ఆ సైనిక అధికారికి క్లీన్‌చిట్‌ | Army officer who tied youth to jeep in Kashmir gets clean chit; praised by court | Sakshi
Sakshi News home page

ఆ సైనిక అధికారికి క్లీన్‌చిట్‌

Published Mon, May 15 2017 3:54 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

ఆ సైనిక అధికారికి క్లీన్‌చిట్‌

ఆ సైనిక అధికారికి క్లీన్‌చిట్‌

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో పౌరుడిని జీపుకు కట్టివేసిన ఘటనలో సైనికాధికారిని ఆర్మీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంక్లిష్ట పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో వ్యవహరించినందుకు మేజర్‌ నితిన్‌ గొగొల్‌ను ఆర్మీ కోర్టు ఆఫ్‌ ఎంక్వైరీ(సీఓసీ) ప్రశంసించినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. సైనికుల ప్రాణాలకు ఆపద రాకుండా ఆయన చాకచక్యంగా వ్యవహరించారని కొనియాడినట్టు తెలిపాయి.

ఏప్రిల్‌ 9న శ్రీనగర్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా బుద్గామ్‌లో ఆందోళనకారులు హింసకు దిగి భద్రతా సిబ్బందిపై దాడులకు ప్రయత్నించారు. ఆ సమయంలో 53 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నితిన్‌ గొగొల్‌.. ఆందోళనకారులు రాళ్లు తమవైపు విసరకుండా ఉండేందుకు ఫరూక్‌దార్‌ అనే పౌరుడిని రక్షణ కవచంలా తమ జీపుకు ముందువైపు కట్టివేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు బయటకు రావడంతో విమర్శలు వెలువెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నాయకులు సైనికుల చర్యను ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement