‘‘సియాచిన్ మాది’’ అంటోంది పాకిస్థాన్. ‘‘కాదు, మాది’’ అంటోంది భారత్. ప్రపంచంలోనే అతి ఎత్తైయిన ఈ యుద్ధక్రేత్రంలో రెండు దేశాల సైన్యాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి. భారత్ నలభై ఏళ్ల క్రితమే ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో సైనిక చర్య జరిపి సియాచిన్‌పై నియంత్రణ సాధించినా..పాక్ తన పట్టు వీడటం లేదు. ఈ పరిస్థితిని ‘‘చక్కబరచటానికి’’ భారత సైన్యం ఇటీవలే సియాచిన్ డ్యూటీకి ప్రత్యేకంగా ఒక ఆర్మీ ఆఫీసర్‌నుపంపింది. ఆ ఆఫీసరే.. సుప్రీత. కెప్టెన్ సుప్రీత. సియాచిన్‌పైకి వెళ్లిన తొలి మహిళా సేనాని!
భారత సైన్యంలో 40 విభాగాలు ఉంటాయి. 14 ప్రధాన ఉప–విభాగాలు ఉంటాయి. ఈ ఉప విభాగాలను ‘కోర్స్’ అంటారు. వాటిల్లో ఒకటి ‘కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’. అందులో సైనికాధికారిగా విధులు నిర్వర్తిస్తుంటారు కెప్టెన్ సుప్రీత. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున, హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంటుంది సియాచిన్ గ్లేసియర్. నది గడ్డ కట్టినట్లుగా ఉండే ఆ ్ర΄ాంతంలో కెప్టెన్ సుప్రీతకు డ్యూటీ పడింది! ఈ నెల 18నే.. వెళ్లి చేరారు. సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి ఉమన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు.
ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో.. ఒక అరుదైన విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కొత్తగా పెళ్లయిన ఒక యువ జంటలో – భర్త ఒక సైనిక దళానికి, భార్య మరొక దళానికి నేతృత్వం వహించారు! భర్తది తమిళనాడు. భార్యది కర్ణాటక. అనుకోకుండా ఇద్దరికీ ఢిల్లీ వేడుకల్లో దళాలను పరేడ్ చేయించే అవకాశం వచ్చింది. ఆ భర్త.. మేజర్ జెర్రీ బ్లైజ్. ఆ భార్య.. కెప్టెన్ సుప్రీత. అసలు మహిళలు ఆర్మీలోకి రావటమే గొప్ప సంగతైతే, సుప్రీత అక్కడి నుంచి సియాచిన్ వరకు ‘ఎదగటం’ చెప్పుకోదగ్గ విశేషం. భారత సైన్యంలో ఆమె కెరీర్ 2021లో లెఫ్ట్‌నెంట్‌గా మొదలైంది. చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒ.టి.ఎ.)లో ఆమె శిక్షణ ΄పోందారు. కాలేజ్‌లో ఎస్సీసీతో మొదలైన ఆమె దేశ రక్షణ దళ ప్రయాణం.. ముందు వరుస యుద్ధక్షేత్రం వరకు దృఢచిత్తంతో ముందుకు సాగింది.
సుప్రీత మైసూర్ అమ్మాయి. అక్కడి కృష్ణరాజనగరంలోని సెయిట్ జోసెఫ్ స్కూల్లో చదివారు. మైసూరులోనే మరిమల్లప్ప ప్రీ–యూనివర్శిటీ కాలేజ్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవటానికి ముందు, జె.ఎస్.ఎస్. లా కాలేజ్‌లో డిగ్రీ చేశారు. ఆమె తండ్రి తిరుమల్లేశ్ మైసూరు దగ్గరి తలాకాడులోపోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్. తల్లి నిర్మల గృహిణి. ఆర్మీపై తనకున్న ఇష్టాన్ని గౌరవించిన తన తల్లిదండ్రుల ్ర΄ోత్సాహంతో సుప్రీత ఎన్సీసీలో ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్ సాధించారు. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (రాజ్‌పథ్)లో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్ణాటక–గోవా నడిపించారు.
2016లో ఆలిండియా వాయు సైనిక్ క్యాంప్‌లో కర్ణాటకకు ్ర΄ాతినిధ్యం వహించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ అయ్యాక సియాచిన్‌ను అధిరోహించటానికి మళ్లీ ఓ.టి.ఎ.లో చేరారు. శిక్షణలో భాగంగా ఆమెను వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన అనంత్‌నాగ్, జబల్పూర్, లేహ్ ్ర΄ాంతాలకు పంపించారు. ఆ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు సుప్రీత. సుప్రీత, బ్లేజ్‌ల వివాహం గత ఏడాదే జరిగింది. సుప్రీత మామ గారు రిటైర్డ్ కల్నల్ రిచర్డ్ బ్లెయిజ్. సుప్రీత అత్తగారు లెఫ్ట్‌నెంట్ కల్నల్ విజయలక్ష్మి. పుట్టినింటి, మెట్టినింటి రెండూ ్ర΄ోత్సాహాలు సుప్రీత కెరీర్‌కు కలిసి వచ్చాయనే అనుకోవాలి. అంతకంటే కూడా ఆమె దీక్ష, పట్టుదల.
Comments
Please login to add a commentAdd a comment