ఏప్రిల్ 4న జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక
ఏప్రిల్ 4న జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక
Published Wed, Mar 1 2017 6:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
నారాయణపురం (ఉంగుటూరు) : జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక ఏప్రిల్ 4న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు బడేటి వెంకట్రామయ్య తెలిపారు. బుధవారం స్థానిక సమతా గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో అసోసియేషన్ అడ్‌హాక్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకులు సమక్షంలో ఎన్నిక నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లా క్రీడా సంఘాలన్నీ గుర్తింపు పత్రాలను మార్చి 10వ తేదీలోపు అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ ఆదిరెడ్డి సత్యనారాయణకు అందజేసి నమోదు చేయించుకోవాలన్నారు.
అడ్‌హాక్ కమిటీ ఎన్నిక ..ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అడ్‌హాక్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బడేటి వెంకట్రామయ్య, కన్వీనర్‌గా ఆదిరెడ్డి సత్యనారాయణ, సభ్యులుగా వి.శ్రీనివాసరాజు, డి.నారాయణరాజు, పీఎస్ సుధాకర్ ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement