సెల్‌ వాడొద్దన్నందుకు కాల్చి చంపాడు! | The officer who shot and killed the higher officer | Sakshi
Sakshi News home page

సెల్‌ వాడొద్దన్నందుకు కాల్చి చంపాడు!

Published Tue, Jul 18 2017 2:56 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

సెల్‌ వాడొద్దన్నందుకు కాల్చి చంపాడు!

సెల్‌ వాడొద్దన్నందుకు కాల్చి చంపాడు!

శ్రీనగర్‌: సరిహద్దుల్లో కాపలా విధులు నిర్వర్తిస్తున్న ఓ సైనికుడు సెల్‌ఫోన్‌ వాడొద్దని చెప్పిన పై అధికారిని కాల్చి చంపాడు. ఈ ఘటన భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని యూరి సెక్టార్‌లో చోటుచేసుకుంది. ఎల్‌వోసీ వెంట డ్యూటీలో ఉన్న ఓ సిపాయి సెల్‌ఫోన్‌లో మాట్లాడటంపై మేజర్‌ శేఖర్‌ థాపా అభ్యంతరం తెలిపారు. అయితే, ఆ జవాను ఆయన ఆదేశాల్ని లెక్కచేయలేదు. సదరు సిపాయి పదేపదే ఆజ‍్క్షల్ని ఉల్లంఘించటంపై ఇద్దరి మధ్యా వాదులాట జరిగింది.

కోపంతో ఉన్న ఆ జవాను శేఖర్‌ను తన వద్ద ఉన్న తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన మేజర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆ జవానును అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. కుటుంబం నుంచి ఎక్కువగా కాలం దూరంగా ఉంచటం, పనిభారం, సౌకర్యాల లేమి తదితర కారణాలతో జవాన్లు సహనం కోల్పోయి పై అధికార్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కాల్పులు జరపటం వంటివి ఇక్కడ తరచూ జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement