సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలు
Published Wed, Aug 7 2013 3:32 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు తీవ్రరూ పం దాల్చుతోంది.సమైక్యవాదులు ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగాపాల్గొంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో వందలా ది మంది నాయకులు, కార్యకర్తలు కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల మీదుగా గంటస్తంభం వరకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను చెప్పులు, కర్రలతో కొట్టి, దహనం చేశారు. బొత్స నివాసానికి కాస్త దూరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు.. అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా బొత్స, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నిరసనగా ప్రజలు చేస్తున్న ఆందోళనలతో సమైక్యాంధ్ర ప్రస్తుతం ఉద్యమాంధ్రాగా మారింద న్నారు.
కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయం కోసమే రాష్ట్రాన్ని రెం డు ముక్కలు చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని చ ూస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలే సమైక్యాంధ్రాకు మద్దతుగా ఉద్యమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వారి దొం గ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. ఆ పార్టీ యువజన విభా గం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ రాజకీయ డ్రామా ఆడుతుందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఉద్యమాల్లో పాల్గొనడం ఆనం దంగా ఉందన్నారు. పార్టీ నాయకుడు కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరపించేలా సమైక్యాంధ్రా ఉద్య మం రూపుదాల్చిందన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపిం చారు. విద్యార్థులను బెదిరిస్తే సహించేది లేదని హెచ్చరిం చారు. బుధవారం ఎత్తుబ్రిడ్జి మీద జరిగే వంటావార్పు కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె వెంకట రమణ, మజ్జి త్రినాథ్, నామాల సర్వేశ్వరరావు, గండికోట శాంతి, చెల్లూరు ఉగ్రనరసింగరావు, ఇప్పిలి రామారావు, పొట్నూరు శ్రీను,మురళీమోహన్, పెదిరెడ్ల కాశీరత్నం, సీత మ్మ, రాజకమల, లక్ష్మి, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.
పార్వతీపురంలో ఊపందుకున్న ఉద్యమం
బెలగాం /పార్వతీపురం : సమైక్యాంధ్ర ఉద్యమం పార్వతీ పురం పట్టణంలో ఊపందుకుంది. మంగళవారం అన్ని వర్గాల ప్రజలు పట్టణంలో ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాతబస్టాండ్, ప్రధాన రహదారి మీదుగా ఆర్‌టీసీ కాంప్లె క్స్ వరకు ఎడ్లబండపై సోనియా దిష్టిబొమ్మకు చెప్పులు దండ వేసి ఊరేగించారు. అనంతరం అక్కడ సోనియూ దిష్టిబొ మ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చందక శివాజి, చందాన ఆనంద్, గండి పకీరు, డొ కిశీల సర్పంచ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు. అలాగే మోటారు యూనియన్ సభ్యులు బైక్‌లతోను, ట్రాక్టర్, క్వా రీ లారీల యజమానులు ట్రాక్టర్లు, లారీలతోను భారీ ర్యాలీ చేశారు. టీడీపీ నాయకులు కూడా భారీ ర్యాలీ చేసి, ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం చేశారు. డీవీఎంఎం, టీఆర్‌ఎం, కేపీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ చేసి, ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపా ధ్యక్షుడు గొట్టాపు వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆర్‌టీసీ కాంెప్లెక్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న రిలే నిరహార దీక్షలు మూడో రోజు కూడా కొనసాగారుు.
పశు సంవర్థక శాఖ ఉద్యోగుల ర్యాలీ
విజయనగరం కలెక్టరేట్ : సమైక్యాంధ్రకు మద్దతుగా పశుసంవర్థక శాఖ ఉద్యోగులు విజయనగరంలో భారీ ర్యాలీ చేశారు. ఆ శాఖ జాయింట్ డెరైక్టర్‌తో పాటు జిల్లావ్యాప్తం గా ఉన్న ఆ శాఖ వైద్యులు, సిబ్బం ది ఉద్యమంలో పాల్గొన్నారు. వెటర్నరీ పోలీక్లినిక్ నుంచి ర్యాలీగా బయలుదేరి బాలాజీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పోలీస్ బ్యారెక్స్‌పై నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దారి పొడువునా సమైక్య నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆ శాఖ జేడీ జేఎస్‌ఎస్‌ఎం శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ ప్రకటన చేయటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీలు చందక నరసింహులు, వైవీ రమణ, పోలీ క్లినిక్ డీడీ ఎంవీఎస్ నరసింహులు, డాక్టర్స్ సంఘం అధ్యక్షుడు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దు
సాలూరు : ఉద్యమకారులు.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా చూడాలని డీఐజీ పి. ఉమాపతి పోలీసులకు సూచించారు. మంగళవారం ఆయన సాలూరు సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జాతీయ నాయకుల విగ్రహాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా చూడాలని చెప్పారు. పట్టణంలో జరుగుతున్న ఆందోళనలపై పూర్తిస్థారుులో దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సీఐ బుచ్చిరాజు, ఎస్‌ఐలు రామకృష్ణ, శ్రీనివాసరావు ఉన్నారు.
Advertisement
Advertisement