పశ్చిమ గోదావరిలో నేడు విజయమ్మ పర్యటన | Y.S Vijayamma to visit flood affected areas in West Godavari district | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరిలో నేడు విజయమ్మ పర్యటన

Published Mon, Oct 28 2013 8:23 AM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM

పశ్చిమ గోదావరిలో నేడు విజయమ్మ పర్యటన - Sakshi

పశ్చిమ గోదావరిలో నేడు విజయమ్మ పర్యటన

ఏలూరు : భారీ వర్షాలతో అతలాకుతలమైన వరద ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటిస్తున్నారు. ఆమె నిన్న కృష్ణాజిల్లాలో పర్యటించి వరద బాధితుల్ని పరామర్శించారు. ఇందులో భాగంగా విజయమ్మ నేడు పశ్చిమ గోదావరి, రేపు తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో పంట పొలాలను ఆమె పరిశీలించనున్నారు.

తణుకు నియోజకవర్గంలోని దువ్వ గ్రామంలో రైతులను పరామర్శిస్తారు. ఇరగవరం మండలం గోతేరు, గొల్లకుంటపాలెం  గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలిస్తారు. ఆచంట, ఏలేటిపాడు, వేమవరం వరద ప్రాంతాల్లో విజయమ్మ పర్యటిస్తారు. కాగా  వరద బాధితులకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికి, హైదరాబాద్ నగరం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటించలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం నిన్న హైదరాబాద్లో ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా అధిక వర్షాల కారణంగా జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టంవాటిల్లగా పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలు వల్ల జిల్లాలో 635 ఇళ్లు, పంచాయతీ, ఆర్‌అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 4 పశువులు మృతి చెందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement