ఉద్యమాలకు సిద్ధం కావాలి
ఉద్యమాలకు సిద్ధం కావాలి
Published Sat, Aug 27 2016 8:27 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
సూర్యాపేట : సీపీఐ బలోపేతానికి బలమైన ఉద్యమాలను నిర్వహించేందుకు శాఖ స్థాయి నుంచే పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ధర్మబిక్షం భవన్‌లో పార్టీ నిర్మాణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొమ్మగాని ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు కేవీఎల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను, సంక్షేమాన్ని కాపాడుకోవడానికి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కమ్యునిస్టు పార్టీ కార్యకర్తలు బలపడాలని కోరారు. దోరెపల్లి శంకర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మగాని శ్రీనివాస్, బొమ్మగాని వెంకటయ్య, అనంతుల మల్లీశ్వరి, ఖమ్మంపాటి అంతయ్య, జానిమియా, పొలగాని వీరభద్రం, పాషా, రాము, సత్యనారాయణ, మురళి, పద్మరేఖ, రాములు, విద్యాసాగర్, బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement