Supreetha
-
సియాచిన్ పైకి మహిళా సేనాని!
‘‘సియాచిన్ మాది’’ అంటోంది పాకిస్థాన్. ‘‘కాదు, మాది’’ అంటోంది భారత్. ప్రపంచంలోనే అతి ఎత్తైయిన ఈ యుద్ధక్రేత్రంలో రెండు దేశాల సైన్యాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి. భారత్ నలభై ఏళ్ల క్రితమే ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో సైనిక చర్య జరిపి సియాచిన్‌పై నియంత్రణ సాధించినా..పాక్ తన పట్టు వీడటం లేదు. ఈ పరిస్థితిని ‘‘చక్కబరచటానికి’’ భారత సైన్యం ఇటీవలే సియాచిన్ డ్యూటీకి ప్రత్యేకంగా ఒక ఆర్మీ ఆఫీసర్నుపంపింది. ఆ ఆఫీసరే.. సుప్రీత. కెప్టెన్ సుప్రీత. సియాచిన్‌పైకి వెళ్లిన తొలి మహిళా సేనాని!భారత సైన్యంలో 40 విభాగాలు ఉంటాయి. 14 ప్రధాన ఉప–విభాగాలు ఉంటాయి. ఈ ఉప విభాగాలను ‘కోర్స్’ అంటారు. వాటిల్లో ఒకటి ‘కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’. అందులో సైనికాధికారిగా విధులు నిర్వర్తిస్తుంటారు కెప్టెన్ సుప్రీత. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున, హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంటుంది సియాచిన్ గ్లేసియర్. నది గడ్డ కట్టినట్లుగా ఉండే ఆ ్ర΄ాంతంలో కెప్టెన్ సుప్రీతకు డ్యూటీ పడింది! ఈ నెల 18నే.. వెళ్లి చేరారు. సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి ఉమన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో.. ఒక అరుదైన విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కొత్తగా పెళ్లయిన ఒక యువ జంటలో – భర్త ఒక సైనిక దళానికి, భార్య మరొక దళానికి నేతృత్వం వహించారు! భర్తది తమిళనాడు. భార్యది కర్ణాటక. అనుకోకుండా ఇద్దరికీ ఢిల్లీ వేడుకల్లో దళాలను పరేడ్ చేయించే అవకాశం వచ్చింది. ఆ భర్త.. మేజర్ జెర్రీ బ్లైజ్. ఆ భార్య.. కెప్టెన్ సుప్రీత. అసలు మహిళలు ఆర్మీలోకి రావటమే గొప్ప సంగతైతే, సుప్రీత అక్కడి నుంచి సియాచిన్ వరకు ‘ఎదగటం’ చెప్పుకోదగ్గ విశేషం. భారత సైన్యంలో ఆమె కెరీర్ 2021లో లెఫ్ట్‌నెంట్‌గా మొదలైంది. చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒ.టి.ఎ.)లో ఆమె శిక్షణ ΄పోందారు. కాలేజ్‌లో ఎస్సీసీతో మొదలైన ఆమె దేశ రక్షణ దళ ప్రయాణం.. ముందు వరుస యుద్ధక్షేత్రం వరకు దృఢచిత్తంతో ముందుకు సాగింది.సుప్రీత మైసూర్ అమ్మాయి. అక్కడి కృష్ణరాజనగరంలోని సెయిట్ జోసెఫ్ స్కూల్లో చదివారు. మైసూరులోనే మరిమల్లప్ప ప్రీ–యూనివర్శిటీ కాలేజ్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవటానికి ముందు, జె.ఎస్.ఎస్. లా కాలేజ్‌లో డిగ్రీ చేశారు. ఆమె తండ్రి తిరుమల్లేశ్ మైసూరు దగ్గరి తలాకాడులోపోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. తల్లి నిర్మల గృహిణి. ఆర్మీపై తనకున్న ఇష్టాన్ని గౌరవించిన తన తల్లిదండ్రుల ్ర΄ోత్సాహంతో సుప్రీత ఎన్సీసీలో ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్ సాధించారు. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (రాజ్‌పథ్)లో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్ణాటక–గోవా నడిపించారు. 2016లో ఆలిండియా వాయు సైనిక్ క్యాంప్‌లో కర్ణాటకకు ్ర΄ాతినిధ్యం వహించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ అయ్యాక సియాచిన్‌ను అధిరోహించటానికి మళ్లీ ఓ.టి.ఎ.లో చేరారు. శిక్షణలో భాగంగా ఆమెను వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన అనంత్‌నాగ్, జబల్పూర్, లేహ్ ్ర΄ాంతాలకు పంపించారు. ఆ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు సుప్రీత. సుప్రీత, బ్లేజ్‌ల వివాహం గత ఏడాదే జరిగింది. సుప్రీత మామ గారు రిటైర్డ్ కల్నల్ రిచర్డ్ బ్లెయిజ్. సుప్రీత అత్తగారు లెఫ్ట్‌నెంట్ కల్నల్ విజయలక్ష్మి. పుట్టినింటి, మెట్టినింటి రెండూ ్ర΄ోత్సాహాలు సుప్రీత కెరీర్‌కు కలిసి వచ్చాయనే అనుకోవాలి. అంతకంటే కూడా ఆమె దీక్ష, పట్టుదల. -
'ఇన్ఫెక్షన్ వల్ల కాలి వేళ్లు తీయాల్సి వచ్చింది, అప్పుడే గుండెపోటు'
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. తన నటనతో పాటు అందంలో కూడా నేటి హీరోయిన్లకు పోటీగా ఉంటుంది సురేఖ. గత కొంతకాలంలో ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకుంటున్నారు. ఇక వీడియోలో ఎంతో చలాకీగా కనిపించే సురేఖ-సుప్రీత నిజ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. సురేఖ వాణి భర్త సురేశ్ తేజ అనారోగ్యంతో 2019లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన సుప్రీత నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధం ఏంటి? అసలు ఆయన ఎలా చనిపోయారని కొందరు నెటిజన్లు ప్రశ్నించగా, తనకు, తన తండ్రికి చాలా మంచి రిలేషన్ ఉండేదని, నాన్నతో కలిసి బాగా అల్లరి చేసేదాన్ని అని సుప్రీత చెప్పుకొచ్చింది. ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకునేవాళ్లం అని తెలిపింది. ఇక తండ్రి మరణంపై మాట్లాడుతూ..నాన్నకి ఎక్కువగా నడిచే అలవాటు ఉండేది. ఓసారి ఎక్కువ నొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదిస్తే..ఇన్ఫెక్షన్ అయ్యిందని, సర్జరీ చేసి కాలి వేళ్ల వరకు తీసేద్దామని చెప్పారు. సర్జరీ జరిగింది. కానీ కొన్నాళ్లకు మళ్లీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యింది. దీంతో మళ్లీ సర్జరీకి వెళ్లాం. ఆ సమయంలో ఓసారి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అయితే సర్జరీ వళ్లే గుండెనొప్పి వచ్చిందని చెప్పలేను కానీ సడెన్‌గా ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు అంటూ సుప్రీత ఎమోషనల్ అయ్యింది. ఇక అటు సురేఖవాణితో పాటు సుప్రీతకు సైతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. దీంతో త్వరలోనే వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. చదవండి : నా జీవితంలో చెత్తరోజు..సురేఖ వాణి కూతురు ఎమోషనల్ పోస్ట్ పిచ్చిదానిలా ఉన్నా..నీకు హాట్‌గా కనిపించానా : నటి హేమ -
సురేఖవాణి కూతురికి షాకిచ్చిన నెటిజన్లు
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సురేఖా వాణి. భర్త మరణం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. పార్టీలు, పబ్‌లు అంటూ కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ, ఆ ఫొటోలు షేర్ చేస్తుంటారు. దీంతో అటు సురేఖవాణితో పాటు సుప్రీతకు సైతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. దీంతో త్వరలోనే వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సుప్రీత..వరుస పోస్టులతో తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోతుంది. అయితే సడెన్‌గా ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది. గత కొన్ని రోజులుగా సుప్రీతను అన్‌ఫాలో చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే కొత్తగా 321 మంది కొత్తగా ఫాలో అయితే..422 మంది అన్ ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన లిస్ట్‌ను సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలోపోస్ట్ చేస్తూ..ఏం పాపం చేశాను ఫ్రెండ్స్ ..ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారు అంటూ తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం ఆమెకు 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చదవండి : 'అలాంటి వాళ్లను నమ్మొద్దు.. అప్పుడే సంతోషంగా ఉంటాం' ఉన్న న్యూస్ చెప్పండి: సురేఖా వాణి కూతురి ఫైర్ -
రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి
సింగర్ సునీత రెండో పెళ్లి అనంతరం నటి సురేఖ వాణి పెళ్లిపై గాలి మళ్లింది. సునీత బాటలోనే సురేఖ కూడా త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు ప్రచురితమయ్యాయి. సురేఖ రెండో వివాహానికి సిద్ధమైందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సునీత పెళ్లికి తన పిల్లలిద్దరూ ఎంకరేజ్ చేయడంతో ప్రస్తుతం సురేఖ కూతురు సుప్రీత కూడా తల్లిని మళ్లీ పెళ్లి చేసుకోవాలని సూచించినట్లు టాక్. దీంతో సురేఖ పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై సురేఖ వాణి స్పందించారు. తను రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలను ఖండించారు. అవి కేవలం పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన కూతురితో సంతోషంగా ఉన్నానని, సుప్రీత నుంచి పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి ఏం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సురేఖ భర్త చనిపోయి కేవలం ఏడాది పూర్తయ్యింది. ఆమె భర్త సురేష్ తేజ 2019 మేలో అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. సురేష్ తేజ హాస్పిటల్ లో ఉన్న చివరి దశలో సురేఖ భర్త దగ్గరే ఉన్నారు. ఇక ప్రస్తుతం సురేఖ తన కూతురిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీత సోషల్ మీడియాలో రోజుకో ఫోటో పోస్ట్ పెడుతూ అదరగొడుతూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అంతేగాక సుప్రీత నటన, డ్యాన్సు, డైలాగుల కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కూతురు భవిష్యత్తులో సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. తాను మాత్రం అడ్డు చెప్పానని.. అది తన కూతురి ఇష్టమని సురేఖ వాణి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
క్రియేటివ్ హగ్గర్స్
బిజీ లైఫ్‌లో మనసుకు నచ్చిన విషయాలను పట్టించుకొనే తీరికే ఉండటం లేదు. కెరీర్ ప్రవాహంలో కొట్టుకుపోతూ అభిరుచి పక్కకు పోతోంది. ఫలితం మొనాటమీ ఆవహించి జీవనశైలిని బోరెత్తిస్తోంది. పాడటం, బొమ్మలు వేయడం, కళాఖండాలు సృష్టించడం.. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది. కానీ దాన్ని ప్రదర్శించుకోవడానికే సరైన వేదిక కనిపించదు. అలాంటి వారినందరినీ ఓ ‘చెట్టు’ కిందకు తీసుకువచ్చి... వారిలోని క్రియేటివిటీని ప్రోత్సహిస్తోంది ‘ట్రీ హగ్గర్స్ క్లబ్’. ఎవరి ఉద్యోగాలు వారు చేస్తూనే.. వారిలోని టాలెంట్‌ను ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు. కళాకారులు, కళాభిమానులు.. ఇలా అందరూ ఒకే చెట్టు కిందకు చేర్చే ప్రయత్నంలో నుంచి పుట్టుకొచ్చిందే ‘ట్రీ హగ్గర్స్ క్లబ్’. నెలలో ఒకరోజు లోకల్ మార్కెట్ నిర్వహిస్తోంది. కళ, సృజనకు సంబంధించిన ప్రదర్శన ఇవ్వచ్చు. వీటి మీద ఆసక్తి ఉన్నవాళ్లయితే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. చెట్లపై మక్కువ.. చెట్లంటే మాకు చాలా ఇష్టం. కానీ సిటీ.. కాంక్రీట్ జంగిల్. దీని వల్ల మన మూలాలు కనుమరుగుతున్నాయి. అలా కనుమరుగవుతున్న మూలాలను తిరిగి తెలుసుకోవడమే ట్రీ హగ్గర్ ఆలోచన. ప్రకృతిపై దృష్టి పెట్టాలని, దాన్ని కాపాడుకోవాలని చెప్పడం కూడా మా లక్ష్యం. దానికి అనుబంధంగా క్రియేటివ్, ఆర్ట్స్ లాంటి ట్యాలెంట్ ఉన్నవారందరినీ ఒక ‘చెట్టు నీడ’లోకి తీసుకురావడమే ఈ క్లబ్ పేరులోని అర్థం. ఆర్టిస్టులు, మ్యుజీషియన్స్, కుకింగ్, ఆర్ట్, మ్యూజిక్ లవర్స్... ఇలా అందరూ ఒకే చోట తమ ప్రతిభను ప్రదర్శించుకోవచ్చు’ అంటారు క్లబ్ వ్యవస్థాపకురాలు సుప్రీత. ఈమె ఫ్రీలాన్స్ రైటర్, కార్పొరేట్ ట్రైనర్ కూడా. ‘క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది నా కోరిక. దాని కోసం గూగుల్‌లో జాబ్ కూడా వదిలేసి వెంటనే ఈ క్లబ్ స్టార్ట్ చేశా. నేను, నా పార్ట్నర్... మాలాంటి వారింకా ఎంతమంది ఉన్నారని వెతకడం మొదలు పెడితే చాలా మంది కనిపించారు. వారందరికీ సరైన ప్లాట్‌ఫాం కల్పించడమే మా లక్ష్యం. దీని ద్వారా ఎలాంటి క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్నైనా ప్రమోట్ చేస్తాం. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వంటివేమీ ఉండవు. క్రియేటివ్ పీపుల్ చేసిన వస్తువులే ఉంటాయి. రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్.. ఇలా ఎకో సిస్టమ్ గురించి ఆలోచించేవాళ్లు, పర్యావరణాన్ని ప్రేమించేవాళ్లే ఈ క్లబ్లో ఉంటారు. చెట్లని నాటకపోయినా, వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఓపెన్ ఫర్ ఆల్ క్లబ్’ అంటూ చెప్పుకొచ్చారు సుప్రీత. ఏం చేస్తుంటారు.. ఫ్లీ అఫైర్ ఈవెంట్ నిర్వహిస్తారు. ఇది ఒక రోజు మార్కెట్. ఎవరైనా వచ్చి వాళ్ల వర్క్‌ని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. అమ్మవచ్చు. కమెడియన్, సింగర్, మ్యుజీషియన్, ఆర్టిస్ట్.. ఇలా ఎవరైనా సరే. ‘ఈ సారి బ్యాక్ టూ బార్టర్ పద్ధతిని కూడా ఇంట్రడ్యూస్ చేశాం. పాత వస్తువులు తెచ్చి అక్కడ వేరే వస్తువులను కొనుక్కోవచ్చు. షామియానా, ఇతర వస్తువుల రెంట్ కోసం కొంత చార్జ్ చేస్తాం. నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ హరీష్ పెయింటింగ్, స్కల్ప్చర్, ఫొటోగ్రఫీలో ఎక్స్పరిమెంటల్ వర్క్ చేస్తుంటా’ అని క్లబ్ మరో ఫౌండర్ హరీష్ చెప్పారు. సుప్రీతది హైదరాబాద్. హరీష్ స్వరాష్ట్రం కేరళ. ఇద్దరూ కలిసి ఓ మంచి కాజ్ కోసం ఈ క్లబ్ నెలకొల్పడం విశేషం. - ఓ మధు