సైన్యాన్ని ముందుకు నడిపించే.. ఆర్మీ ఆఫీసర్ | good opportunity for who are waiting to join in army | Sakshi
Sakshi News home page

సైన్యాన్ని ముందుకు నడిపించే.. ఆర్మీ ఆఫీసర్

Published Fri, Aug 22 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

సైన్యాన్ని ముందుకు నడిపించే.. ఆర్మీ ఆఫీసర్

సైన్యాన్ని ముందుకు నడిపించే.. ఆర్మీ ఆఫీసర్

అప్‌కమింగ్ కెరీర్

దేశమాత సేవలో తరించేందుకు అవకాశం ఉన్న రంగం.. సైన్యం. దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడే సైనికులు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి వీర జవాన్లను ముందుండి నడిపించే నాయకుడే... ఆర్మీ ఆఫీసర్. బాధ్యతలు, సవాళ్లంటే ఇష్టపడే నేటి యువతకు సరిగ్గా సరిపోయే కెరీర్.. ఆర్మీ ఆఫీసర్.
 
పురస్కారాలు, గౌరవ మర్యాదలు
సరిహద్దుల రక్షణ, యుద్ధాల తోపాటు ప్రకృతి విపత్తుల్లోనూ సైన్యం సేవలందిస్తూ ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్లు తమ ర్యాంకును బట్టి ప్లాటూన్, కంపెనీ, డివిజన్, బ్రిగేడ్, కమాండ్, బెటాలియన్.. ఇలా వివిధ విభాగాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా తమ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ముందుకు నడిపించాలి. జన్మభూమికి సేవ చేయాలన్న ఆశయం, ఉన్నతమైన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలన్న తపన ఉన్నవారు సైన్యంలోకి ప్రవేశించొచ్చు.
 
ప్రస్తుతం ఆర్మీ ఆఫీసర్లకు భారీ వేతనాలు అందుతున్నాయి. పదవీ విరమణ అనంతరం కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చు. విధుల్లో భాగంగా ధైర్యసాహసాలు ప్రదర్శించే సైనికాధికారులకు అత్యున్నత పురస్కారాలు అందుతాయి. ప్రజల్లో విశేషమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దీంతోపాటు వృత్తిపరమైన ఆత్మసంతృప్తి దక్కుతుంది. సైనికాధికారి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. ఆత్మవిశ్వాసం, అంకితభావం, పట్టుదల అవసరం.
 
అర్హతలు: మిలిటరీ అకాడమీల్లో ప్రవేశానికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్; బ్యాచిలర్‌‌స డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షలు రాయొచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెక్నికల్ ఎంట్రీ ద్వారా  సైన్యంలో ప్రవేశించొచ్చు.
 
వేతనాలు:  కమిషన్డ్ లెఫ్టినెంట్‌కు ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. లెఫ్టినెంట్ కల్నల్/కల్నల్‌కు దాదాపు రూ.70 వేల వేతనం ఉంటుంది. లెఫ్టినెంట్ జనరల్ నెలకు రూ.లక్షకు పైగానే పొందొచ్చు. దీంతోపాటు ఎన్నో  రాయితీలు, భత్యాలు, వైద్య, బీమా సౌకర్యాలు ఉంటాయి.
 
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
* నేషనల్ డిఫెన్స్ అకాడమీ; వెబ్‌సైట్: www.nda.nic.in
* ఇండియన్ మిలిటరీ అకాడమీ
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
* ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
 
సవాళ్లతో కూడిన కెరీర్!
శ్రీఉజ్వల భవిష్యత్తుతోపాటు దేశ భద్రతలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించే కెరీర్ ఆర్మీ ఆఫీసర్. ఆర్మీలో కమిషన్డ్, నాన్‌కమిషన్డ్ అధికారులుంటారు. వారిలో సెకండ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తదితర హోదాల్లో ఆర్మీ ఆఫీసర్లు పనిచేస్తారు. ఆర్మీ ఉద్యోగాలు సవాళ్లతో కూడినవే అయినప్పటికీ క్రమశిక్షణాయుతమైన జీవనం అలవడుతుంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి కంటే మూడింతల మెరుగైన జీవితం ఆర్మీ ఆఫీసర్ సొంత్ంణ
 - మేజర్ జి. లక్ష్మణరావు, కెరీర్ కౌన్సెలింగ్ నిపుణులు,డెరైక్టర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement