పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని నారాయణపురం కో-ఆపరేటీవ్ సొసైటీ కార్యాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని నారాయణపురం కో-ఆపరేటీవ్ సొసైటీ కార్యాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కార్యాలయం తలుపులు పగలకొట్టి లోపల ఉన్న లాకర్‌ను ధ్వంసం చేసి...అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగి కో ఆపరేటీవ్ సొసైటీ కార్యాలయానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత సొమ్ము చోరీకి గురైందనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.