siachen camp
-
సియాచిన్ పైకి మహిళా సేనాని!
‘‘సియాచిన్ మాది’’ అంటోంది పాకిస్థాన్. ‘‘కాదు, మాది’’ అంటోంది భారత్. ప్రపంచంలోనే అతి ఎత్తైయిన ఈ యుద్ధక్రేత్రంలో రెండు దేశాల సైన్యాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి. భారత్ నలభై ఏళ్ల క్రితమే ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో సైనిక చర్య జరిపి సియాచిన్‌పై నియంత్రణ సాధించినా..పాక్ తన పట్టు వీడటం లేదు. ఈ పరిస్థితిని ‘‘చక్కబరచటానికి’’ భారత సైన్యం ఇటీవలే సియాచిన్ డ్యూటీకి ప్రత్యేకంగా ఒక ఆర్మీ ఆఫీసర్నుపంపింది. ఆ ఆఫీసరే.. సుప్రీత. కెప్టెన్ సుప్రీత. సియాచిన్‌పైకి వెళ్లిన తొలి మహిళా సేనాని!భారత సైన్యంలో 40 విభాగాలు ఉంటాయి. 14 ప్రధాన ఉప–విభాగాలు ఉంటాయి. ఈ ఉప విభాగాలను ‘కోర్స్’ అంటారు. వాటిల్లో ఒకటి ‘కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’. అందులో సైనికాధికారిగా విధులు నిర్వర్తిస్తుంటారు కెప్టెన్ సుప్రీత. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున, హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంటుంది సియాచిన్ గ్లేసియర్. నది గడ్డ కట్టినట్లుగా ఉండే ఆ ్ర΄ాంతంలో కెప్టెన్ సుప్రీతకు డ్యూటీ పడింది! ఈ నెల 18నే.. వెళ్లి చేరారు. సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి ఉమన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో.. ఒక అరుదైన విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కొత్తగా పెళ్లయిన ఒక యువ జంటలో – భర్త ఒక సైనిక దళానికి, భార్య మరొక దళానికి నేతృత్వం వహించారు! భర్తది తమిళనాడు. భార్యది కర్ణాటక. అనుకోకుండా ఇద్దరికీ ఢిల్లీ వేడుకల్లో దళాలను పరేడ్ చేయించే అవకాశం వచ్చింది. ఆ భర్త.. మేజర్ జెర్రీ బ్లైజ్. ఆ భార్య.. కెప్టెన్ సుప్రీత. అసలు మహిళలు ఆర్మీలోకి రావటమే గొప్ప సంగతైతే, సుప్రీత అక్కడి నుంచి సియాచిన్ వరకు ‘ఎదగటం’ చెప్పుకోదగ్గ విశేషం. భారత సైన్యంలో ఆమె కెరీర్ 2021లో లెఫ్ట్‌నెంట్‌గా మొదలైంది. చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒ.టి.ఎ.)లో ఆమె శిక్షణ ΄పోందారు. కాలేజ్‌లో ఎస్సీసీతో మొదలైన ఆమె దేశ రక్షణ దళ ప్రయాణం.. ముందు వరుస యుద్ధక్షేత్రం వరకు దృఢచిత్తంతో ముందుకు సాగింది.సుప్రీత మైసూర్ అమ్మాయి. అక్కడి కృష్ణరాజనగరంలోని సెయిట్ జోసెఫ్ స్కూల్లో చదివారు. మైసూరులోనే మరిమల్లప్ప ప్రీ–యూనివర్శిటీ కాలేజ్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవటానికి ముందు, జె.ఎస్.ఎస్. లా కాలేజ్‌లో డిగ్రీ చేశారు. ఆమె తండ్రి తిరుమల్లేశ్ మైసూరు దగ్గరి తలాకాడులోపోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. తల్లి నిర్మల గృహిణి. ఆర్మీపై తనకున్న ఇష్టాన్ని గౌరవించిన తన తల్లిదండ్రుల ్ర΄ోత్సాహంతో సుప్రీత ఎన్సీసీలో ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్ సాధించారు. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (రాజ్‌పథ్)లో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్ణాటక–గోవా నడిపించారు. 2016లో ఆలిండియా వాయు సైనిక్ క్యాంప్‌లో కర్ణాటకకు ్ర΄ాతినిధ్యం వహించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ అయ్యాక సియాచిన్‌ను అధిరోహించటానికి మళ్లీ ఓ.టి.ఎ.లో చేరారు. శిక్షణలో భాగంగా ఆమెను వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన అనంత్‌నాగ్, జబల్పూర్, లేహ్ ్ర΄ాంతాలకు పంపించారు. ఆ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు సుప్రీత. సుప్రీత, బ్లేజ్‌ల వివాహం గత ఏడాదే జరిగింది. సుప్రీత మామ గారు రిటైర్డ్ కల్నల్ రిచర్డ్ బ్లెయిజ్. సుప్రీత అత్తగారు లెఫ్ట్‌నెంట్ కల్నల్ విజయలక్ష్మి. పుట్టినింటి, మెట్టినింటి రెండూ ్ర΄ోత్సాహాలు సుప్రీత కెరీర్‌కు కలిసి వచ్చాయనే అనుకోవాలి. అంతకంటే కూడా ఆమె దీక్ష, పట్టుదల. -
Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్ శివ చౌహాన్ ఈపోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్ వివరాలు. గతంలో సియాచిన్‌కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్‌లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్. 1984 నుంచి దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు. అడుగు పెట్టిన ఆఫీసర్ సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకూ సియాచిన్‌లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్‌కు ఆర్మీ సియాచిన్ హెడ్క్వార్టర్స్లోపోస్టింగ్ ఇచ్చింది. రాజస్థాన్ సాహసి శివ చౌహాన్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్‌ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్‌గా ఇంజనీర్ రెజిమెంట్‌లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా ΄పొందింది. 2022 కార్గిల్ దివస్ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508 కిలోమీటర్ల సైకిల్ యాత్రను శివ చౌహాన్ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్‌లో టీమ్ లీడర్గాపోస్ట్ వరించింది. త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్ నిలిచింది. కఠిన శిక్షణ సియాచిన్‌లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్ హెడ్‌క్వార్టర్స్‌లోని బేటిల్ స్కూల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు. -
ఆ తొమ్మిది మంది మాటేమిటి?
సియాచిన్‌లో మంచు గడ్డల కింద కప్పడి పోయిన లాన్స్ నాయక్ హనుమంతప్ప, తర్వాత ఆసుపత్రిలో మరణించాడని తెలిసిందే. ఆయనకు నివాళులర్పించడం సము చితం, అందుకు ఆయన అర్హుడే. సగం విగతజీవిగా ఉన్న ఆయనను దేశమంతా ఊపిరి బిగబట్టి చూసింది. ఆయనను గుండె దిటవుగల యోధునిగా అభివర్ణించి దేశం కోసం ఆ సైనికులు చేసిన త్యాగాలను జాతి గుర్తించింది. సియాచిన్ మంచుకొండలపై అత్యంత ప్రమాదకర విధులను నిర్వహిస్తూ హనుమంతప్పతో పాటూ మరణించిన తొమ్మిది మంది సహ సైనికులు ఆయనకంటే తక్కువ వారు అవుతారా? వారికి గుర్తింపు లేకుండా పోవాల్సిందేనా? వారి గురించి మీడియా తెలిపిన దాన్ని బట్టి చూస్తే, వారి పేర్లు గుర్తుండటమూ కష్టమే. ఆ మాటకొస్తే, వాతావరణ సంబంధమైన కారణాలతో 2015 డిసెంబర్ మధ్య వరకు ఆ మంచుకొండలపై ప్రాణాలు కోల్పోయిన దాదాపు 869 మంది సైనికుల గురించి గుర్తుంచుకోవడమూ కష్టమే. నాటకీయతను అల్లడానికి ఉపకరిస్తుందనుకునే ఏ విషయం వెంటైనా మీడియా ఉద్వేగంతో కొట్టుకుపోతుంటుంది. దాని వల్ల లబ్ధిని పొందే వారు... ఈ సందర్భంలో సైన్యం... సంస్థాగతమైన తమ ధీరోదాత్త, సాహస సంస్కృతికి ఒక వ్యక్తిని ఉత్ప్రేక్షగా మార్చడాన్ని అభ్యంతరపెట్టదు. తాత్కా లికమైనదిగా లేదా చంచలమైనదిగా ఉండే మీడి యా ఆసక్తిని ఉపయోగించుకోగలగడం చక్కటి ప్రజాసంబంధాల నిర్వహణ అవుతుంది. కానీ సైన్యం అలాంటి ప్రచారాన్ని కోరుకోదనడంలో అనుమానమే లేదు. ఒక సంక్షోభం, దాని పర్యవసానాలకు సంబంధించి, తోటి సహచరుల నుంచి వేరుచేసి ఒకే ఒక్క వ్యక్తిపై దృష్టిని కేంద్రీకరింపజేసినందుకు మీడియా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సున్నా కంటే తక్కువ అతిశీతల పరిస్థితుల్లో గాలి ఇరుక్కున్న మంచుగడ్డల సందులో చిక్కుబడి పోకపోవడమూ, యోగాసనాలు వేసి ఉండక పోవడమూ మిగతా వారు చేసిన తప్పా? ఠీవిలోసింహంలాగా, ఒక బృందంలో ఎప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఉన్నవారు ఒకరుంటారు. ఆ ఒక్కరే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సైన్యం, రెండు ముందస్తు షరతులపై ఆధారపడి పని చేస్తుంది. నాయకత్వ శ్రేణికి కట్టు బడి ఉండటం ద్వారా విజయం సాధించే పక్షంగా నిలవడం. ఇక రెండవది, సమష్టి కృషి. మంచు కొండ చ రియ విరిగిపడ్డప్పుడు, ఆ బృందంలో ప్రతి ఒక్కరూ తమ గురించి తామే గాక, తమ తోటి సైనికుని గురించి కూడా ఆలోచించే ఉంటారు. తామంతా చనిపోగా, తనకు ఒక్కడికే దిటవు గుండె గల యోధునిగా గుర్తింపు లభించడాన్ని హనుమంతప్ప కొపడ్ సైతం ఇష్టపడకపోవచ్చు. ఆయనే గనుక బతికి ఉంటే తన అదృష్టానికి, తనకు లభించిన శిక్షణకు ధన్యవాదాలు అర్పించేవాడు, తన తోటి సైనికుల కోసం దుఃఖించేవాడు. ఈశాన్య భారతంలో వలే మన సైన్యం అంతర్గత శాంతి పరిరక్షణ విధులను సైతం నిర్వహిస్తోంది. వారక్కడ సైనిక విధులను నిర్వహిస్తున్నది సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం కిందనే అయినా, పలు నష్టాలను చవిచూస్తున్నారు. కశ్మీర్ లోయలో మన సైన్యం, బీఎస్ఎఫ్తో కలసి మిలిటెన్సీతోనూ, ఉగ్రవాదులతోనూ తలపడుతోంది. కొన్ని సందర్భాలలో అది పౌరులపై దౌష్ట్యానికి పాల్పడు తోందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నా ప్రాణ నష్టాలను చవి చూస్తోంది. అలా మరణిస్తున్న సైనికులపై మీడియా ఇంతటి ఆసక్తిని కనబరచదు. సైనికులకు సంబంధించి ఏం జరిగినా దానికి అది అలవాటుగా మారిపోవడమే అందుకు కారణం. ఒక మిలిటెంట్ ఒక సైనికుడ్ని పేల్చేసినా అది దైనం దిన ఘటనే అయిపోతుంది. అందులో నాటకీయత కనబడదు. నాటకీయతకు అవకాశమున్న దేన్నయి నా మీడియా లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తూ, రుచికరంగా వడ్డించడమే 24/7 వార్తా ప్రసారాలలో విలువను నిలబెట్టగల ఔషధమని భావిస్తోంది. ఏదేమైనా మీడియా ఒక ఘటనను లేదా వ్యక్తిని లేదా ఇద్దరినీ తెగనాడేటప్పుడైనా లేదా కీర్తించేటప్పుడైనా గావు కేకలు పెట్టడం మానే యడం మంచిది. అలా అరవడం ఆ కథనం నిజ ప్రమాణాలను వక్రీకరిస్తుంది. దీనివల్ల అప్పుడ ప్పుడూ ప్రయోజనాలూ ఉంటాయి. అన్ని సందర్భా ల్లోనూ కాదని గుర్తుంచుకోవాలి. ఒక ఆడపిల్లపై జరిగిన పాశవిక అత్యాచారంపట్ల మీడియా చూపిన ఆసక్తి, అదృష్టవశాత్తూ మహిళల దుస్థితిపై దేశాన్ని జాగృతం చేయడానికి తోడ్పడింది. మీడియా ఆమెను నిర్భయ పేరుతో ప్రచారం చేసింది. కానీ ఆమెకు ఆ పేరును పెట్టినది దాని అర్థాన్ని బట్టికాదు. ఆ క్షణంలో ఆమె ఉన్న పరిస్థితులూ, మహిళలను మగాళ్లు తృణీకారంతో చూసేలా, భోగ వస్తువుగా, పైశాచిక ఆనందాన్నిచ్చే వస్తువుగా సైతం భావించేలా మలచిన సమాజమూ కలసి ఆమెను నిస్సహాయురాలిని చేశాయి. నిజానికి ఆ ఘోర అత్యాచార ఘటన తదుపరి మహిళలపై అత్యాచారాల సమస్యను చేపట్టి ముందుకు నడచిన ఇతర మహిళలే నిర్భయలు. తమ గొంతులు విప్పాలని, బహిరంగంగా, మూకుమ్మడిగా ఎలుగెత్తాలని వాళ్లు నిశ్చయించుకున్నారు. ఏవి వార్తలు, ఏవి కావని చూసే భిన్న పద్ధతు లు ఉన్నాయి. విషయ పరిజ్ఞానం గల పౌరులు ప్రజాస్వామ్యానికి ఆవశ్యకం. కాబట్టి ప్రజలకు అవసరమైన, నమ్మదగిన, ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం ఒక పద్ధతి. వివాదాలను ప్రేరేపించి, ప్రజా సమస్యలపై నిలువునా రెండు పూర్తి వ్యతిరేక దృక్పథాల శిబిరాలుగా చీల్చి అమర్యాదకరంగా పోట్లాడు కునేలా చేయడం మరో పద్ధతి. ఇక మూడోది, వివాదాన్ని వినోద కార్యక్రమంగా మార్చేయడం. వార్తల పేరిట మీడియా మీకు అందిస్తున్నవి వాస్తవంగా మీ జీవితాలలో ఏమైనా మార్పును కలుగజేస్తాయా అని మీకు అనుమానం రాలేదా? సియాచిన్ మంచు కొండచరియ తుంచేసిన మిగతా తొమ్మిది మంది సైనికుల మృతి మీడియాను తాకనట్టుగా... ఆ వార్తలలో అత్యధికం మీ జీవితాన్ని తాకేవి కానే కావని అనిపించలేదా? మీడియా ద్వారా తరచుగా మనకు లభించేవి అనావశ్యక విషయాల హిమపాతాలే. విశ్లేషణ; మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com