రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన : జోరు తగ్గని పోరు | Samaikyandhra bandh against Telangana in vizianagaram | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన : జోరు తగ్గని పోరు

Published Sat, Aug 10 2013 2:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

Samaikyandhra bandh against Telangana in vizianagaram

బొబ్బిలి, న్యూస్‌లైన్ : అందరి లక్ష్యం ఒక్కటే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చాలని కోరుతూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. విద్యార్థులు, వివిధ సం ఘాల నాయకులు ఉదయూనికే రోడ్లపై వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం కూడా సమైక్యవాదుల నిరసనలు మిన్నంటారుు. సమైక్యాంధ్రకు మద్దతుగా బొబ్బిలిలో జేఎసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కేం ద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాలో కంటే సీమాంధ్రలోనే అభివృద్ధి లేదని తేల్చి చెప్పిందన్నా రు. అప్పటివరకు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామని చెప్పిన తెలంగాణావాదులు కమిటీ నివేదిక తరువాత స్వరం మార్చి సెంటిమెంట్ ను గౌరవించాలని డిమాండ్ చేశారన్నారు. 
 
 ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా రాజకీ య లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేయడం దారుణమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, విద్యార్థులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రాణాలు పోయినా రాష్ట్ర విభజనకు ఒప్పుకోకూ డదన్నారు. సమైక్యవాదానికి తూట్లు పొడిచిన నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయు డు మాట్లాడుతూ ఆంధ్రుల అందరి శ్రమ వల్ల హైదరాబాద్ ఏర్పడిందన్నారు. హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ టి. రామ్మూర్తి, ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు సీహెచ్ మహందాత  పాల్గొన్నారు. 
 
 వైఎస్సార్ సీపీ బైక్ ర్యాలీ 
 కొత్తవలస : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తవలస జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చింతలదిమ్మ,అగ్నిమాపక కేంద్రం, ముసిరాం, వియ్యంపేట, దేవా డ మీదుగా కొత్తవలస రైల్వేస్టేషన్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కర్రి శ్రీను, నాయకులు మేళాస్త్రి అప్పారావు, వై. మాధవరావు, నంబారు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నా రు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో కొత్తవలస నుంచి బైక్ ర్యాలీ చేశారు. కొత్తవలస జంక్షన్‌లో ప్రారం భమైన ర్యాలీ చింతలదిమ్మ, అగ్నిమాపక కేంద్రం,తుమ్మికాపల్లి, దేవాడ, రా మలింగపురం, చీడివలస, గొల్లలపాలెం, రాజపాత్రునిపాలెం మీదుగా కొత్తవలస రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లాలం రాధాకృష్ణ, నా యుడు, బి. తారకేశ్వరరావు, వెంకటనాయుడు, రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. 
 
 తెలంగాణా ఇస్తే మన్యసీమ ఇవ్వాల్సిందే
 సాలూరు రూరల్ : తెలంగాణ విభజన జరిగితే గిరిజనులకు ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం ఇవ్వాల్సిం దేనని సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో సమైక్యాంధ్రకు  మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి లక్ష్యం ఒక్కటేనన్నారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ, ఆ పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.రాష్ట్రం ముక్కలైతే గిరిజనుకు రాజ్యాంగబద్ధంగా వ చ్చిన హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను వేరు చేసి ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 
 ‘చాకిరేవు’తో వినూత్న నిరసన
 గౌరీపురం (శృంగవరపుకోట రూరల్) : సమైక్యాంధ్రకు మద్దతుగా కిల్తంపాలెం పంచాయతీ గౌరీపురం గ్రామస్తు లు విశాఖ-అరుకు ప్రధాన రహదారిపై శుక్రవారం ఉద యం 8 నుంచి 10 గంటల వరకు ‘చాకిరేవు’ కార్యక్రమా న్ని చేపట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువస్నేహ యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంద న్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల వెంకటరాము(శ్రీను),సెంట్రల్ బ్యాం క్ డెరైక్టర్ ఐ. రామరాజు, మాజీ సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు, యువస్నేహ యువజన సంఘ సభ్యులు జి. మోహనరావు, కె. నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.
 
 టీడీపీ వల్లే రాష్ట్ర విభజన : కోలగట్ల 
  విజయనగరం ఫోర్ట్ : తెలుగుదేశం పార్టీ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ బంద్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే దుకాణాలను, పెట్రోల్ బంక్‌లను, వాణిజ్య సమూదాయిలను మూయించారు. ఆర్టీసీ బస్సులు,లారీలను కూడా నిలిపివేశారు.అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ  జంక్షన్ మీదుగా కోట మూడు లాంతర్లు వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం నిర్వహించి చంద్ర బాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ మరో స్వాంత్రంత్య్ర ఉద్యమంలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చేలా ఆయూ పార్టీల నాయకులు అధిష్టానాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నశ్రీను, యడ్ల ఆదిరాజు, తదితరులు పాల్గొన్నారు. 
 
 కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
 కురుపాం : సమైక్యాంధ్రకు మద్దతుగా కురుపాం మండల కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే వీటీ జనార్దన థాట్రాజ్,మాజీ ఎమ్మెల్యే ని మ్మక జయరాజ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ రహ దారి పై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే జనార్దన థాట్రాజ్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా పార్టీ ఇచ్చిన సూచనలు మేర కు ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పటికే  తన రాజీ నామాను స్పీకర్‌కు అందించినట్టు తెలిపారు. ప్రజాభిప్రా యం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
 
 ఎమ్మెల్యే జయమణి వాహనాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు
 బెలగాం : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఎత్తున మోటారు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. పరిరక్షణ సమితి నాయకులు ముందుగా నిర్ణయిం చిన ప్రకారం పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి ఇం టిని ముట్టడించాలని అనుకున్నప్పటికీ ఎమ్మెల్యే స్థానికం గా పార్టీ కార్యాలయంలో ఉంటున్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లారు. ఇంతలో ఎమ్మెల్యే వాహనం పాత బస్టాండ్ సమీపంలోకి రావడంతో సమైక్యవాదులంతా ఎమ్మెల్యే వా హనాన్ని అడ్డుకుని, ఎమ్మెల్యే రాజీనామా చేయాలం టూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జయమణి వాహనం దిగి తన రాజీనామా పత్రాన్ని చూపించారు. తాను ఈ నెల 6వ తేదీనే హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజీనామా పత్రాన్ని అందజేశానని తెలిపారు. ప్రాణాలు అర్పించి అయినా సమైక్యాంధ్రా కో సం పోరాడతానని తెలిపారు. కార్యక్రమంలో సమైక్యాం ధ్ర పరిరక్షణ సమితి చైర్మన్ జి.లక్ష్మునాయుడు, కో ైచె ర్మన్ జి.శ్రీరామ్మూర్తి, కార్యదర్శి జీవీఆర్ కిశోర్, మీడియా కన్వీనరు సామల సింహాచలం, నాయకులు జక్కు రామి నా యుడు, పక్కి గోపాలకృష్ణ, మురళీ, టీవీ నాయుడు, వెంకటరావు, ధనుంజయనాయుడు పాల్గొన్నారు. 
 
 వైఎస్సార్ సీపీ కొవ్వొత్తుల ర్యాలీ నేడు
 విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ :  సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన  ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్టు చెప్పారు. ఆదివారం జాతీయ రహదారి దిగ్బంధం, సోమవారం మోటారు బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement