
షాహిద్ కపూర్.
రెండు రీమేక్ సినిమాల (‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశారు, ‘జెర్సీ’ని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు) తర్వాత ఓ స్ట్రయిట్ ప్రాజెక్ట్ ఓకే చేశారు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్. మాల్దీవుల్లో జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఈ సినిమాలో షాహిద్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ క్యాక్టస్’ అనే పేరుని పరిశీలిస్తున్నారట. ఆదిత్య నింబల్కర్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించనున్నారు. గతంలో కరణ్ నిర్మాణంలో ‘షాందార్’ అనే సినిమాలో నటించారు షాహిద్.
Comments
Please login to add a commentAdd a comment