రైతు రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి: విజయమ్మ | YS Vijayamma demands waiver of Agricultural Loans in flood hit areas | Sakshi
Sakshi News home page

రైతు రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి: విజయమ్మ

Published Mon, Oct 28 2013 12:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

YS Vijayamma demands waiver of Agricultural Loans in flood hit areas

నారాయణపురం : అకాల వర్షాలతో నిండా మునిగిన అన్నదాతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓదార్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో ఆమె సోమవారం పర్యటించారు. ముంపు పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యం, మొక్క జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
 
పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో పంటపొలాలను పరిశీలించిన అనంతరం వైఎస్‌ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడారు.రుణాలు రీషెడ్యూల్కు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతులను సాయం అందించి ఆదుకోవాలన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం వస్తుందన్ని విజయమ్మ బాధితులకు భరోసా ఇచ్చారు. 
 
కృష్ణా జిల్లా పర్యటన ముగించుకున్నవైఎస్‌ విజయమ్మ వరద బాధితులను పరామర్శించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు అంతకు ముందు ముస్తాబాద్‌లో వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీకూతుళ్లు మస్తాన్‌, పర్వీన్‌ కుటుంబసభ్యులను విజయమ్మ పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వరదల కారణంగా కరెంట్‌షాక్‌ తగిలి మరణించిన రాము అనే యువకుడి కుటుంబాన్ని కూడా విజయమ్మ పరామర్శించారు. కన్నీరుమున్నీరైన రాము తల్లిని ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement