Indian actress
-
Asha Negi: సాహసాలకు ఆమె వెనుకాడని 'ఆశా' జీవి..
ఆశా నేగీ.. హిందీ ‘బిగ్ బాస్’, ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోస్ చూసేవారికి బాగా తెలిసిన పేరు. ఒక షోలో ఆమె పార్టిసిపెంట్, మరొక షోకి ఆమె హోస్ట్. రియాలిటీ షోసే కాదు సీరియల్స్, స్పోర్ట్స్, మూవీస్, సిరీస్.. ఇలా చాలా క్రెడిట్సే ఉన్నాయి ఆమెకు!– ఆశా పుట్టిపెరిగింది ఉత్తరాఖండ్ రాజధాని డెహరాడూన్లో. అక్కడి డీఏవీ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ టైమ్‌లోనే అందాల పోటీలో పాల్గొని ‘మిస్ ఉత్తరాఖండ్’ క్రౌన్ గెలుచుకుంది.– గ్రాడ్యుయేషన్ తర్వాత ఆశాకు బెంగళూరులోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్సల్టన్సీలో ఉద్యోగం వచ్చింది. అందులో కొన్నాళ్లు వర్క్ చేశాక కాల్ సెంటర్‌కి మారింది.– తను చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగాలేవీ నచ్చకపోవడంతో గ్లామర్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుని ముంబైకి మకాం మార్చింది. ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా వెళ్లి అటెండ్ అవసాగింది. ఆ ప్రయత్నాల్లోనే ‘సప్నోం సే భరే నైనా’ అనే టీవీ సీరియల్లో అవకాశం వచ్చింది. కానీ అది ఆమెకు అంతగా గుర్తింపునివ్వలేదు.తర్వాత ‘పవిత్ర్ రిశ్తా’ అనే సీరియల్లో నటించింది. దాంతో ఆశాకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆ పాపులారిటీనే ఆమెకు ‘బిగ్ బాస్’ (సీజన్ 6) హౌస్‌కి వెళ్లే చాన్స్‌ను తెచ్చింది. ‘నచ్ బలియే’ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీనీ ఇచ్చింది.ఆశాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చక్కగా ఆడుతుంది. అందుకు స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్టైన్మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ రెండు సీజన్లే ఉదాహరణలు. సీజన్ 1 ఢిల్లీ డ్రాగన్స్ తరఫున, సీజన్ 2లో కోల్‌కతా బాబూ మోశాయ్స్ తరఫున ఆడింది.సాహసాలకూ ఆమె వెనుకాడదు. ఆ ముచ్చట తీర్చుకోవడానికి ‘ఖత్రోంకే ఖిలాడీ’ సీజన్ 6లో పాల్గొని సెమీఫైనల్ దాకా వెళ్లింది.ఆశా యాక్టింగ్ టాలెంట్ చూసి అనురాగ్ బసు తన ‘లూడో’ సినిమాలో వేషం ఇచ్చాడు. తన పాత్ర పరిధిలో చక్కగా అభినయించింది. తర్వాత ‘కాలర్ బాంబ్’ అనే సినిమాలోనూ నటించింది.సీరియల్, సినిమా, సిరీస్.. ఏదైనా సరే.. నటనకు అవకాశం ఉంటే చాలు అనుకునే ఆశా అందుకు తగ్గట్టుగానే ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది.. ‘బారిష్’ అనే సిరీస్‌తో. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇండస్ట్రీ’తో వీక్షకులను అలరిస్తోంది."పేరుకు తగ్గట్టే నేను ఆశా జీవిని. ఆ తత్వమే ఇండస్ట్రీలో నన్ను లైవ్‌గా ఉంచుతోంది." – ఆశా నేగీఇవి చదవండి: Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్! -
ఈ బ్యూటీకి 50 ఏళ్లంటే నమ్ముతారా! తెలుగులోనూ నటించింది (ఫొటోలు)
-
Eesha Rebba: క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో! (ఫొటోలు)
-
Aishwarya Rajesh: కైపెక్కించే చూపులతో మతిపోగొడుతున్న ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
Ragini Dwivedi: స్టన్నింగ్ ఫోజులతో కుర్రకారుకు దడ పుట్టిస్తున్న రాగిణి ద్వివేది.. పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
Prakriti Pavani: కైపెక్కించే చూపులతో మదిని దోచుకుంటున్న ప్రకృతి పావని (ఫోటోలు)
-
Shruti Reddy: స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న శ్రుతి రెడ్డి (ఫోటోలు)
-
Aditi Rao Hydari: అమాయకంగా కనిపిస్తూనే మనసులు కొల్లగొట్టేస్తుందిగా! (ఫోటోలు)
-
Shehnaaz Kaur Gill: అందాలు హోరెత్తిస్తున్న షెహ్నాజ్ గిల్ (ఫోటోలు)
-
Wamiqa Gabbi: స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న వామిక గబ్బి (ఫోటోలు)
-
Gopika Ramesh: అదిరిపోయే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న గోపిక రమేష్ (ఫోటోలు)
-
Namitha Pramod: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న మలయాళ బ్యూటీ (ఫోటోలు)
-
Navya Nair : స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నవ్య నాయర్ (ఫోటోలు)
-
Aishwarya Lekshmi: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
కాన్స్‌లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్‌లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్‌లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్‌కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్‌లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్‌లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్‌కతా. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్‌లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్‌లో 2020 జూన్‌లో ‘ది షేమ్‌లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్‌కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్‌కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్‌కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్‌గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
-
వహ్వా వహిదా.. తెనాలి ఫిదా
తెనాలి: సినీ రంగంలో లబ్ధప్రతిష్టులైన కళాకారులకు భారత ప్రభుత్వం అందించే సర్వోన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2021 సంవత్సరానికి స్వీకరించనున్న ప్రసిద్ధ బాలివుడ్ నటి వహిదా రెహమాన్ తెలుగు చిత్రసీమ నుంచే బాలివుడ్‌కు వెళ్లారు. విశాఖపట్టణంలో పెరిగిన వహిదా, అక్కణ్ణుంచే సినీరంగానికి పరిచయమయ్యారు. అయితే అందరికీ తెలీని విషయం ఏమిటంటే ఆమెకు ఆంధ్రాప్యారిస్ తెనాలితోనూ అనుబంధం ఉంది. విశాఖకు ముందు ఆమె తన తల్లిదండ్రులతోపాటు కొద్దికాలం తెనాలిలో ఉన్నారు. నాట్యం నుంచి ఆమె తెరంగేట్రం చేసినందున, ఆ నాట్యకళకు శ్రీకారం చుట్టింది కళల తెనాలిలోనే అని పెద్దలు చెబుతారు. వహిదా తండ్రి మున్సిపాలిటీ అధికారి వహిదా తండ్రి రెహమాన్ పట్టణ మున్సిపాలిటీలో అధికారిగా కొంతకాలం పనిచేశారు. అందుచేత వహిదా కొత్తపేటలోని తాలూకా హైస్కూలులో చదువుకున్నారు. అప్పట్లోనే ఆమె నాట్యం నేర్చుకుని ఉంటుందని, తనకు ఆమె బ్యాచ్‌మేట్ అని సీనియర్ కళాకారుడు, ‘నూరేళ్ల తెనాలి రంగస్థలి’ గ్రంథకర్త స్వర్గీయ నేతి పరమేశ్వరశర్మ చెప్పేవారు. ఆ తర్వాత ఆమె తండ్రికి విజయవాడకు బదిలీ అయింది. అక్కడకు వెళ్లాక కూడా వహిదా నాట్య సాధన కొనసాగించింది. పట్టణానికి చెందిన రాజకీయ నాయకుడు, కళాభిమాని, కళాపోషకుడు నన్నపనేని వెంకట్రావు అప్పట్లో ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలను స్వరాజ్ టాకీస్‌లో నిర్వహించేవారు. ఒకరోజు వహిదా రెహమాన్ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన తిలకించిన వారిలో తానూ ఒకణ్ణని పరమేశ్వరశర్మ సంతోషపడేవారు. ప్రేక్షకుల మది గెలిచిన నటి తర్వాత వహిదా తాపీ చాణక్య తీసిన ‘రోజులు మారాయి’ సినిమాతో వెండితెరపై మెరిశారు. ‘ఏరువాక సాగారో’ పాటకు అద్భుతంగా నృత్యం చేశారు. ప్రజా నాట్యమండలి డప్పు కళాకారులు అమృతయ్య, ఏసుదాసులే ఆ పాటకు డప్పు వాయించారు. ఆ సినిమా ఎంత హిట్టయిందో తెలిసిందే. రోజులు మారాయి సినిమా శతదినోత్సవం తెనాలిలో జరిగినప్పుడు ఆ సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావు, వహిదా రెహమాన్ ఇద్దరూ తెనాలి వచ్చారు. అక్కినేనితోపాటు వహిదాకు తెనాలికి దగ్గర్లోని సంగంజాగర్లమూడిలో ఒక ఇంట్లో బస ఏర్పాటుచేశారు. తెనాలిలో అయితే ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేమని నిర్వాహకులు భావించారు. అయినా విషయం తెలుసుకున్న ప్రేక్షకులు అనేకమంది ఆ ఇంటిని చుట్టుముట్టారట. దీంతో బసచేసిన భవనంపై నుంచి అక్కినేని, వహిదా ప్రేక్షకులకు అభివాదం చేశారని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, ‘యోగాచార్య’ షేక్ మొహిద్దీన్ బాచ్చా ఒక సందర్భంలో చెప్పారు. చేబ్రోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను, బిల్లులు మార్చుకునే నిమిత్తం తెనాలి వస్తుండగా మార్గమధ్యంలో సంగంజాగర్లమూడిలో నాగేశ్వరరావు, వహిదాను చూశానని వివరించారు. తెలుగు తెర నుంచే బాలివుడ్‌కు వెళ్లిన వహిదా అక్కడ ఓ వెలుగు వెలిగారు. తన అందంతోనే కాకుండా నాట్యంతో ప్రేక్షక హృదయాలు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమె కీర్తి సిగలో కలికితురాయి కానుంది. -
Amala Paul Without Makeup: మేకప్ లేకుండా, టాటూ చూపిస్తూ అమలాపాల్ ఫోజులు (ఫోటోలు)
-
బాప్రే అనిపిస్తున్న బాపుబొమ్మ ప్రణీత అందాలు
-
గ్లామర్ ఒలకబోస్తున్న రంగబలి బ్యూటీ!
-
క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న పూనమ్ బజ్వా (ఫోటోలు)
-
నియంతలు అంతం కాక తప్పదు: కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine President Zelensky in Surprise Video At Cannes Film Festival: ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఫ్రాన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ 75వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వర్చువల్‌గా ప్రారంభోపన్యాసం చేశారు. వీడియో లింక్ ద్వారా ప్రసంగించిన ఆయన తెరపై కనిపించగానే ఈ వేడుకలో పాల్గొన్న వారంత ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జెలెన్స్కి మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రేనియన్లకు సినీ ప్రపంచం అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని కోరారు. సినిమా-వాస్తవికత మధ్య ఉన్న సంబంధంపై సుదీర్ఘంగా మాట్లాడారు. చదవండి: అట్టహాసంగా కాన్స్ చిత్రోత్సవాలు ఆరంభం అనంతరం 1979లో వచ్చిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాల సినిమా ‘అపోకలిప్స్ నౌ’, 1940లో వచ్చిన చార్లీచాప్లిన్ సినిమా ‘ది గ్రేట్ డిక్టేటర్’పై ఆయన ప్రస్తావించారు. ‘‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాను ఉటంకిస్తూ.. మనుషుల మధ్య విద్వేషం నశించిపోతుంది. నియంతలు అంతమవుతారు. ప్రజల నుంచి లాక్కున్న అధికారం తిరిగి ప్రజల చేతుల్లోకి వస్తుంది’’ అని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. మన కాలపు సినిమా నిశ్శబ్దంగా లేదని చాటిచెప్పే మరో కొత్త చార్లీ చాప్లిన్ కావాలని అన్నారు. వారి భవిష్యత్ సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పిన జెలెన్స్కీ.. నేడు సినిమా నిశ్శబ్దంగా లేదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చదవండి: ‘కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా’ ప్రజల చేతుల్లోంచి లాక్కున్న అధికారం తిరిగి వారికే దక్కుతుందని స్పష్టం చేశారు. జెలెన్స్కీ ప్రసంగానికి ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. కాగా 12 రోజులపాటు జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సెర్గీ లోజ్నిట్సా డాక్యుమెంటరీ ‘ది నేచురల్ హిస్టరీ ఆఫ్ డిస్ట్రక్షన్’ సహా ఉక్రెయిన్‌కు చెందిన పలు సినిమాలను ప్రదర్శిస్తారు. యుద్ధం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో లిథువేనియన్ చిత్ర నిర్మాత మాంటాస్ క్వేదరవియస్ మృతి చెందారు. మరణానికి ముందు ఆయన చిత్రీకరించిన ఫుటేజీని ఆయన కాబోయే భార్య హన్నా బిలోబ్రోవా కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్లో ఈసారి ఆరు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో ‘రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్’, ‘గోదావరి’, ‘దుయిన్’, ‘ఆల్ఫా బీటా గామా’, ‘బూంబా రైడ్’, ‘నిరయి తాతకుల్ల మారమ్’ చిత్రాలు ఉన్నాయి. భారత్‌కు గౌరవ సభ్య దేశం హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని సెలబ్రిటీల టీమ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. మాధవన్, రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శేఖర్ కపూర్.. ఫస్ట్ రోజు రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చారు. ఇక జ్యురీ సభ్యురాలిగా దీపికా పడుకోన్.. సభ్యసాచి చీరకట్టులో అదరహో అనిపించారు. నటి, ప్రముఖ మోడల్ ఊర్వశి రౌటెలా, మిల్కీ బ్యూటీ తమన్నా డిజైనర్ వేర్స్‌లో రెడ్కార్పొట్పై హొయలు పోయారు. And here is the video of today's performance by Zelenskyy at the Cannes Film Festival. “I am sure that the dictator will lose. We will win this war,” the President of Ukraine said. The audience gave a standing ovation 👏 pic.twitter.com/s5yiroFpOq — ТРУХА⚡️English (@TpyxaNews) May 17, 2022 -
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
ఇదేం టెక్నాలజీ! మన తారలకు చెప్పుకోలేని తలనొప్పి
గ్లామర్ ప్రపంచం.. ఎక్కువ మందిని తనవైపు లాగే ఒక ఆకర్షణ. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువగా ఉంటోంది. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్ అనేది ఫ్రీ ప్రమోషన్ ఎలిమెంట్. అందుకే తమ క్రేజ్‌ను నిలబెట్టుకునేందుకు గ్లామర్ ఫొటో-వీడియో కంటెంట్‌ను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ కంటెంట్ తప్పుడు దోవలో వెళ్తోంది. ఆ కంటెంట్‌ను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలతో నింపేస్తున్నారు కొందరు. వెబ్ డెస్క్: ‘ఫేస్ మారిపోతది.. ఫన్ పుడుతది’.. ఈ ప్రచారంతోనే ఎడిటింగ్ యాప్స్‌ల హవా సాగుతోంది ఇప్పడు. కానీ, తెర వెనుక జరిగే తతంగం అంతా వేరే ఉంటోంది. సరదా కోణంలో చూసుకుంటున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్ విపరీతంగా జనరేట్ కావడానికి ఇవే ప్రధాన కారణం అవుతున్నాయి. రోజుకి సుమారు 40 లక్షల ఎడిటింగ్ వీడియోలు, 3 కోట్లకు పైగా ‘ఫేక్’(ఎడిటింగ్) కంటెంట్ అప్లోడ్ అవుతున్నట్లు ఒక అంచనా. ఈ విషయంలో మామూలు వ్యక్తుల కంటే సెలబ్రిటీలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. . దీంతో విదేశాల్లో ఈ వ్యవహారాన్ని సెలబ్రిటీలు అంత తేలికగా తీసుకోవడం లేదు. హాలీవుడ్లో అయితే ఇలాంటి అశ్లీల కంటెంట్ కట్టడి కోసం పెద్ద ఉద్యమమే నడుస్తోంది. వీళ్లంతా పోరాడుతున్నారు మనదగ్గర దాదాపు పాతరం, కొత్త తారలంతా ఫేక్ఎడిటింగ్ కంటెంట్ బాధితులుగానే ఉన్నారు. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై పోరాడటానికి ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్‌ను హీరోయిన్లు సహించడం లేదు. హాలీవుడ్ నటీమణులు కేట్ విన్స్లెట్, జెస్సికా ఆల్బాలు ఈ విషయంలో సైబర్ సంబంధిత విభాగాల్లో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై ఓపెన్‌గా చర్చించారు. ఇక ‘వండర్ వుమెన్’ గాల్ గడోట్అయితే ఏకంగా అశ్లీల కంటెంట్ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. నటి గాల్ గాడోట్ ఈజిప్ట్ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటన్ భామలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రత్యేక చట్టాల ద్వారా కట్టడికి వీలు లేనప్పుడు.. అలాంటి సైట్లను పూర్తిగా నిషేధించడం ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. మన దగ్గరికి వస్తే బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్..భాషలకతీతంగా చాలామంది హీరోయిన్లు ఈ వ్యవహారంలో బాధితులుగా మారుతున్నారు. గూగుల్‌లో వాళ్ల కంటెంట్ కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లోనూ వందల కొద్ది అకౌంట్ల ద్వారా అవి వైరల్ అవుతుండడం, వాటికి వేల నుంచి లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం. వాళ్లే బెటర్ నాలుగు నెలల క్రితం కోలీవుడ్‌కు చెందిన ఓ నటి.. ట్విటర్లో హీరోయిన్ల ఫేక్ ఫొటోల్ని షేర్ చేస్తున్న ఓ అడల్ట్ అకౌంట్‌కు ఫాలో రిక్వెస్ట్ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి.. ఆమె రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు ఆ అకౌంట్ అడ్మిన్. వెంటనే సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసిన ఆ నటి.. అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది. తాజాగా భోజ్‌పురికి చెందిన ఇద్దరు హీరోయిన్లు తమ పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్ మీద కోర్టుకు వెళ్లారు. ఇలా ఎంతోమంది చిన్నాచితకా హీరోయిన్లు అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు. సాధారణంగా ఇలాంటి వేధింపులు ఎవరికైనా ఎదురైనప్పుడు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉంటుందని, అవసరం అనుకుంటే ఫిర్యాదుదారుడి సమాచారం సైతం గోప్యంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు న్యాయ నిపుణులు. ►సెక్షన్ 292(అశ్లీల కంటెంట్‌ను సర్క్యులేట్చేయడం) ► 354సీ (అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), ► 499 (వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం), ► 509 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), ► వీటితో పాటు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్లు 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్ల ప్రకారం ఉపశమనం పొందొచ్చు. ఫేస్ స్వాప్ ఫొటో, వీడియో ఎడిటింగ్ యాప్‌లలో ఫిల్టర్లు, ఫొటో మార్ఫింగ్‌లు సాధారణమైన వ్యవహారాలు. కానీ, టెక్నాలజీ అప్డేట్ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. ఫేస్ స్వాప్.. అశ్లీల టెక్నాలజీని పెంపొదిస్తున్న వాటిల్లో ఒకటిగా మారింది. ఒకరి ముఖం ప్లేస్‌లో మరొకరి ఫేస్ ఉంచడమే దీని ఉద్దేశం. మొదట్లో రివెంజ్ పోర్న్ ద్వారా వార్తల్లో నిలిచిన ఫేస్ స్వాప్.. ఆ తర్వాత ఓ ఎంటర్టైనింగ్ ఫీచర్\టూల్‌గా మారింది. ఇప్పుడు దీనిని ఆసరాగా తీసుకుని సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి.. ఇంటర్నెట్లో వదులుతున్నారు. డీప్‌ఫేక్ ఫీచర్ ఇది ఒకరకంగా మార్ఫింగ్ లాంటిదే. అల్రెడీ ఉన్న వీడియోతోగానీ, అప్పటికప్పుడు చేసే వీడియోతో ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఉద్దేశించి రూపొందించిన ఫీచర్. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ)తో పని చేసే సింథటిక్ టెక్నాలజీ ఇది. దీని ద్వారా ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి వీడియో ఎడిటింగ్ యాప్‌లు. కానీ, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న సెలబ్రిటీలకు.. ఫేక్ వీడియోల ద్వారా ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పి తీసుకొస్తోంది. కంట్రోల్ కాదనేనా? గతంలో ఇలాంటి కంటెంట్ తెరపైకి వచ్చినప్పుడు.. ఖండించిన తారలూ లేకపోలేదు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కొందరు సరదా కోసం ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంటే.. మరికొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అనని మాటల్ని అన్నట్లు.. చేయని పనుల్ని చేసినట్లు చూపిస్తున్నారు. కాంట్రవర్సీలు, ఫేక్ సెక్స్ స్కాండల్స్‌తో ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ ‘సేఫ్టీ’పై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ‘ప్రీ ఎంప్టివ్ రీసెర్చ్’ సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ ద్వారా యూజర్ జనరేట్ కంటెంట్‌ను కంట్రోల్ చేయగలిగినా.. ఇతర సైట్లతో మళ్లీ వైరల్ అవ్వొచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వ్యవహారాలేవీ కొత్తేం కాదని, ఎంత నియంత్రించినా మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటాయని చెప్తున్నారు నెదర్లాండ్స్ ఆర్ట్ఈజెడ్ యూనివర్సిటీ ‘ఎస్తెటిక్స్ అండ్ కల్చర్ ఆఫ్ టెక్నాలజీ’ ప్రొఫెసర్ నిశాంత్షా. బహుశా ఈ కోణంలోనే ఆ ఫేక్ బురదలో రాయి వేయడం ఎందుకని ఈ తలనొప్పిని పంటి బిగువున భరిస్తున్నారనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు!
- రిచా చద్దా, హీరోయిన్ ‘ఒయ్ లక్కీ! లక్కీ ఒయ్’తో చిత్రసీమకు పరిచయమైన రిచా చద్దా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ మొదటి, రెండు భాగాలలో నటించారు. ఉత్తమనటిగా ‘ఫిలింఫేర్’ అవార్డ్ గెలుచుకున్నారు. ఆమె మనసులో మాటలు...‘‘నేను హీరోయిన్ కావాలనుకుంటున్నాను’’ అని ఇంట్లో చెప్పినప్పుడు ‘‘అయ్యి ఏంచేస్తావమ్మా?’’ అని వ్యంగ్యంగా అన్నారే తప్ప నా తల్లిదండ్రులు ప్రోత్సాహకరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ, ఆ మాటలతో నేనేమీ నిరాశ పడిపోలేదు. నా కలను నెరవేర్చుకోవడానికి ముంబాయికి వచ్చాను. నాకు గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరు. ‘మనలోని ప్రతిభే మన గాడ్‌ఫాదర్’ అనుకొని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. కేన్స్ ఫెస్టివల్లో ఎందరో ప్రముఖులతో మాట్లాడే అవకాశం వచ్చింది. ‘‘మీరు బాలీవుడ్ హీరోయిన్ కదా!’’ అని అక్కడ ఎవరో పలకరింపుగా అడిగారు.‘‘కాదు’’ అన్నాను.‘‘అదేమిటి? మీరు ఫలానా సినిమాలో హీరోయిన్గా చేశారు కదా’’ అని ఆశ్చర్యంగా అడిగారు ఆయన. ‘‘మీరన్నది నిజమేగానీ, నేను బాలీవుడ్ నటిని కాదు... భారతీయ నటిని’’ అన్నాను. ‘బాలీవుడ్ నటి’ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానిలో ‘దేశీయత’ ధ్వనించదు. ‘‘చేతి నిండా సినిమాలు ఉన్నాయి’’ అని చెప్పుకోవడానికి మూస పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. నమ్ముతారో లేదోగానీ కొన్ని పెద్ద సినిమాలను కూడా నేను తిరస్కరించాను. నచ్చిన పాత్రలు లభించక మొదటి సినిమాకు రెండో సినిమాకు మధ్య నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాను. ఆ సమయంలో నాకు నచ్చిన నాటకాల్లో నటించాను.‘కెనడీ బ్రిడ్జి’ అనే నాటకం నాకు ఎంతో పేరు తెచ్చింది. కొందరైతే ‘‘నాటకాన్ని భుజాల మీద మోశావు’’ అన్నారు. ఎక్కువ సినిమాలు చేశామనే తృప్తి కంటే ఇలాంటి ప్రశంసల వల్ల లభించే తృప్తే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.