సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలు
Published Thu, Aug 8 2013 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడే ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్‌టీసీ కాం ప్లెక్స్ కూడలి వద్ద వంటావార్పు కార్యక్రమా న్ని నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గం టల వరకూ రహదారిని దిగ్బంధం చేసి వం టావార్పు నిర్వహించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపో యాయి. అనంతరం భోజన వడ్డన కార్యక్రమాన్ని సుజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా , నియోజకవర్గ నాయకులు రాంసుధీర్, చెలికాని మురళీకృష్ణ, రౌతు రామ్మూర్తి, బేతనపల్లి శివున్నాయుడు, రాంబర్కి శరత్, రాయలు, నాగిరెడ్డి అరుణ, బీసపు పార్వతి, ధనలక్ష్మి, బొగ్గు పద్మజ, తది తరులు పాల్గొన్నారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ ఊరేగింపు
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మున్సిపాలిటీ లో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను పది తలలతో ఏర్పాటు చేసి చె ప్పులు దండ, మందు సీసాలు పెట్టి వినూత్నరీతితో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు, శంబంగి వెంకటచినప్పలనాయుడు సంఘీభా వం ప్రకటించారు.
మోకాళ్లతో వినూత్న నిరసన
తాండ్రపాపారాయ విద్యాసంస్థల ఉద్యోగులు మోకాళ్లతో నిలబడి నిరసన తెలిపారు. ఊరేగింపుగా వచ్చి రైల్వేస్టేషన్ జంక్షన్‌గా మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడ మోకాళ్లతో నిల బడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన భరతమాత వేషధారణ ఆకట్టుకుం ది. పట్టణంలోని మిలట్రీకాలనీవాసులు కూ డా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపా రు. అలాగే బొబ్బిలి తైక్వాండో క్రీడాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వీరంతా ఊరేగింపుగా వచ్చి ద క్షిణదేవిడి వద్ద మానవహా రంగా ఏర్పడ్డారు. కోచ్ బంకురు ప్రసాద్, బొంగు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై తైక్వాండో ప్రదర్శన ఇచ్చారు.
కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు
విజయనగరం టౌన్: సమైక్యాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆ పార్టీ యు వజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో బుధవారం ఎత్తుబ్రిడ్జి వద్ద వం టావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విభజన ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లావ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.
పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజ య్ మాట్లాడుతూ జిల్లా నేతలు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. పార్టీ నాయకుడు కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు చేసైనా సమైక్యాంధ్రాను సాధించుకుంటామన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పార్టీ మహిళా కార్యకర్తలు కబడ్డీ ఆడారు. వంటావార్పు కార్యక్రమం అనంతరం కేసీఆర్, కిరణ్, సోనియా, బొత్స చిత్ర పటాల వద్ద వం డిన వంటను వడ్డించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గేదెల తిరుపతి, పార్టీ నాయకులు డాక్టర్ సురేష్‌బా బు, మజ్జి త్రినాథ్, నామాల సర్వేశ్వరరావు, గండికోట శాంతి, చెల్లూరు ఉగ్రనరసింగరా వు, మురళీమోహన్, పెదిరెడ్ల కాశీరత్నం, వా జా మంగమ్మ, రాంబార్కి సత్యం, కొసర నారాయణ, క్రిస్టోఫర్ రాజు, ఇప్పిలి రామారావు,పొట్నూరు శ్రీను, మొయిద ఆదిబాబు, శివ, సియ్యాదుల శేఖర్, మద్దెల మోహన్, రాంబాబు, దేవి, రమణి, రాజశ్రీ, గౌరి, తది తరులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో అదే జోరు
పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. బుధవారం తెల్లవారు జా ము నుంచే అన్ని సంఘాల నాయకులు ఆర్‌టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద వంటావార్పు కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే యువకులు, వైద్యులు, న్యాయవాదులు ప్రధాన రహదారిపై క్రికెట్ , వాలీ బాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బ్రహ్మణ సం ఘం నాయకులు సూర్యపీఠం నుంచి వేదమంత్రాలు చదువుతూ ఆర్‌టీసీ కాంప్లెక్స్ కూడలి వరకు ర్యాలీ చేసి,అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా హోమం నిర్వహించారు. అలాగే పలు సంఘాలు పాత బస్టాండ్ నుంచి ఏరియా ఆసుపత్రి కూడలి వరకు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ.. ర్యాలీలు చేశారుు. మేళతాళా లు, డ్యాన్స్‌లతో యువకులు సమైఖ్యవాదాన్ని ఢిల్లీ గద్దెకు వినిపించేలా గర్జించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని పలు దుకాణాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛందం గా మూసివేశారు.
స్థానిక తెలుగుతల్లి విగ్రహానికి పట్టణ ప్రముఖులు బెలగాం జయప్రకాష్, బొడ్డేపు రామకృష్ణ, తదితరులు పాలభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద యువకులు సెల్ టవర్ ఎక్కి సమైక్య నినాదాలను చేశారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు మానవహరం నిర్వహించి పిల్లలతో నృత్యం చేయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. పలు సంఘాల నాయకులు రాష్ట్ర విభజన వద్దని కోరుతూ ఆర్‌డీఓ వెంకటరావుకు వినతు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు గర్భాపు ఉదయభాను, జమ్మాన ప్రసన్నకుమార్, పట్టణ కన్వీనర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు, తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు సీఐ బి. వెంకటరావు బందోబస్తు నిర్వహించారు.
టీడీపీ లేఖ వల్లే రాష్ట్ర విభజన
విజయనగరం ఫోర్ట్ , న్యూస్‌లైన్ : టీడీపీ తెలంగాణకు అనుకూలమని 2008లో లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజనకు కారణమని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆరోపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద సమైక్యవాదులు రెండు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన వచ్చి న వెంటనే ప్రజల అభిష్టం మేరకు ఆందోళనలు చేస్తున్నా మన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని, ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవగ్రహా సహాస్ర సదర్భహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్య క్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నశ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఆంటోని కమిటీకి చట్టబద్ధత ఏదీ?
జామి: తెలంగాణ ప్రకటన సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సోనియూగాంధీ నియమించిన ఆంటోని కమిటీకి చట్టబద్ధత లేదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జీ చెప్పారు. జామిలో ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వపరంగా వేసిన కమిటీ కాదని కేవలం పార్టీ పరంగా వేసిన కమిటీ అని అభివర్ణించారు. గతంలో ప్రభుత్వ పరంగా వేసిన శ్రీకృష్ణ కమిటీకి విలువ లేనప్పుడు చట్టబద్ధత లేని కమిటీలతో ప్రయోజనమేమిటని ప్రశ్నించారు.
ఇటువంటి కమిటీలు ప్రజలను మోసం చేసేందుకు దోహదపడతాయని తీవ్రంగా విమర్శించారు. అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి, శాంతియుతంగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పలువురు ఆ పార్టీ నేతలు ఉన్నారు.
Advertisement
Advertisement