జమ్మూకాశ్మీర్: పాకిస్థాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడగా దానిని నిలువరించే క్రమంలో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం మధ్యాహ్నం జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోగల నోగం సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అప్పటి వరకు బంకర్లో ఉన్న జూనియర్ కమిషన్డ్ రేంజ్ ఆర్మీ అధికారి బయటకు వచ్చిన సమయంలో పాక్ సైనికులు కాల్పులకు దిగారు. అయితే, ఆ వెంటనే భారత్ సైన్యం తీవ్రంగా స్పందించి కాల్పులు జరిపింది. అయితే, పాక్ వైపు ఏమైనా నష్టం జరిగిందా లేదా అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. గత రెండు వారాల నుంచి పాక్ వరుసక కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
పాక్ దుశ్చర్య.. ఆర్మీ ఆఫీసర్ మృతి
Published Tue, Aug 25 2015 4:49 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM