
సాక్షి, సినిమా : కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ‘ఈగ’ సినిమాతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు. ఈ క్రమంలో బాహుబలిలో కూడా ఓ చిన్న రోల్‌లో మెప్పించాడు కూడా. ఇక శాండల్‌వుడ్‌లో ఆయనకున్న ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకం. డూప్‌లు లేకుండా స్టంట్లు చేయటం ఆయనకు అలవాటైన పనే అయినా ఆ క్రమంలో తరచూ గాయాలపాలు అవుతుంటారు కూడా.
ప్రస్తుతం మరో స్టార్ శివరాజ్‌కుమార్‌తో విలన్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న ఆయన.. ఇప్పుడు హాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయాడు. ఆస్ట్రేలియా ఫిల్మ్ మేకర్ ఈడై ఆర్య రూపొందించబోయే ఓ యాక్షన్ చిత్రంలో సుదీప్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. టైటిల్ నిర్ధారణ కాని ఆ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతున్నానంటూ సుదీప్ స్వయంగా తెలియజేశాడు.
రష్యాలో వేలాది మందిని బలి తీసుకున్న ఓ పేలుడు నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతుందని.. అందులో ఫుల్‌గా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని.. అందుకే తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని సుదీప్ వెల్లడించారు. సమ్మర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందంట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా లో కూడా సుదీప్ ఓ పాత్రలో మెరవనున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment