
‘బందూక్, శేఖరంగారి అబ్బాయి’ చిత్రాల ఫేమ్ అనురూప్ రెడ్డి హీరోగా నటించిన మూడో చిత్రం ‘ప్రేమించొద్దు’. దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. శిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో 5 భాషల్లో నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదలకానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. తెలుగులో జూన్ 7న విడుదల చేస్తాం.
ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘తల్లిదండ్రులు, పిల్లలు చూసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సూపర్ వైజింగ్ ప్రోడ్యూసర్ నిఖిలేష్ తొగరి. ‘‘ఈ సినిమా ఎంతో వాస్తవంగా ఉంటుంది’’ అన్నారు అనురూప్ రెడ్డి. నటీమణులు సంతోషి, సోనాలీ గర్జె, మానస మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment