botcha jhansi lakshmi
-
దశ దిశలా... ఉద్యమ జ్వాల
ఉద్యమ జ్వాల దశదిశలా వ్యాపించింది. విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా పదో రోజు కూడా కొనసాగాయి. అన్ని వర్గాల ప్రజలూ వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ వృత్తుల వారు తమ సత్తా చూపుతున్నారు. ఇంత ఉద్ధృతంగా ఉద్యమ సెగలు రగులుతున్నా చీమకుట్టినట్టయినా లేని ప్రజాప్రతినిధులను రోడ్ల మీద నిలదీస్తున్నారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం జిల్లాలో ఉప్పెనలా ఎగసిపడుతోంది. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ ప్రజలు చేయి చేయి కలిపి స్వచ్ఛందంగా ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే జయమణి వాహనాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాను రాజీనామా చేశానని, ఆ పత్రాన్ని పీసీసీ అధ్యక్షునికి పంపించాని ఆమె చెప్పడంతో వారు శాంతించి, వాహనానికి దారిచ్చారు. విజయనగరం పట్టణంలోని ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు పట్టణంలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటించడంతో పాటు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్ని సంస్థల యజమానులు, సిబ్బంది మయూరి జంక్షన్ వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 5 గంటల నుంచే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులపైకి వచ్చి బంద్ పాటించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టారు. జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో సోనియా, రాహుల్‌గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దున్నపోతులతో తొక్కిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కోట జంక్షన్లో ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సమైక్యవాదులంతా సమైక్యమే ముద్దు... విభజన వద్దు అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగులు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ భవనం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి. రిలే దీక్షల్లో పి. విద్యాసాగర్, ఎన్. సూర్యనారాయణ, వి.ఎ.వి. శర్మ, కే.దాలిరాజు, పి.శ్రీను, ఎ. శ్రీనివాస్ పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో 300 మంది విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయనగరం- శ్రీకాకుళం మార్గంలో రాస్తారోకో చేశారు. శ్రీ పైడిమాంబ యువజన సమరాంగణ కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కళాకారులంతా కత్తులు, కర్రలతో యుద్ధ విన్యాసాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా అన్ని ప్రధాన కూడళ్లలో కళాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పీడబ్ల్యూ టింబర్ మర్చంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మర్చంట్స్, సిబ్బంది భారీ ర్యాలీగా కోట జంక్షన్ వరకు వచ్చి అక్కడ మానవహారం చేపట్టిన అనంతరం కేసీఆర్, సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వాహనాలకు జై సమైక్యాంధ్ర నినాదంతో కూడిన స్టిక్కర్లను అతికిస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలోని మొబైల్స్ దుకాణాల యజమానులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్ల నియోజక వర్గంలో సమైక్యవాదుల ఆందోళన హోరెత్తింది. నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు నాలుగు మండలాల్లోనూ తీవ్రస్థాయిలో సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. నియోజక వర్గ కేంద్రమైన నెల్లిమర్లలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి విజయనగరం - పాలకొండ రహదారిని దిగ్బంధించారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు చెప్పులు వేసి ఊరేగించారు. కర్రలతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పతివాడ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. వంటావార్పు కార్యక్రమం చేపట్టిన సమైక్య వాదులు రోజంతా రోడ్డుపైనే గడిపారు. పూసపాటిరేగ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఆందోళన చేపట్టి రహదారిని దిగ్బంధించారు. డెంకాడ, భోగాపురం మండల కేంద్రాల్లో కూడా సమైక్యవాదుల నిరసనలు మిన్నంటాయి. చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. గరివిడిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గరివిడి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గరివిడి-చీపురుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో, వంటావార్పు చేశారు. జేఏసీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఓబీ జంక్షన్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.ఎస్.కోటలో జేఏసీ నేతృత్వంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఎల్ఐసీ ఏజెంట్లు శుక్రవారం నిరాహార దీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. ఎస్.కోట మండలం గౌరీపురంలో విశాఖ - అరుకు రోడ్డుపై పలువురు నిరసనకారులు వంటావార్పు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రామభద్రాపురం రోడ్డులో విద్యార్థులు ర్యాలీ చేపట్టగా, కొటారుబిల్లి జంక్షన్, తాటిపూడిలలో యువకుల బైక్ ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలిలో సమైక్యాంధ్ర సాధన సమితి ఆధ్వర్యం తలపెట్టిన బొబ్బిలి బంద్ విజయవంతమైంది. కాంగ్రెస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, పట్టణంలోని దాదాపు 40 సంఘాల వారు దీనిలో పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా ప్రధాన రహదారిపై వంటావార్పు చేశారు. బొబ్బిలి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల నిరాహారదీక్ష చేపట్టగా రాముడువలసలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మల దహనం చేశారు. రామభద్రపురం మండల కేంద్రంతో పాటు బూసాయవలస, ఆరికతోటల్లో వంటావార్పులు చేసి ఉద్యమకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మత్య్సకారులు, ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, సైకిల్ మెకానికల్ వర్కర్స్, కల్లుగీత కార్మికులు సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేశారు. సాలూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించగా , ముస్లింలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే జయమణిని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించాలని సమైక్యాంధ్రా పర్యవేక్షణ పోరాటసమితి చుట్టుముట్టింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముస్లింలు మౌన ప్రదర్శన చేపట్టగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహించారు. -
బొత్స ఇల్లు ముట్టడి అడ్డుకున్న పోలీసులు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనపై కిమ్మనకుండా ఉన్న జిల్లా నేతలపై సమైక్యాంధ్ర ఉద్యమకారులు విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా నేతలపై ఇళ్లను ముట్టడిస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ బుధవారం వారి ఇం టిని ముట్టడించారు. విభజన ప్రక్రియ వచ్చిన తర్వాత నుంచి పోలీసులు మంత్రి ఇంటి చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశా రు. వెనుకబడిన ఉత్తరాంధ్రపై అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నా సత్తిబాబు,ఎంపీ ఝాన్సీలక్ష్మిలు స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ కాంక్షతో ప్రజల మనోభావాలను గౌరవించడం లేదని విమర్శించారు. బొత్స తీరుకు నిరసనగా జేఏసీ పిలుపులో భాగంగా తొలుత ఉద్యోగులంతా కలెక్టరేట్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి బొత్స ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఉద్యమకారులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యం లో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవటంతో పాటు తోపులాట జరిగింది. ఒక దశలో బొత్స తీరును నిరసిస్తూ ఉద్యమకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు.దీంతో పోలీసులు వారిని అడ్డు కున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు సత్తిబాబు, ఝాన్సీలకు వ్యతిరేకంగా నినదిం చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయంగా కనుమరుగవుతారన్న వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. సమైక్యాంధ్ర కు మద్దతుగా రాజీనామా చేసే ప్రజాప్రతిని ధులను గెలి పించుకుంటామని, లేని పక్షంలో విజయనగరంలోఅడుగు పెట్టనివ్వమని హెచ్చ రించారు. ప్రజామోదం ఉన్నప్పుడే పదవులు వస్తాయన్న వాస్తవాలను గ్రహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా అధిష్టానం వద్ద మెప్పు పొందేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తే ప్రజలు క్షమించరన్న వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధుల ఇంటికి ఆందోళన కారులు వెళ్లిన సమయంలో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని, అందుబాటులో ఉండే ఉద్యమకారుల వద్దకు వచ్చి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారన్నారు. ఈ జిల్లాలో మాత్రం బొత్స అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగులకు కూడా ఉద్వేషకారులుగా చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బొత్స దంపతులు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అంతవరకు ఉద్యమాలు నిరంతరంగా కొనసాగుతాయని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రభూజీ, గౌరీశంకర్, కొట్నాన శ్రీనివాసరావు, కృష్ణవేణి, గిరిబాల, రాము, పిడపర్తి సాంబశివశాస్త్రి పాల్గొన్నారు. డీఎస్పీ కృష్ణప్రసన్న ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బొత్స, సోనియా, కేసీఆర్ చిత్రపటాలకు పిండప్రదానం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో మిన్నంటుతున్న ఉద్యమ సెగలు కాంగ్రెస్ నాయకులకు, సమైక్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నినవారికి గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతి పల్లెలో ఆందోళన కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. వీధివీధిలో సమైక్య నినాదం హోరెత్తుతోంది. ప్రతిరోజూ వినూత్న తరహాలో ఉద్యమాలు చేపడుతూ ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎత్తు బ్రిడ్జి వద్ద వంటా-వార్పు కార్యక్రమం చేపట్టిన అనంతరం కేసీఆర్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సోనియా, బొత్స చిత్రపటాలకు పిండ ప్రదానం చేశారు. విజయనగరం విద్యుత్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా విద్యుత్ ఉద్యోగుల సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో దాసన్నపేట విద్యుత్ భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాసోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను మరుగుతున్న నూనెలో దించి కుంబీపాకం శిక్ష విధించారు. ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ రికగ్నైజ్డ్ పాఠశాలల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 50 స్కూల్ బస్సులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. డీసీసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హోమం నిర్వహించగా... టీడీపీ ఆధ్వర్యంలో మెసానిక్ టెంపుల్లో రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీసీ కాలనీవాసులు జిల్లా కోర్టు వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా రహదారి పైకి వచ్చి వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. పలువురు మహిళలు కబడ్డీ ఆడగా, యువకులు రహదారిపైనే క్రికెట్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీరకట్టులో ఉన్న ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో స్పందించిన ఎస్పీ ప్రత్యేక బలగాలను తీసుకువెళ్లి ఉద్యమకారులను చెదరగొట్టారు. మునిసిపల్ ఉపాధ్యాయ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ వీధుల్లో తిరిగారు. ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలు చేతబూని మానవహారం నిర్వహించారు. భోగాపురం మండలంలో మహరాజుపేట జంక్షన్ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వేలాది మంది ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు రోడ్లపైనే వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చీపురుపల్లి పట్టణంలోని శివరాం రోడ్డులో సోనియా దిష్టిబొమ్మకు శ వయాత్ర, దహన సంస్కారం చేశారు. విజయనగరం - పాలకొండ ప్రధాన రహదారిపై మధ్యాహ్నం 12.30 గంటలకు వందలాది మందికి ప్రధాన రహదారిపై భోజనాలు వడ్డించారు. పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చీపురుపల్లి వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. నెల్లిమర్లలో వైద్యవిద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టి, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్.కోటలో దేవి జంక్షన్ వద్ద విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గజపతినగరంలో నాలుగు రోడ్ల జంక్షన్‌వద్ద ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు రోడ్డుమీదే విద్యాబోధన చేశారు. పురిటిపెంట గ్రామం న్యూకాలనీకి చెందిన పి.రాము అనే సమైక్యవాది భవానీమాలతో విజయవాడకు కాలి నడకన బయలుదేరారు.బొబ్బిలిలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణరంగారావు ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమం చేపట్టారు. సాలూరు, పార్వతీపురం, పెద్దపెంకి, సీతానగరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కురుపాంలో కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఇంటి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే సమైక్య వాదానికి కట్టుబడి మూడు రోజుల క్రితమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు ఆ పత్రాన్ని పంపినట్టు నెల్లిమర్ల ఎమ్మె ల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రకటించారు. రాష్ట్ర విభజన విషయం లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు భోగాపురం మండలంలో మహరాజుపేటజంక్షన్ వద్ద ఆయన తెలిపారు. -
మున్సిపోల్‌కు అంతా సిద్ధం
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డుల్లో తాజా ఓటర్ల జాబితా తయారీ, వార్డుల రిజర్వేషన్ కేటాయింపు వంటి ముఖ్యమైన ప్రక్రియలు ఇప్పటికే పూర్తి కాగా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, రిటర్నింగ్ అధికారుల నియామక పనులను తాజాగా పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ మేరకు ముసాయిదా జాబితాలను రాజకీయ పార్టీలకు పంపుతూ ఈ నెల 7న వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ జాబితాకు 9న జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేస్తారు. తుది ప్రకటన ఈ నెల 12న వెలువడనుంది. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు విజయనగరం మున్సిపాలిటీలోని 40 వార్డులలో 151 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పాతవి 95 కాగా, విలీన పంచాయతీల నేపథ్యంలో ఏర్పడిన విభజన కారణంగా కొత్తగా 56 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. సరాసరిన 1,078 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండేలా చర్యలు చేపట్టారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలను గుర్తించారు. ప్రభుత్వం ఏ క్షణాన ఎన్నిక లు నిర్వహించినా సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఐదేసి పోలింగ్ కేంద్రాలున్న వార్డులు 1,18, 20, 22, 24, 32, 40వ వార్డు, నాలుగేసి కేంద్రాలున్నవి 2, 3, 5,13,15,16, 19, 23, 25 నుంచి 31వరకు, 33, 38వ వార్డులున్నాయి. మూడేసి కేంద్రాలున్నవి 4, 6 నుంచి 12,14,17,21, 35, 36, 37, 39వ వార్డులు ఉన్నాయి. ఆర్వో, ఏఆర్వోల నియామకం ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా స్థానిక మండల తహశీల్దార్ రిటర్నింగ్గా వ్యవహరిస్తూ మరో ఎనిమిది మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు(ఏఆర్వో)లను ని యమించారు. ప్రతి మూడు వార్డులకు కనీసం ఒక ఏఆర్వో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు జరిగేనా....? ఓ పక్క అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా... అసలు ఎన్నికలు జరుగుతాయోలేదో అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియకు యూపీఏ అంగీకరిస్తూ ప్రకటన చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఎన్నికలపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్రా ప్రజాప్రతినిధులు చేస్తున్న రాజీనామాలే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముం దుకు రాకపోవచ్చు. అయినప్పటికీ ఆశావహులు, మాజీల్లో మాత్రం సందడి కని పిస్తోంది. ఎన్నికలు రేపోమాపో జరుగుతాయన్నట్లు హడావుడి చేస్తున్నారు. వార్డుల్లో ప్రచారం మొదలు పెట్టారు.