ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి
ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి
Published Tue, Aug 23 2016 8:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డిలు అన్నారు. సీపీఐ మండల నిర్మాణ సభ మంగళవారం సంస్థాన్ నారాయణపురంలో జరిగింది. పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలతో ఎన్నికైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సాగిందన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాలు జిల్లాలో ఇప్పటి వరకు మొదలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య, నెల్లికంటి సత్యం, కె.లింగయ్య, వీరమళ్ల యాదయ్య, దుబ్బాక భాస్కర్, ఎర్ర మల్లేష్, సుజాత, ఎంఏ.హమీద్, మంచాల సైదులు, లోడె యాదయ్య, కలకొండ సంజీవ తదితరులున్నారు.
Advertisement
Advertisement