గత ఖరీఫ్‌లో ఉల్లి పంటను సాగు చేసిన రైతులకు లాభాలు వచ్చాయి. పెట్టుబడులు పోను అంతో ఇంతో మిగిలింది. అదే ఆశతో.. రబీలోనూ వ్యవసాయ బోర్లు, కాలువల కింద ఉల్లి పంట సాగు చేశారు.
గత ఖరీఫ్‌లో ఉల్లి పంటను సాగు చేసిన రైతులకు లాభాలు వచ్చాయి. పెట్టుబడులు పోను అంతో ఇంతో మిగిలింది. అదే ఆశతో.. రబీలోనూ వ్యవసాయ బోర్లు, కాలువల కింద ఉల్లి పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడి బాగా వచ్చినా.. ధర వెక్కిరిస్తోంది. క్వింటా ఉల్లి ధర రబీలో సగటున రూ.1500 పలికింది. ఇప్పుడు ఒక్కసారిగా రూ.400కు పడిపోయింది. ఉల్లి గడ్డల బస్తాలను ఇంట్లో పెట్టుకుని గిట్టుబాటు కాని ధరతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఎప్పుడు కలిసొస్తుందో.. ఎప్పుడు ముంచుతుందో తెలియని వ్యవసాయం ఎన్నో కుటుంబాల స్థితిగతులను తలకిందులు చేస్తోంది.
ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం, నాగనాథనహళ్లి, ఢణాపురం, నారాయణాపురం గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో ఉల్లి పంట సాగయింది. సుమారు 12 వేల క్వింటాళ్ల ఉల్లి గడ్డల దిగుబడి వచ్చింది. తాడేపల్లిగూడెం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి అమ్ముకుందామంటే ధర నేల చూపు చూడటంతో విధిలేక స్థానికంగానే వచ్చిన రేటుతో సరిపెట్టుకుంటున్నారు. పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే రోజు కోసం ఉల్లి రైతులు ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా రూ.మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుపై హామీ ఇచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ వైపు అడుగులేస్తున్నారు.