
వేలూరు: రైలు కిందపడి తల్లీకుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వేలూరు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు సమీపంలోని విరింజిపురం గ్రామానికి చెందిన రాజేశ్‌కుమార్ మేఘాలయలో ఆర్మీ అధికారి. ఇతని భార్య జయంతి(29), కుమార్తె నందిత(4) సొంత గ్రామంలో ఉంటున్నారు. రాజేశ్‌కుమార్ 20 రోజుల క్రితం సెలవుపై వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య శనివారం రాత్రి గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపం చెంది జయంతి ఆదివారం ఉదయం కుమార్తె నందితతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తల్లి, కుమార్తె ఇద్దరూ కలిసి విరింజిపురం వద్ద రైలు వచ్చే సమయంలో రైలు పట్టాలపై నిలబడ్డారు. రైలు ఢీకొని తల్లీ కుమార్తె ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
చెరువులో మునిగి పిల్లలు సహా తండ్రి మృతి
సాక్షి, చెన్నై:సెంబరంబాక్కం చెరువుకు వెళ్లిన తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతిచెందారు. కుండ్రత్తూరు సమీపంలోని తిరువళ్లువర్ నగర్‌కు చెందిన ఉస్మాన్ ఆదివారం సెలవు దినం కావడంతో కుమారుడు, కుమార్తెతో సమీపంలోని సెంబరంబాక్కం చెరువును చూసేందుకు వెళ్లారు. తండ్రితో కలిసి సరదాగా ఆడుకుంటూ, అక్కడున్న గోపురం వద్దకు పిల్లలు వెళ్లారు.
అక్కడి నుంచి నీటిని చూస్తుండగా ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత మరొకరు పిల్లలు పడిపోయారు. దీనిని గుర్తించిన ఉస్మాన్ పిల్లల్ని రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. సమీపంలో ఉన్న వాళ్లు సైతం నీళ్లలోకి దూకి రక్షించే యత్నం చేశారు. ఉస్మాన్‌ను బయటకు తీసుకు రాగా, ఆయన మృతిచెందాడు. అయితే, ఇద్దరు పిల్లలు చెరువు బురదలో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి ఆ పిల్లల మృతదేహాల కోసంగా లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment