
సంజయ్ దత్ ఇప్పుడు ఫుల్ బిజీ. ఒకేసారి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ‘తోర్భాజ్’ అనే సినిమా ఒకటి. మిగతా సినిమాల్లో ఎలా ఉన్నా ఈ సినిమాలో మాత్రం ఫిట్‌గా ఉన్న సంజయ్‌ని చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. గరీష్ మాలిక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
సూసైడ్ బాంబర్ కిడ్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగనుందట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇది కాకుండా ‘కళంక్’, ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’, ‘పానిపట్’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో ‘కళంక్’, ‘పానిపట్’ వచ్చే ఏడాది రిలీజవుతాయి. ఇదిలా ఉంటే.. సంజయ్ జీవితం ఆధారంగా రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్‌లో నటించిన ‘సంజు’ జూన్ 29న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment