12 అర్ధరాత్రి నుంచి రెవెన్యూ సేవలు బంద్
Published Fri, Aug 9 2013 2:49 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా జిల్లాలో రెవె న్యూ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టనున్నారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్న ట్టు సీమాంధ్ర రెవెన్యూ ఉద్యోగులు సీసీఎల్‌ఏ కు నోటీసు అందజేసిన విషయం విదితమే. దీని లో భాగంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు ఆధ్వర్యంలో గురువారం నాయకులు కలెక్టర్ కాంతి లాల్ దండేను కలిసి సమ్మె గురించి వివరించారు. అంతే కాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేపడుతున్న పోరాటానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమ్మెలో అటెండర్ నుంచి తహశీల్దార్ వరకు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలు మూతపడనున్నా యి. దీనిని దృష్టిలో పెట్టుకొని కార్యాలయాల తాళాలను స్వాధీనం చేసుకునేలా ఆర్డీవోలకు ఆదేశాలివ్వాలని ఉద్యోగులు కలెక్టర్‌ను కోరా రు. అలాగే వీఆర్‌ఏ, వీఆర్‌ఓలు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 12 నుంచి రెవెన్యూ సేవలు నిలిచిపోనున్నాయి.
ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలి...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగులు ఈ నెల 12 నుంచి చేపట్టనున్న సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం నిర్భయంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగవలసిన పరిస్థితి లేదన్నారు. ఉద్యోగం, వేతనాలకు ఎటువంటి నష్టం ఉండదని వారు చెప్పారు. ప్రధానంగా మంత్రులు బొత్స, కిశోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజులు సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ఒకవేళ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసినప్పటికీ పదవులు పోవని తెలిసినా ఎందుకు రాజీనామా చేయడం లేదని వారు ప్రశ్నించారు.
రాష్ర్టం ముక్కలవుతున్నా బొత్స కుటుంబానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కనీసం పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకోలేని స్థితిలో ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ఉండడం జిల్లా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఇటువంటి ప్రజా ప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు సిద్ధం కావాలన్నారు. అందరినీ విడదీయాలని చూసే బొత్స తన కుటుంబాన్ని ఎందుకు విడదీయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రొంగలి ఎర్రినాయుడు, గౌరీ శంకర్, షేక్ ఇబ్రహీం, సి.హెచ్.లక్ష్మణప్రసాద్, పార్వతీపురం డివి జన్ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement