
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
బందిపోటుగా తుపాకీ పట్టిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నెక్ట్స్ చిత్రం కోసం ఆర్మీ ఆఫీసర్‌గా గన్ను పట్టనున్నారు. ఆర్మీ డే సందర్భంగా ‘రైఫిల్ మేన్’ అనే సినిమాలో సోల్జర్‌గా నటించనున్నట్లు అనౌన్స్ చేశారు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఈ సినిమాకు విక్రమ్ మల్హోత్రా, వసు భగ్నానీ నిర్మాతలు. ‘‘ఆధునిక శత్రుత్వం.. కాపాడుకోవాల్సిన సరిహద్దు.. ధైర్యవంతుడైన సైనికుడు’’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘కిజీ ఔర్ మన్నీ’ షూటింగ్‌ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న సుశాంత్ ఇప్పుడు తన బర్త్ డే కోసం ‘సంచిరియా’ షూట్ నుంచి బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో సుశాంత్ బందిపోటుగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment