బొత్స ఇల్లు ముట్టడి అడ్డుకున్న పోలీసులు
Published Thu, Aug 8 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనపై కిమ్మనకుండా ఉన్న జిల్లా నేతలపై సమైక్యాంధ్ర ఉద్యమకారులు విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా నేతలపై ఇళ్లను ముట్టడిస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ బుధవారం వారి ఇం టిని ముట్టడించారు. విభజన ప్రక్రియ వచ్చిన తర్వాత నుంచి పోలీసులు మంత్రి ఇంటి చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశా రు. వెనుకబడిన ఉత్తరాంధ్రపై అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నా సత్తిబాబు,ఎంపీ ఝాన్సీలక్ష్మిలు స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ కాంక్షతో ప్రజల మనోభావాలను గౌరవించడం లేదని విమర్శించారు.
బొత్స తీరుకు నిరసనగా జేఏసీ పిలుపులో భాగంగా తొలుత ఉద్యోగులంతా కలెక్టరేట్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి బొత్స ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఉద్యమకారులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యం లో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవటంతో పాటు తోపులాట జరిగింది. ఒక దశలో బొత్స తీరును నిరసిస్తూ ఉద్యమకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు.దీంతో పోలీసులు వారిని అడ్డు కున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు సత్తిబాబు, ఝాన్సీలకు వ్యతిరేకంగా నినదిం చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయంగా కనుమరుగవుతారన్న వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. సమైక్యాంధ్ర కు మద్దతుగా రాజీనామా చేసే ప్రజాప్రతిని ధులను గెలి పించుకుంటామని, లేని పక్షంలో విజయనగరంలోఅడుగు పెట్టనివ్వమని హెచ్చ రించారు. ప్రజామోదం ఉన్నప్పుడే పదవులు వస్తాయన్న వాస్తవాలను గ్రహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా అధిష్టానం వద్ద మెప్పు పొందేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తే ప్రజలు క్షమించరన్న వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు.
అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధుల ఇంటికి ఆందోళన కారులు వెళ్లిన సమయంలో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని, అందుబాటులో ఉండే ఉద్యమకారుల వద్దకు వచ్చి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారన్నారు. ఈ జిల్లాలో మాత్రం బొత్స అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగులకు కూడా ఉద్వేషకారులుగా చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బొత్స దంపతులు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అంతవరకు ఉద్యమాలు నిరంతరంగా కొనసాగుతాయని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రభూజీ, గౌరీశంకర్, కొట్నాన శ్రీనివాసరావు, కృష్ణవేణి, గిరిబాల, రాము, పిడపర్తి సాంబశివశాస్త్రి పాల్గొన్నారు. డీఎస్పీ కృష్ణప్రసన్న ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement