ఈ నెలాఖర్లో థియేటర్స్‌లోకి వస్తున్నాడు దేవా. షాహిద్ కపూర్ టైటిల్ రోల్‌లో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘దేవా’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ‘దేవా’ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
తాజాగా ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘లాక్ అండ్ లోడ్’ అంటూ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు షాహిద్ కపూర్. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాకు విశాల్ మిశ్రా సంగీతం అందించగా, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment