సీపీ సీరియస్‌? | Police Commissioner Mahesh Chandra Lada Serious On ACP Kinjarapu Prabhakar | Sakshi
Sakshi News home page

సీపీ సీరియస్‌?

Published Sun, Aug 19 2018 6:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:25 PM

Police Commissioner Mahesh Chandra Lada Serious On ACP Kinjarapu Prabhakar  - Sakshi

విశాఖసిటీ: ఓ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన ట్రాఫిక్‌ ఏసీపీ కింజరాపు ప్రభాకర్‌పై నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా సీరియస్‌ అయినట్లు తెలిసింది. ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘పచ్చ సేనలో ఖాకీ చొక్కా’ అనే శీర్షికపై ప్రచురితమైన కథనం పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై స్పందించిన నగర పోలీస్‌ కమిషనర్‌ మహేస్‌ చంద్ర లడ్డా.. ఏసీపీ ప్రభాకర్‌ను కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రాజకీయ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని క్లాస్‌ ఇచ్చినట్లు తెలిసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనం ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. బాధ్యతాయుతంగా వ్యవహరించి.. అన్ని వర్గాల పట్ల ఒకే వైఖరితో మెలగాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement