నారు. పాత ఫర్నీచర్, భవనాలను చూసి నేను గురుకుల పాఠశాల అంటే ఎంతో గొప్పగా ఉంటుందని ఊహించాను కానీ, ఇక్కడ చూస్తే పరిస్థితి వేరేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల చుట్టూ మొక్కలు నాటాలని, పాఠశాల విశాలంగా ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు. కేజీ టు పీజీ విద్యాపథకంలో భాగంగానే అంబేద్కర్ 125వ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 320 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక గురుకులం ఏర్పాటు ఖర్చు రూ.20కోట్లు చొప్పున రూ.6,400కోట్లు వెచ్చిస్తామని, 1.75లక్షల విద్యార్థులకు అవకాశం దక్కుతుందని, 10వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. గురుకుల పాఠశాల మెయింటనెన్స్, మౌలిక వసతుల కోసం రూ.118కోట్లు, వేతనాలకు, నిర్వహణకు రూ.135కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించడానికి సర్వేల్ గురుకుల పాఠశాలను ఉన్నతంగా మార్చడానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు. సర్వేల్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలను తలదన్నే విధంగా మార్చుతామన్నారు. ఇప్పటికే రూ.1.5కోట్లు కేటాయించి, బిల్డింగ్ నిర్మిస్తున్నామని, ఆర్అండ్డీఎఫ్ కింద మరో రూ.5కోట్లు మంజూరు చేసి, టెండర్లు పిలుస్తామన్నారు. ఈ స్కూల్‌ను తీర్చిదిద్దడానికి రూ.10కోట్లు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో గురుకుల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు రిసెర్చ్ ట్రై నింగ్ సెంటర్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఉపముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ఉపాధ్యాయుడి అవతారమెత్తి 8వ తరగతి పాఠాలు బోధించారు. తెలుగులోని సంధులు, చందస్సుపై విద్యార్థులకు ప్రశ్నలు సంధించారు. సవర్ణదీర్ఘసంధిఅంటే ఏమిటి, ఉపాధ్యాయులు బోధించారా, రాజేంద్రుడు సంధిని విడదీయండంటూ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల నుంచి సరైన సమాధానం రాలేదు. మొదటగా విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి, ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయులు సరిగ్గా వస్తున్నారా, బూస్ట్ పాలు ఇస్తున్నారా, వారానికి ఎన్ని గుడ్లు అందజేస్తున్నారు, పండ్లు ఇస్తున్నారా, కూరలు ఎలా ఉన్నాయి.. అన్నం ఎలా పెడుతున్నారు, దొడ్డు బియ్యమా, సన్నబియ్యామా అంటూ విద్యార్థులను అడిగారు. కొంత మంది విద్యార్థులు అన్నంలో రాళ్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. వచ్చే వారం నుంచి వారంలో ఒకసారి మటన్, చికెన్‌లలో ఏదో ఒకటి తప్పని సరిగా అందించాలని ఆదేశించారు. సర్వేల్ గురుకుల కళాశాల తనిఖీ గురుకుల కళాశాలను ఉపముఖ్యమంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కిచెన్రూమ్ను పరిశీలించారు. ఏం వంటలు వండారంటూ, గోకరకాయను, అన్నంను నోట్లో వేసుకొని రుచి చూశారు. పప్పుచారులో పప్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉంటే బాగుండదని విద్యార్థులకు ఆహారం అందించడంలో కానీ, బోధనలో కానీ, ఎలాంటి తేడా చూపించినా, చర్యలు తీసుకుంటామని మరోసారి తనిఖీ చేస్తానని, ఎమ్మెల్యే ప్రతి నెలా పాఠశాలను, కళాశాలను తనిఖీ చేసి వారి సమస్యలను తెలుసుకుంటారన్నారు. 6 తరగతి గదులు మంజూరు ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రికి తాను చదువుతున్న సర్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇదే అని చూపడంతో, పాఠశాలకు వెంటనే 6తరగతి గదులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ శేషుకుమారి, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, జెడ్పీటీసీ సభ్యులు బొల్ల శివశంకర్, పెద్దిటి బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కత్తుల లక్ష్మయ్య, ప్రిన్సిపాళ్లు ఉపేందర్‌రెడ్డి, సీతారాం తదితరులున్నారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండలో గట్టుప్పుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006–2007 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. -
శుభలేఖ ఇచ్చేందుకు వచ్చి..
నారాయణపురం(ద్వారకాతిరుమల) : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని లారీ రూపంలో వేగంగా దూసుకువచ్చిన మృత్యువు బలితీసుకుంది. ఈ ఘటన మండలంలోని నారాయణపురం రహదారిపై గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నక్కా చిన్నారావు(60) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది. ఆయనకు సంతానం లేకపోవడంతో అన్న కుమారుడిని పెంచుకున్నాడు. చిన్నారావు మండలంలోని పి.కన్నాపురంలో నిర్మిస్తున్న కోకోకోలా ఫ్యాక్టరీలో గతంలో తనకు మేనల్లుడి వరుస అయ్యే గాడి ప్రసాద్‌తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత తిరిగి విశాఖపట్నానికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పెంచుకున్న కొడుకు పెళ్లి వచ్చేనెల 1న నిశ్చయమవడంతో చిన్నారావు తన బంధువులందరికీ శుభలేఖలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నారాయణపురంలో ఉంటున్న గాడి ప్రసాద్ ఇంటికి శుభలేఖ ఇచ్చేందుకు రెండురోజుల క్రితం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం టిఫిన్ చేసేందుకని స్థానిక పంచాయతీ కార్యాలయం రోడ్డు అవతల ఉన్న హోటల్‌కు వెళ్లేందుకు యత్నిస్తుండగా, బెంగళూరు నుంచి కోల్‌కతాకు వెళ్తున్న మినీలారీ ఢీకొంది. దీంతో చిన్నారావు అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలాన్ని భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. -
తోటపల్లి ప్రాజెక్టు షాక్
తోటపల్లి ప్రాజెక్టును రూపకల్పన చేసిన ఇంజినీరింగ్ అధికారులు దిగువున ఉన్న సాయన్న చానల్, నారాయణపురం ఆనకట్టతోపాటు పలుచోట్ల ఓపెన్‌హెడ్ రెగ్యులేటర్లను మర్చిపోయారు. సుమారు 49 వేల ఎకరాల ను సస్యశ్యామలం చేయాల్సిన నాగావళి నది డిసెంబర్ నాటికే నిర్జీవంగా మారుతుంది. సాగునీటి పరిస్థితి అటుంచితే నదీ తీర గ్రామాల్లోని బోరుబావులు సైతం ఎండిపోతున్నాయి. ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సాయన్న చానల్ పరిస్థితి ఏమిటి ? రేగిడి మండలం సంకిలి వద్ద నాగావళి నదిపై 50 ఏళ్ల క్రితంసాయన్న చానల్ ఓపెన్ హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేగిడి, సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మండలాల్లోని 12,000 ఎకరాలకు ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు పుష్కలంగా అందేది. ప్రాజెక్టు కారణంగా ఈ ఏడాది నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం నది ఏడారిని తలపిస్తోంది. ఇదీ నారాయణపురం ఆనకట్ట కథ సంతకవిటి మండలం రంగారాయపురం గ్రామం వద్ద 60 ఏళ్ల క్రితం నిర్మించిన నారాయణపురం ఆనకట్ట ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కుడి కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 18,600 ఎకరాలు, ఎడవ కాలువ ద్వారా బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని 18,700 ఎకరాలను సస్యశ్యామలం చేసేది. తోటపల్లి పుణ్యమా అని రెండు కాలువలకు సాగునీరు అందడం గగనంగా మారింది. రబీని పక్కన పెడితే ఈ ఏడాది ఖరీఫ్‌లోనే రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ ఆనకట్ట రూపురేఖలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. నాగావళి నదీ తీరంలో వ్యవసాయ పంపుసెట్లుతోపాటు బోరు బావులు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు పరిస్థితి ఇది.. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. గరిష్ట నీటి మట్టం 105 మీటర్లు. వర్షాకాలంలో ప్రొజెక్టులోకి నాగావళి ద్వారా 15 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుందని ఇరిగేషన్ అధికారులు అంచనా. ఆ సమయంలో మాత్రమే 5 వేల నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు మాత్రమే. 150 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడి చిపెడుతున్నామని చెప్పారు. ఫలితంగా సంకిలి వద్ద నాగావళి నదిలో నీరులేక సాయన్నచానల్ రెగ్యులేటర్‌కు అందడం లేదు. ఇక్కడ ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. నారాయణపురం ఆనకట్ట ఎత్తు కేవలం ఆరు అడుగులు మాత్రమే. ఇక్కడ వేసవిలో కూడా క నీసం మూడు అడుగుల నీరు నిల్వ ఉండాలి. అప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల్లో 150 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ ఆనకట్ట కింద ఆయకట్టుకు ఖరీఫ్‌లో కూడా సాగునీరు అందలేదు. దీంతో మడ్డువలస ప్రొజెక్టును ఆశ్రయించారు. -
చెట్టును ఢీకొన్న కారు: మెడికల్ విద్యార్థుల దుర్మరణం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం నారాయణపురం వద్ద ఓ కారు అదుపు తప్పి హైవేపై చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి గురైన కారు నెంబరు AP 16 CA 1199. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుపతి నారాయణపురం వద్ద YSRCP ధర్నా
-
అది విష జ్వరాల గ్రామం..
బలిజపేట(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా బలిజపేట మండలం నారాయణపురం గ్రామంలో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో దాదాపు 100మందికి పైగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు చేపట్టక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చేసేదేంలేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించడంతో వారు ప్రజలను దోచుకుంటున్నారు. కాగా, ఇదే గ్రామంలో విషజ్వరాల కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు పది రోజుల క్రితం ఒక హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆ శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలను అధికారులు వెలువరించలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు గ్రామంలోని ప్రజలకు ఎలాంటి మందులను కూడా అధికారులు అందించలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రం మలేరియా, టైపాయిడ్ సోకినట్లుగా వైద్యులు తేల్చారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు వాపోతున్నారు. -
కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో చోరీ
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని నారాయణపురం కో-ఆపరేటీవ్ సొసైటీ కార్యాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కార్యాలయం తలుపులు పగలకొట్టి లోపల ఉన్న లాకర్‌ను ధ్వంసం చేసి...అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగి కో ఆపరేటీవ్ సొసైటీ కార్యాలయానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత సొమ్ము చోరీకి గురైందనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
350 చిత్రాల్లో నటించా
నారాయణపురం (ఉంగుటూరు) : తాను ఇప్పటివరకు 350 చిత్రాల్లో నటించానని.. దేవుళ్ల పాత్రలు నటించేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు సుమన్ అన్నారు. నారాయణపురంలో శనివారం లయన్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని చిత్రాల్లో నటించారు 350 చిత్రాల్లో నటించాను. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటించా. తెలుగులో ఎన్ని చిత్రాలు నటించారు 99 చిత్రాలు నటించాను. వందో చిత్రం కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం ఏ చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో అక్షయకుమార్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నా మీకు ఎవరు స్ఫూర్తి అభిమానులే నాకు స్ఫూర్తి వారి ఆశీస్సులే దీవెనలు. ఎవరి స్ఫూర్తితో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాన మోడీ ‘స్వచ్ఛ భారత్’ పిలుపు నాకెంతగానో స్ఫూర్తినిచ్చింది. -
శాంతి.. అశాంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్, సంతకవిటి, పాలకొండ:శ్రీకాకుళం వద్ద శాంతించిన నాగావళి.. సంతకవిటి, పాలకొండ తదితర మండలాల్లో మాత్రం ఇప్పటికీ ఉగ్రరూపంతోనే విరుచుకుపడుతోంది. వరద ఉద్ధృతికి కాలువలకు గండ్లు పడటంతో సుమారు 16 గ్రామాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోమవారం ఉదయం నుంచి వరదతో పోటెత్తిన నాగావళి శ్రీకాకుళం, పట్టణంతోపాటు 11 మండలాల్లోని 107 తీరగ్రామాలను వణికించింది. సోమవారం రాత్రి శ్రీకాకుళం పాతబ్రిడ్జి వద్ద సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల స్థాయిలో ఉన్న వరద ప్రవాహం.. ఒకదశలో 2 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని.. శ్రీకాకుళం పట్టణానికి వరద ముప్పు ఉండవచ్చని అధికారులు సైతం ఆందోళన చెందిన పట్టణంలో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మంగళవారం ఉదయం నుంచి ప్రవాహం కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పాతబ్రిడ్జి వద్ద 1,32,400 క్యూసెక్కుల నీరు ఉంది. వరద ముప్పు తప్పడంతో పట్టణంతోపాటు పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎత్తివేశారు. అయితే నాగావ ళి వరద కారణంగా ఇప్పటికే శ్రీకాకుళం, పొందూరు, సంతకవిటి, పాలకొండ, ఆమదాలవలస, బూర్జ మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సుమారు 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నారాయణపురం వద్ద ఉద్ధృతంగానే.. అయితే నారాయణపురం ఆనకట్ట పరిసర మండలాల్లో వరద ఇంకా ఉద్ధృతంగానే ఉంది. దీనివల్ల సంతకవిటి మండలంలో నారాయణపురం కాలువకు వాసుదేవపట్నం, కేఆర్‌పురం గ్రామాల వద్ద గండ్లు పడటంతో సుమారు 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం రాత్రి వాసుదేవపట్నం వద్ద కాలువకు గండి పడటంతో గోళ్ళవలస, చిన్నయ్యపేట, మందరాడ, కాకరాపల్లి, మేడమర్తి, హొంజరాం, బూరాడపేట తదితర గ్రామాలు జలమయమయ్యాయి. మొత్తం ఐదువేల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. మరోవైపు కేఆర్‌పురం వద్ద గండి పడటంతో జావాం, కొత్తూరు, రామచంద్రపురం, రంగారాయపురం, పోతులుజగ్గుపేట, తమరాం, బూరాడపేట, తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాలకొండ మండలంలో అన్నవరం, అంపిలి గ్రామాలు వరద నీటితో సోమవారం రాత్రి జలమయమయ్యాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరదనీరు ఇళ్లలోకి చేరడంతో డాబాలపైకి చేరుకొని కాలం గడిపారు. -
నేడు ఎమ్మెల్సీగా ‘కర్నె’ ప్రమాణ స్వీకారం
సంస్థాన్ నారాయణపురం :టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీగా రాజ్‌భవన్‌లో గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కర్నె ప్రభాకర్ సొంతూరు సంస్థాన్ నారాయణపురం. ప్రభాకర్ తల్లిదండ్రులు జంగప్ప, శివలీల. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు కర్నె ప్రభాకర్. ఈయన పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్, ఎస్ఎల్ఎన్ ఎస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం జర్నలిజం కూడా చేశారు. సంస్థాన్‌నారాయణపురానికి చెందిన స్వాతిని వివాహమాడారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వీరిలో కూతుళ్లిద్దరూ కవలలు ఇందుశ్రీ, సింధుశ్రీ, కుమారుడు రవిచరణ్. కర్నె.. రాజకీయాల్లోకి రాకముందు పలుచోట్ల సూపర్వైజ ర్గా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవి ర్భావంతో ఆ పార్టీలో చేరారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కర్నెకు తగిన న్యాయం చేస్తానని కేసీఆర్ ముందునుంచీ చెబుతూ వస్తున్నారు. అం దులో భాగంగా గవర్నర్ కోటాలో భర్తీ చేసే మూడో ఎమ్మెల్సీని కర్నె ప్రభాకర్‌కు కట్టబెడుతున్నట్టు స్వయంగా కేసీఆరే ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రమాణస్వీకారోత్సవానికి సంస్థాన్ నారాయణపురం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలనున్నారు. ‘సంస్థాన్’కు దక్కిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన ఇన్నేళ్లలో మొట్టమొదటి సారి సంస్థాన్‌నారాయణపురం మండలానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా మండలంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగవారిగూడానికి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. అలాగే సంస్థాన్‌నారాయణపురానికి చెందిన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. మండలా చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నత స్థానాలలో ఉండటంతో సంస్థాన్ నారాయణపురం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
తుంగా పరవళ్లు.. కృష్ణమ్మ ఉరకలు
కర్నూలు రూరల్: కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర, కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. నిండు కుండలను తలపిస్తున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండటంతో తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల్లో ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా తుంగభద్ర, కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో నీరు అడుగంటడం అన్నదాతను ఆందోళనకు గురిచేసింది. వరుణుడు ఆలస్యంగానైనా కరుణించడంతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులకు జల కళ వస్తోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నిండటంతో శనివారం 10 గేట్లను రెండు మీటర్లు పెకైత్తి 22వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ జలాలు జిల్లాకు చేరనున్నాయి. ఈ దృష్ట్యా నీటి పారుదల శాఖ అధికారులు రెండు రోజుల ముందు నుంచే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ రెండు రోజులకే 10 అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 842 అడుగులకు చేరుకోగా.. 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాధారణంగా ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంటే పోతిరెడ్డిపాడుకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ సర్కిల్ 1, 2లకు శ్రీశైలం జలాలను విడుదల చేయాలంటే ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు అనుమతించాల్సి ఉంది. గతంలో నీటి విడుదలను నిర్ణయించే శివం కమిటీని రాష్ట్ర విభజన తర్వాత రద్దు చేసి కృష్ణా బోర్డులను ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పది రోజుల్లో శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో కొనసాగితే మరో పది రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. 854 అడుగులకు చేరుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోతిరెడ్డిపాడు ఆధారిత సాగునీటి ప్రాజెక్టులకు నీటి విడుదల నిర్ణయిస్తాం. నీటి లభ్యత ఆధారంగా వాటాలను కేటాయించారు. - కాశీ విశ్వేశ్వరరావు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ -
వడదెబ్బతో ఏడుగురి మృతి
చిలుకూరు, న్యూస్‌లైన్: మండలంలోని నారాయణపురంలో శనివారం ఓ మహిళ వడదెబ్బతో మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన భూర నాగమణి (55) రెండు రోజుల క్రితం పాలారంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. ఎండలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురైంది. అక్కడి నుంచి స్వగ్రామం వచ్చిన నాగమణి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. చిల్లేపల్లిలో... చిల్లేపల్లి, (నేరేడుచర్ల): మండలంలోని చిల్లేపల్లి గ్రామానికి చెందిన బండా ఈశ్వరమ్మ(52) వడదెబ్బతో మృతి చెందింది. శుక్రవారం ఉపాధి పనులకు వెళ్లిన ఈశ్వరమ్మ.. ఇంటికి వచ్చిన అనంతరం అస్వస్థతకుగురైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతిపట్ల ఉపాధిహామీ ఏపీవో శేఖర్ సంతాపం ప్రకటించారు. చల్లూరులో... చల్లూరు(రాజాపేట): మండలంలోని చల్లూరులో మీస అయిలయ్య (55) అనే వికలాంగుడు రోజు మాదిరిగానే శుక్రవారం మేకలు తోలుకుని అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వల్లాపురంలో... వల్లాపురం(నడిగూడెం): మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన నూకపంగు తిరపమ్మ(70) మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురైంది. ఆమె ఇంటి వద్దనే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కనగల్‌లో... కనగల్: మండలంలోని పడిగిమర్రిలో సుంకిరెడ్డి చంద్రారెడ్డి(62) అనే వృద్ధుడు శనివారం వడదెబ్బతోమృతి చెందాడు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినట్లు స్థానిక సర్పంచ్ జగాల్‌రెడ్డి తెలిపారు. పాల సంఘం చైర్మన్ మృతి కప్రాయపెల్లి(ఆత్మకూరు(ఎం): మండలంలోని కప్రాయపెల్లి పాల సంఘం అధ్యక్షుడు మందడి నర్సిరెడ్డి(48) వడదెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందా రు. శుక్రవారం పశువులను మేపడానికి పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం అతనికి వాంతులు, విరేచనాలు అవుతుండటంతో మోత్కూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మందడి నర్సిరెడ్డి తెలుగు రైతు మండల అధ్యక్షుడిగాను కొనసాగారు. అంత్యక్రియలు శనివారం కప్రాయపెల్లిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో స్థానిక సర్పంచ్ బొట్టు మల్లమ్మ, ఎంపీటీసీ సభ్యులు కాంభోజు భాగ్య శ్రీ, వివిధ పార్టీల నాయకులు పూర్ణచందర్ రాజు, హేమలత, బొట్టు అబ్బయ్య, కాంబోజు భాను, నూనెముంతల బుచ్చిరాములు పాల్గొన్నారు. మిర్యాలగూడలో... మిర్యాలగూడ: పట్టణంలో ని ఈదులగూడకు చెందిన పుట్టపాక పార్వతమ్మ (65) వడదెబ్బతో మృతి చెందిం ది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పశువుల వద్దకు వెళ్లిన పార్వతమ్మ వడదెబ్బకు గురైంది. స్పృహ కోల్పయి మధ్యాహ్నం మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని కౌన్సిలర్ ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. -
ఆపదలో ఆమె
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో రోజురోజుకూ బాలికల నిష్పత్తి పూర్తిగా పడిపోతోంది. ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే అంతమొందిస్తున్నారు. స్కానింగ్ సెంటర్లపై జిల్లా యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసినా లింగనిర్ధారణ పరీక్షలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు మొబైల్ స్కానింగ్‌సెంటర్లు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా తిరిగి పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 110కి పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పతి గర్భిణీకి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి డబ్బులు దండుకోవడంతో పాటు ఆడ, మగ అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే వెంటనే అబార్షన్లను చేయిస్తున్నారు. దీని కారణంగా జిల్లాలోని ఒక్క మోత్కూరు మండలం మినహా మిగతా 58 మండలాలలో ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలో సగటున 0నుంచి 6 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ప్రతి వెయ్యి మంది బాలురకు 921మంది బాలికలే ఉన్నారు. మోత్కూరు మండలంలో మాత్రం 2001లో వెయ్యిమంది బాలురకు 954మంది బాలికలు ఉండగా, 2011నాటికి వారి సంఖ్య వెయ్యికి చేరింది. దీంతో మండలంలో బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉంది. ముఖ్యంగా సంస్థాన్ నారాయణపురం, చందంపేట, మునుగోడు, పెద్దవూర, త్రిపురారం, భువనగిరి, మర్రిగూడ, పోచంపల్లి, చిట్యాల, ఆత్మకూరు(ఎం), చండూరు, వలిగొండ, తుంగతుర్తి, నూతన్‌కల్ మండలాల్లో గణనీయంగా ఆడపిల్లల నిష్పత్తి పడిపోయింది. దీనికి కారణం జిల్లాలో గర్ధస్త పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయకపొవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన నిర్వాహకులు, చేయించుకున్న వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులే. జిల్లా వ్యాప్తంగా ఉన్నస్కానింగ్ సెంటర్లు, ఇతర జిల్లాల నుంచి వచ్చే మొబైల్ స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పుడే బాలికల నిష్పత్తి పెరిగే అవకాశం ఉంది. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు ఆడపిల్లల నిష్పత్తి పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్కానింగ్ సెంటర్లపై నిఘాలను పెంచాలని ఆదేశించి సంబంధిత అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, అధికారుల్లో ఎలాంటి చలనం ఉంటుందో వేచి చూడాల్సిందే. -
'ఓటేసే మందు ఒక్కసారి వైఎస్‌ను గుర్తు చేసుకోండి'
రైతులు, చేనేత కార్మికులు, ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం వచ్చిన షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం తన సోదరుడు జగన్, తల్లి వైఎస్ విజయమ్మ చేసిన దీక్షలను ఈ సందర్భంగా షర్మిల ప్రజలకు వివరించారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం ఇచ్చేందుకు జగన్నన సిద్ధంగా ఉన్నాడని అన్నారు. ఒక్కసారి జగనన్నకు అవకాశం ఇవ్వాలని షర్మిల ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై షర్మిల తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా రైతుల రుణమాఫీ చేశారా అంటూ ప్రజలను షర్మిల ప్రశ్నించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న కనీస ఆలోచన రాలేదని.... కానీ ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లే రోగుల వద్ద నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన మాత్రం వచ్చిందని చంద్రబాబును షర్మిల దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం పంచాయతీని కనీసం మున్సిపాటిలీ కూడా చేయని ఆయన... ఈ రో జు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మలేషియా, సింగపూర్, జపాన్ చేస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే ముందు ఒక్కసారి తన తండ్రి వైఎస్ఆర్ను గుర్తు చేసుకోవాలని షర్మిల ప్రజలను కోరారు. -
నారాయణపురంలో వైఎస్ షర్మిల ప్రసంగం
-
ధర లేక దిగాలు
గత ఖరీఫ్‌లో ఉల్లి పంటను సాగు చేసిన రైతులకు లాభాలు వచ్చాయి. పెట్టుబడులు పోను అంతో ఇంతో మిగిలింది. అదే ఆశతో.. రబీలోనూ వ్యవసాయ బోర్లు, కాలువల కింద ఉల్లి పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడి బాగా వచ్చినా.. ధర వెక్కిరిస్తోంది. క్వింటా ఉల్లి ధర రబీలో సగటున రూ.1500 పలికింది. ఇప్పుడు ఒక్కసారిగా రూ.400కు పడిపోయింది. ఉల్లి గడ్డల బస్తాలను ఇంట్లో పెట్టుకుని గిట్టుబాటు కాని ధరతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఎప్పుడు కలిసొస్తుందో.. ఎప్పుడు ముంచుతుందో తెలియని వ్యవసాయం ఎన్నో కుటుంబాల స్థితిగతులను తలకిందులు చేస్తోంది. ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం, నాగనాథనహళ్లి, ఢణాపురం, నారాయణాపురం గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో ఉల్లి పంట సాగయింది. సుమారు 12 వేల క్వింటాళ్ల ఉల్లి గడ్డల దిగుబడి వచ్చింది. తాడేపల్లిగూడెం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి అమ్ముకుందామంటే ధర నేల చూపు చూడటంతో విధిలేక స్థానికంగానే వచ్చిన రేటుతో సరిపెట్టుకుంటున్నారు. పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే రోజు కోసం ఉల్లి రైతులు ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా రూ.మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుపై హామీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ వైపు అడుగులేస్తున్నారు. -
బీడీఎల్ అధికారులపై గిరిజనుల దాడి
నల్లొండ : నల్గొండలో గిరిజనుల ఆందోళనతో బుధవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. క్షిపణి ప్రయోగ స్థల పరిశోధనకు నారాయణపురం మండలం ఐదు బోనాల తండాకు వచ్చిన బీడీఎల్ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కిరోసిన్ పోశారు. క్షిపణి ప్రయోగానికి స్థలం ఇచ్చేది లేదంటూ అధికారులు వచ్చిన వాహనాలకు ధ్వసం చేసి అద్దాలు పగులగొట్టారు. గిరిజనులు ఒక్కసారిగా రెచ్చిపోవటంతో అధికారులు మిన్నుకుండిపోయారు. అనంతరం చేసేది లేక వెనుదిరిగారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ తాము క్షిపణి ప్రయోగానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తామో.... అధికారులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇక నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని రాచకొండ గుట్టల్లో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. దీనికి స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముందుకు వెళ్లడానికే ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు.. ఈప్రాంతంలో రాచకొండ ఫైల్డ్ ఫీరింగ్ రేంజ్ (ఆర్ఎఫ్ఎఫ్ఆర్) ఏర్పాటు నిమిత్తం ఆర్మీకి ఇచ్చేందుకు నిర్ణయించిన 6975.39 హెక్టార్ల అటవీ భూమిలో 5360.11 హెక్టార్ల భూమిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ప్రజలను కలవకుండా ఎవరు ఆపలేరు
-
రైతు రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి: విజయమ్మ
-
రైతు రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి: విజయమ్మ
నారాయణపురం : అకాల వర్షాలతో నిండా మునిగిన అన్నదాతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓదార్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో ఆమె సోమవారం పర్యటించారు. ముంపు పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యం, మొక్క జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో పంటపొలాలను పరిశీలించిన అనంతరం వైఎస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడారు.రుణాలు రీషెడ్యూల్కు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతులను సాయం అందించి ఆదుకోవాలన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం వస్తుందన్ని విజయమ్మ బాధితులకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా పర్యటన ముగించుకున్నవైఎస్ విజయమ్మ వరద బాధితులను పరామర్శించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు అంతకు ముందు ముస్తాబాద్‌లో వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీకూతుళ్లు మస్తాన్, పర్వీన్ కుటుంబసభ్యులను విజయమ్మ పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వరదల కారణంగా కరెంట్‌షాక్ తగిలి మరణించిన రాము అనే యువకుడి కుటుంబాన్ని కూడా విజయమ్మ పరామర్శించారు. కన్నీరుమున్నీరైన రాము తల్లిని ఓదార్చారు. -
వివక్ష ఎందుకు ?
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: అధికారిక లెక్కల ప్రకారం మన జిల్లాలో 10 మండలాలలో బాలికల, బాలుర నిష్పత్తిలో చాలా తేడా ఉంది. అందులో సంస్థాన్‌నారాయణపురం మండలంలో అతితక్కువ బాలికలు ఉన్నట్లు నమోదైంది. ఎక్కువగా గిరిజన ప్రాంతాలు, నిరక్షరాస్యత అధికంగా ఉన్న మండలాలలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు వరుసగా నారాయణపురం 832, చందంపేట 834, మునుగోడు 842, పెద్దవూర 849, త్రిపురారం 853, మర్రిగూడ 863, భూదాన్‌పోచంపల్లి 867, చిట్యాల 883, ఆత్మకూరు(ఎం) 892, వలిగొండ 894 మంది మాత్రమే బాలికలు ఉన్నారు. పాఠశాలలో సైతం లింగవివక్ష ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో కూడా బాలుర, బాలికల మధ్య లింగ వివక్ష కొనసాగుతుంది. తల్లిదండ్రులు ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలకు, అదే అబ్బాయిలను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ వివక్ష ప్రదర్శిస్తున్నారు. పోచంపల్లి మండలాన్ని తీసుకుంటే గౌస్కొండతండా ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు బాలురులు ఉండగా 14 మంది బాలికలు ఉన్నారు. గౌస్‌కొండలో బాలురు 6, బాలికలు 24, దంతూర్లో బాలురు 15, బాలికలు 33, వంకమామిడి హైస్కూల్లో 20 మంది బాలురు ఉండగా బాలికలు 42, జూలూరులో 73 మంది బాలురు, 132 మంది బాలికలు ఉన్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలో బాలురు అధికంగాను , బాలికలు తక్కువగా ఉన్నారు. ఇలా బడికి పంపే విషయంలో కూడా లింగ వివక్షను ప్రదర్శిస్తున్నారు. లింగ వివక్షకు కారణాలు ఏమిటి ? అనాదిగా తల్లిదండ్రులు ఆడ పిల్లల పట్ల వివక్షను చూపుతున్నారు. ఆడపిల్ల పుడితే బాధపడటం, అదే మగ బిడ్డ పుడితే పండగలు చేస్తుంటారు. పౌష్టికాహారం, విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ విషయంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతుంది. అదీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, నిరక్షరాస్యులలో ఎక్కువగా కనిపిస్తుంది. మనం కోసం మనం అనే కార్యక్రమంలో లింగ వివక్షను రూపుమాపడానికి గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షుడిగా, వీఆర్వో కన్వీనర్‌గా ఉంటారు. వీరు వంద రోజులలో గ్రామస్తుల సహకారంతో భ్రూణ హత్యలు, లింగ వివక్షపై ప్రజలను చైతన్యం చేస్తారు. -
పిడుగు కాటుతోమృత్యు ఘోష వినిపించింది
రాకరాక వచ్చిన వర్షం జిల్లా రైతుల్లో హర్షం నింపగా.... రెండుకుటుంబాల్లో మాత్రం విషాదం కుమ్మరించింది. ఊరించి, ఊరించి కురిసిన వాన తనతో పాటు యమపాశాన్ని తీసుకొచ్చింది. అమృతధారలు కురిపించి ధాన్యరాశులను పండించవలసిన చోట మృత్యు ఘోష వినిపించింది. బతుకు పండించుకోవాలని భాగానికి పొలం తీసుకున్న బడుగుజీవి కుటుంబానికి దిక్కులేకుండా చేసింది. కొడుకు కళ్లెదుటే తండ్రిని మరణశయ్యపై ఎక్కించింది. ఎస్.కోట మండలం కొట్టాం గ్రామ సమీపంలో సోమవారం పిడుగుపడడంతో ఒక వ్యవసాయ కూలీ, రైతు మృతి చెందారు. దీంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... కొట్టాం(శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్: కొట్టాం గ్రామ సమీపంలో ఉన్న నడిమిడెప్పి దగ్గర వ్యవసాయ పనుల కోసం వ్యవసాయ కూలీ గుర్రపు ముత్యాలు తాను భాగానికి చేస్తున్న పొలంలో పారతో గట్లను సరి చేసేందుకు మరో కూలీ కురుపిల్లి బుచ్చులతో కలిసి వెళ్లాడు. అక్కడకు దగ్గరలో ఉన్న తన పొలంలో వ్యవసాయపనులు చేసేందుకు అదే గ్రామానికి చెందిన రైతు బొడ్డు సూర్యారావు కూడా తన పెద్ద కుమారుడు బొడ్డు అవతారంతో పాటు రైతులు బొడ్డు అప్పన్న, బొడ్డు సింహాద్రిలతో కలిసి వెళ్లారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వర్షం పడడంతో వారంతా తమ పొలాలకు దగ్గరలో ఉన్న నక్కిడి చెట్టు కిందకు చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడడంతో గుర్రపు ముత్యాలు, బొడ్డు సూర్యారావు అక్కడికక్కడే మృతి చెందారు. అవతారం,బొడ్డు అప్పన్న, బొడ్డు సింహాద్రి, కురుపిల్లి బుచ్చులు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తుల్లో కొందరు గ్రామస్తులకు సమాచారం అందజేయడంతో వారు సం ఘటనా స్థలానికి వచ్చి మిగతా క్షతగాత్రులను జామి పీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రుల్లో బొడ్డు అప్పన్న పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని కేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు. కాగా మృతుల్లో గుర్రపు ముత్యాలు వ్యవసాయ కూలీ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. ఆయనకు భార్య నారాయణమ్మ, కుమార్తెలు కోటలక్ష్మి, పార్వ తి, కుమారుడు సురేష్ ఉన్నారు. మరో మృతుడు బొడ్డు సూర్యారావుకు భార్య కోట మ్మ, కుమారులు అవతారం, ప్రసాద్, కుమార్తె ప్రభ ఉన్నారు. మృతుడు సూర్యారావు చిన్న కుమారుడు బొడ్డు ప్రసాద్ చిత్తూరు జిల్లా నగ రి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పని చేస్తున్నారు. విషాదంలో కొట్టాం పిడుగుపాటుకు కొట్టాం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటు మరో నలుగురు గాయపడడంతో గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. గ్రామానికి చెందిన వారంతా మృతుల కుటుంబీకులను పరామ ర్శించి వారిని ఓదార్చుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి పిడుగుపాటుకు మృతి చెందిన గుర్రపు ముత్యాలు, బొడ్డు సూర్యారావు కుటుంబాలతో పాటు గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామ మాజీ సర్పంచులు జి. నారాయణమూర్తి, ఎస్. కోటారావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తూర్పాటి శ్రీను, తదితరులు కోరుతున్నారు. కాగా వీఆర్ఓ పి. అప్పల గురువులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎ సంతోష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని హెచ్‌సీలు వెంకటరావు, నాగేశ్వరరావు పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. -
కొనసాగుతున్న నిరసనల హోరు జంక్షన్లు జామ్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది. రాష్ర్ట విభజన ప్రకటనకు వ్యతిరేకంగా జిల్లాలో అన్ని వర్గాల వారు ఆందోళన పట్టారు. సోమవారం కూడా ఈ నిరసనల హోరు ఇసుమంతైనా తగ్గలేదు. పలు కూడళ్ల వద్ద, జాతీయ రహదారిపై సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి, టైర్లను తగలబెట్టడంతో చాటా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యాసంస్థలు ఈ నెల 11 వరకు బంద్ ప్రకటించగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. మద్యం దుకాణాలను కూడా సమైక్యవాదులు బంద్ చేయిస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇంటి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ధర్నా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం శివారుప్రాంతంలోని మజ్జిపేట కాలనీ వద్ద విజయనగరం నుంచి విశాఖ వెళుతున్న దుర్గ్ పాసింజర్, విశాఖ నుంచి విజయనగరం వస్తున్న గూడ్స్ రైలును ఆందోళనకారులు అరగంటపాటు అడ్డుకున్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులంతా నోటికి నల్ల రిబ్బన్లు తగిలించుకుని మౌన దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్, దిగ్విజయ్ సింగ్, షిండే, సోనియా మాస్కులు ధరించిన వ్యక్తులను ఇనుప సంకెళ్లతో బంధించి ఊరేగించారు. టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. విజయనగరంలో ఉద్యమాలు అధిక సంఖ్యలో జరగటంతో పట్టణానికి రాకపోకలు స్తంభించాయి. ఆటోవాలాలు తమ వాహనాలను తిప్పకుండా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, గజపతినగరం మార్గాల్లోని కూడళ్లలో నిరసన కారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. శ్రీకాకుళం వెళ్లే రూటులో జమ్మునారాయణపురం వద్ద భారీ చెట్టును ఆందోళన కారులు నరికి వేసి రోడ్డుకు అడ్డంగా పడవేశారు. అలాగే విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రహదారిలో కోర్టు జంక్షన్, వీటీ అగ్రహారం జంక్షన్ల వద్ద ఆందోళనకారులు ఉదయం 6 నుంచే రహదారులకు అడ్డంగా పెద్ద మొత్తంలో టైర్లను కాల్చి పడేశారు. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడంతో జాతీయ రహదారుల్లో భారీ వాహనాలు బారులు తీరాయి. రాష్ర్ట కమిటీ పిలుపు నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో మోటార్ వాహనాల ర్యాలీ జరిగింది. అలాగే స్థానిక కోట జంక్షన్ వద్ద బహిరంగ సభ జరిగింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా బంద్ పాల్గొనడంతో సర్వీసులు రద్దయ్యాయి. నెల్లిమర్ల నియోజక వర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు విధులను బహిష్కరించి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భోగాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళన కారులు ఓ వైపు వంటా వార్పు కార్యక్రమం చేపడుతూనే మరోవైపు వాలీబాల్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే డెంకాడలోని నాతవలస రహదారిని స్థానికులు రోజంతా దిగ్భందించారు. పూసపాటిరేగ మండలంలో సైతం జాతీయ రహదారిని ఆందోళన కారులు దిగ్బంధించారు. ఎస్.కోటలో గాంధీపార్క్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమైక్యవాదులు పాలాభిషేకం చేశారు. సర్వేపల్లి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర ’ అక్షరాల ఆకృతిలో మానవహారంగా ఏర్పాటై నిరసన వ్యక్తం చేశారు. వెయ్యి మంది విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్ కూడలి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం జరిగింది. ైవె ఎస్ఆర్ సీపీ నియోజక వర్గ సమన్వయ కర్త జి.ఉదయభాను ఆధ్వర్యంలో బాయ్స్ ఆర్సీఎం స్కూల్ విద్యార్థులు, కార్యకర్తలతో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. నర్సిపురంలో యువత ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. దీంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని చినమేరంగిలో సుమారు రెండు వేల మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్ బజార్లో సోనియా, బొత్స, కేసీఆర్, మన్మోహన్సింగ్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గజపతినగరం మండలంలోని మరుపల్లిలో పాలిటెక్నికల్ విద్యార్థులు ఖాళీ కంచాలతో రోడ్డుపై బైఠాయించారు. మర్రివలస గ్రామంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా గజపతినగరం నుంచి మెంటాడ వెళ్లే ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా సుమారు 3గ ంటల పాటు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ప్రెస్‌క్లబ్ సభ్యులు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా నిలబడ్డారు. చీపురుపల్లి మండలంలో మెట్టపల్లి గ్రామస్తులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేసి చీపురుపల్లి మూడు రోడ్లు జంక్షన్ వరకు వచ్చి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఐదుగురు విద్యార్థులు గుండ్లు గీయించుకొని సమైక్యాంధ్రకు మద్ధతుగా నిరసన తెలిపారు. సాలూరు బోసుబొమ్మ కూడలిలో వాసవి కళాశాల విద్యార్థులు మానవహారం చేశారు. బైక్ మోకానిక్ యూనియన్ మోటార్ బైక్‌ల ర్యాలీ నిర్వహించింది. అనంతరం కేసీఆర్, సోనియా, బొత్సల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేశారు. న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. నేడు కొనసాగనున్న ఆందోళనలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోట నుంచి గంటస్తంభం వరకు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రేమసమాజంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కళాకారులతో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. -
సడలని సంకల్పం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకూ ప్రతి ఊరూ ఉద్యమ వేడితో అట్టుడుకుతోంది. పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ పోరుబాట పడుతున్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని వారి ఇళ్లును పెద్ద ఎత్తున ముట్టడిస్తున్నారు. సమైక్య నినాదాలు మిన్నంటుతున్నాయి. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభ జనపై జిల్లాలోని సమైక్యవాదులు శనివారం కూడా కదం తొక్కారు. సాలూరు పట్టణంలో వేలాది మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ నిర్వహించారు. సోనియా గాంధీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొందరు రాజీవ్ విగ్రహానికి నిప్పంటించారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. బొబ్బిలి నియోజవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ అరుకు పార్లమెంట్ పరిశీలకుడు బేబీనాయన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు సుమారు రెండు గంటల పాటు ఆర్టీసీ కూడలిలో మానవహారం నిర్వహించారు. ‘సోనియమ్మా.. ఢిల్లీలో బొమ్మ.. ఇటలీ నుంచి వచ్చి సఖ్యత కుటుంబాన్ని విడదీశావమ్మా’ అంటూ పాటల పాడారు. బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మకి పాడె కట్టి మున్సిపల్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్, కోర్టు గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను చితిపై ఉంచి నిప్పంటించారు. మండల కార్యాలయం ఉద్యోగులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వంటావార్పు చేసి రోడ్డుపైనే భోజనాలు చేశారు. విజయనగరం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యం లో నిరసన ప్రదర్శన చేపట్టారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మోటారు వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించారు. విజయనగరంలో వివిధ మీడియా సంస్థ ల్లో విధులు నిర్వహిస్తున్న వీడియో, ఫోటో జర్నలిస్టులు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బొత్స అప్పల నరసయ్య క్యాంపు కార్యాలయాన్ని జేఏసీ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే విజయనగరం-ఎస్.కోట రహదారిలో సమైక్యాంధ్రకు మద్దతుగా కళాశాల విద్యార్థు లు 500 మంది పైగా రాస్తారోకో నిర్వహించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పురుపల్లి మండలంలో గచ్చలవలస జంక్షన్ వద్ద సోనియా, దిగ్విజయ్‌సింగ్, మంత్రి బొత్సలకు పిండ ప్రదానం చేశారు. చీపురుపల్లి పట్టణంలో జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రైల్‌రోకో, ప్రధాన రహదారిపై వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు గద్దే బాబూరావు, కోట్ల సూర్యనారాయణల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో చేశారు. శృంగవరపుకోటలో సమైక్యాంధ్ర కోసం సంతకాల సేకరణ నిర్వహించారు. లక్కవరపుకోట వరకు జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. అలాగే పార్వతీపురంలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భోగాపురంలో సమైక్యాంధ్ర కు మద్దతుగా రాస్తారోకో చేపట్టారు. మూడు గంటల పాటు 5వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల్లిమర్ల నగర పంచాయతీ లో, కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జియ్యమ్మవలసలో కేసీఆర్, బొత్స, సోనియా దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ఎమ్మెల్యే పదవికి బొత్స రాజీనామా సమైక్యాంధ్రకు మద్దతుగా తాను రాజీ నామా చేసినట్లు గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్పలసరస య్య ప్రకటించారు. తన రాజీనామా ప త్రాన్ని గాంధీభవన్‌లోని పీసీసీ అధ్యక్షు లు బొత్స సత్యనారాయణకు అందజేశానన్నారు. తనతో పాటు సాలూరు ఎమ్మె ల్యే పీడీక రాజన్నదొర కూడా తన రాజీ నామాపత్రాన్నిఅందజేసినట్లుతెలిపారు.