deva
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. మజాకా, శబ్దం, దేవా, అగాథియా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇంతకీ తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీస్ ఏంటంటే?ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ (మార్చి 28)నెట్ ఫ్లిక్స్దేవా - హిందీ సినిమాద లేడీస్ కంపానియన్ - స్పానిష్ సిరీస్ద లైఫ్ లిస్ట్ - ఇంగ్లీష్ మూవీఅమెజాన్ ప్రైమ్శబ్దం - తెలుగు డబ్బింగ్ సినిమాచూ మంతర్ - కన్నడ మూవీసన్ నెక్స్ట్బచ్చలమల్లి - తెలుగు సినిమాబిగ్ బెన్ - మలయాళ మూవీఅగాథియా - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్ స్టార్ఓం జై కాళీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆహావిజయ్ ఎల్ఎల్ బీ - తమిళ సినిమాజీ5మజాకా - తెలుగు మూవీసెరుప్పగుల్ జాకర్తై - తమిళ సిరీస్విడుదలై పార్ట్ 2 - హిందీ వెర్షన్ మూవీలయన్స్ గేట్ ప్లేబిఫోర్ ఐ వేక్ - ఇంగ్లీష్ మూవీడెన్ ఆఫ్ థీవ్స్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాజురాసిక్ హంట్ - ఇంగ్లీష్ మూవీరెడ్ లైన్ - ఇంగ్లీష్ సినిమాబుక్ మై షోబ్రిడ్జెట్ జోన్స్ - ఇంగ్లీష్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్కిల్ దిల్ - హిందీ సిరీస్ఆపిల్ టీవీ ప్లస్నంబర్ వన్ ఆన్ ద కాల్ షీట్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య) -
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్‌గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి (Pooja Hegde) టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. రెండు మూడేళ్ల ముందు వరకు తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేసింది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి వరస డిజాస్టర్స్ దెబ్బకు పూర్తిగా సౌత్ కి దూరమైపోయింది. హిందీలో ప్రయత్నిస్తే ఒకటి రెండు ఛాన్సులు వచ్చాయి గానీ ఆయా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ ఏడాది జనవరి 31న రిలీజైన 'దేవా' (Deva OTT) సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమో ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో కాస్త కొత్తగా అనిపించడంతో హిట్ అయింది. దీన్ని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. కానీ ఫ్లాప్ అయింది. దీన్నే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తీస్తే ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది.ఇప్పుడు 'దేవా' సినిమా ఓటీటీలోకి రానుంది. మార్చి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య థియేటర్లలో ఫ్లాప్ అయిన 'ఎమర్జెన్సీ' లాంటి మూవీస్ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. మరి 'దేవా' కూడా అలా ఏమైనా ట్రెండింగ్ అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
స్టార్ హీరోలపై ప్రశ్న.. మీ ప్రాబ్లం ఏంటంటూ పూజా హెగ్డే ఫైర్!
విలేకరిపై హీరోయిన్ పూజా హెగ్డే ఫైర్ అయింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్‌గా ఉండే పూజా ఇంతలా ఫైర్ అవ్వడానికి గల కారణం..విలేకరి ఓ ప్రశ్నను పదే పదే అడగడమే. ఎన్నిసార్లు సమాధానం చెప్పినా.. మళ్లీ అదే ప్రశ్న అడగడంతో పూజా ఫైర్ అయింది. ఇంతకీ విలేకరి అడిగిన ప్రశ్న ఏంటి?అదృష్టం అనుకుంటే అనుకోండివరుస అపజయాలతో సతమతమవుతున్న పూజా హెగ్డే(Pooja Hegde )కి ‘దేవా’ (Deva)మూవీ మంచి ఉపశమనం ఇచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో షాహిద్‌తో కలిసి పూజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే ఇంటర్వ్యూలో మధ్యలో విలేకరి.. ‘బాలీవుడ్ అగ్ర హీరోలైన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడాన్ని అదృష్టంగా భావిస్తారా? ఆయా చిత్రాలకు మీరు అర్హులేనని అనుకుంటున్నారా?’ అని అడిగారు. దీనికి పూజా కూల్‌గానే సమాధానం చెప్పింది. ‘ఆ సినిమాలకు నేను కచ్చితంగా అర్హురాలినే. ఆయా సినిమాల్లో నన్ను ఎంచుకోవడానికి దర్శకనిర్మాతలకు కొన్ని కారణాలు ఉంటాయి. ఒక అవకాశం వచ్చినప్పడు దానికి అనుగుణంగా పని చేసి ఆ పాత్రకు న్యాయం చేయాలి. నేను అదే పని చేశాను. దాన్ని మీరు అదృష్టం అనుకుంటే అనుకోండి. నేను ఏ మాత్రం బాధపడను’ అని పూజా సమాదానం ఇచ్చింది.ఫైర్ అయిన పూజా.. కూల్ చేసిన సాహిద్పూజా సమాధానం చెప్పిన తర్వాత కూడా సదరు విలేకరి ‘మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల చిత్రాలైతేనే చేస్తారా?’అని మళ్లీ అడిగాడు. ఇలా స్టార్ హీరోలపైనే వరుస ప్రశ్నలు వేయడంతో పూజా హెగ్డే సహనాన్ని కోల్పోయింది. ‘అసలు మీ సమస్య ఏంటి? ఏం సమాధానం కావాలి’ అంటూ ఫైర్ అయింది. దీంతో షాహిద్ వెంటనే కలగజేసుకొని మ్యాటర్‌ని డైవర్ట్ చేశాడు.‘నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతడికి ఇష్టం అనుకుంటా. అతడు కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ అని చెప్పాడు. ‘దేవా’లో హిట్ ట్రాక్ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలలో అలరించింది పూజా హెగ్డే. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఆమె ఖాతాలో సరైన హిట్టే పడలేదు. అయినా కూడా స్టార్స్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో పూజాకి ఇక్కడ ఆఫర్స్ తగ్గాయి. దీంతో బాలీవుడ్‌నే నమ్ముకుంది ఈ పొడుగు కాళ్ల సుందరీ. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. దీంతో పూజా కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పూజాకి మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘దేవా’ మంచి టాక్ని సంపాదించుకుంది. ప్రస్తుతం పూజా రెండు భారీ సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి దళపతి విజయ్ ‘జన నాయగన్’ కాగా, మరొకటి సూర్య హీరోగా నటిస్తున్న 'రెట్రో'. ఈ రెండింటిపై పూజా చాలా ఆశలు పెట్టుకుంది. -
వన్ అండ్ ఓన్లీ దేవా
షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవా’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దేవా’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్లో షాహిద్ మాసీ విజువల్స్ మాత్రమే కనిపిం చాయి. కానీ చివర్లో వన్ అండ్ ఓన్లీ దేవా వస్తున్నాడు అని చూపించారు. పావైల్ గులాటి, ప్రవేవ్ రాణా, కుబ్రా సైట్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విశాల్ మిశ్రా స్వరకర్త. -
దేవా వస్తున్నాడు
ఈ నెలాఖర్లో థియేటర్స్‌లోకి వస్తున్నాడు దేవా. షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘దేవా’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ‘దేవా’ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘లాక్ అండ్ లోడ్’ అంటూ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు షాహిద్ కపూర్. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాకు విశాల్ మిశ్రా సంగీతం అందించగా, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. -
బస్తీ ప్రేమకథ
‘బందూక్, శేఖరంగారి అబ్బాయి’ చిత్రాల ఫేమ్ అనురూప్ రెడ్డి హీరోగా నటించిన మూడో చిత్రం ‘ప్రేమించొద్దు’. దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. శిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో 5 భాషల్లో నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదలకానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. తెలుగులో జూన్ 7న విడుదల చేస్తాం.ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘తల్లిదండ్రులు, పిల్లలు చూసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సూపర్ వైజింగ్ ప్రోడ్యూసర్ నిఖిలేష్ తొగరి. ‘‘ఈ సినిమా ఎంతో వాస్తవంగా ఉంటుంది’’ అన్నారు అనురూప్ రెడ్డి. నటీమణులు సంతోషి, సోనాలీ గర్జె, మానస మాట్లాడారు. -
బుల్లితెరపై అర్చన
మనకున్న అద్భుతమైన నటీమణుల్లో అర్చన ఒకరు. ఈమె నటించిందంటే తెరపై పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన గొప్ప నటి అర్చన. ఈమె నటనకు దూరమై చాలా కాలమైంది. ఈమెను నటింపజేయూలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించి విఫలమయ్యూరు. అలాంటి నటిని సీనియర్ దర్శకుడు సురేష్‌కృష్ణ బుల్లి తెరపైకి తీసుకురావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో ఉనర్వుగళ్ అనే మెగా సీరియల్ రూపొందుతోంది. ఉనర్వుగళ్ సీరియల్ మిమ్మల్ని మీరే చూసుకునే కథ అన్నారు దర్శకుడు సురేష్‌కృష్ణ. బుల్లితెర సీరియల్‌గా కాకుండా వెండితెరపై చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సీరియల్ సోమవారం నుంచి పుదుయుగం టీవీలో ప్రసారమవుతుందని తెలిపారు. దేవా సంగీతం అందించారని వివరించారు. -
వైఎస్సార్ సీపీ నేత భవనం భూషణ్ తో సాక్షి వేదిక