రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకూ ప్రతి ఊరూ ఉద్యమ వేడితో అట్టుడుకుతోంది.
సడలని సంకల్పం
Published Sun, Aug 4 2013 5:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకూ ప్రతి ఊరూ ఉద్యమ వేడితో అట్టుడుకుతోంది. పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ పోరుబాట పడుతున్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని వారి ఇళ్లును పెద్ద ఎత్తున ముట్టడిస్తున్నారు. సమైక్య నినాదాలు మిన్నంటుతున్నాయి. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర విభ జనపై జిల్లాలోని సమైక్యవాదులు శనివారం కూడా కదం తొక్కారు. సాలూరు పట్టణంలో వేలాది మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ నిర్వహించారు. సోనియా గాంధీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొందరు రాజీవ్ విగ్రహానికి నిప్పంటించారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. బొబ్బిలి నియోజవర్గ కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ అరుకు పార్లమెంట్ పరిశీలకుడు బేబీనాయన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు సుమారు రెండు గంటల పాటు ఆర్టీసీ కూడలిలో మానవహారం నిర్వహించారు. ‘సోనియమ్మా.. ఢిల్లీలో బొమ్మ.. ఇటలీ నుంచి వచ్చి సఖ్యత కుటుంబాన్ని విడదీశావమ్మా’ అంటూ పాటల పాడారు. బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మకి పాడె కట్టి మున్సిపల్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
బార్ అసోసియేషన్, కోర్టు గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను చితిపై ఉంచి నిప్పంటించారు. మండల కార్యాలయం ఉద్యోగులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వంటావార్పు చేసి రోడ్డుపైనే భోజనాలు చేశారు. విజయనగరం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యం లో నిరసన ప్రదర్శన చేపట్టారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మోటారు వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించారు. విజయనగరంలో వివిధ మీడియా సంస్థ ల్లో విధులు నిర్వహిస్తున్న వీడియో, ఫోటో జర్నలిస్టులు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బొత్స అప్పల నరసయ్య క్యాంపు కార్యాలయాన్ని జేఏసీ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే విజయనగరం-ఎస్.కోట రహదారిలో సమైక్యాంధ్రకు మద్దతుగా కళాశాల విద్యార్థు లు 500 మంది పైగా రాస్తారోకో నిర్వహించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పురుపల్లి మండలంలో గచ్చలవలస జంక్షన్ వద్ద సోనియా, దిగ్విజయ్‌సింగ్, మంత్రి బొత్సలకు పిండ ప్రదానం చేశారు.
చీపురుపల్లి పట్టణంలో జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రైల్‌రోకో, ప్రధాన రహదారిపై వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు గద్దే బాబూరావు, కోట్ల సూర్యనారాయణల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో చేశారు. శృంగవరపుకోటలో సమైక్యాంధ్ర కోసం సంతకాల సేకరణ నిర్వహించారు. లక్కవరపుకోట వరకు జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. అలాగే పార్వతీపురంలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భోగాపురంలో సమైక్యాంధ్ర కు మద్దతుగా రాస్తారోకో చేపట్టారు. మూడు గంటల పాటు 5వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల్లిమర్ల నగర పంచాయతీ లో, కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జియ్యమ్మవలసలో కేసీఆర్, బొత్స, సోనియా దిష్టిబొమ్మలను దహ నం చేశారు.
ఎమ్మెల్యే పదవికి బొత్స రాజీనామా
సమైక్యాంధ్రకు మద్దతుగా తాను రాజీ నామా చేసినట్లు గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్పలసరస య్య ప్రకటించారు. తన రాజీనామా ప త్రాన్ని గాంధీభవన్‌లోని పీసీసీ అధ్యక్షు లు బొత్స సత్యనారాయణకు అందజేశానన్నారు. తనతో పాటు సాలూరు ఎమ్మె ల్యే పీడీక రాజన్నదొర కూడా తన రాజీ నామాపత్రాన్నిఅందజేసినట్లుతెలిపారు.
Advertisement
Advertisement