
నేనే రావణుణ్ణి రెడీ చేశా! - రకుల్‌ప్రీత్ సింగ్
డాడీ ఆర్మీ ఆఫీసర్ కావడంతో చిన్నప్పట్నుంచీ ఏ ఊరిలో ఉంటే అక్కడ దసరా జరుపుకునేవాళ్లం. దసరా అంటే.. ‘మనలో చెడుని అంతం చేసి, మంచి వ్యక్తిగా ఎదగడం’ అని అర్థం. ప్రతి విజయదశమికీ ఉదయం ఇంట్లో పూజ జరుగుతుంది. సాయంత్రం రావణుణ్ణి దహనం చేస్తారు కదా. ఆ దుష్ట దహన కార్యక్రమం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒకట్రెండు సార్లు నేనే రావణుణ్ణి రెడీ చేశా.
హీరోయిన్ అయ్యాక దసరాకు ఇంటికి వెళ్లలేదు. ఏదో సినిమా షూటింగ్ ఉండేది. ఈ దసరాకు అమ్మానాన్నలు నాతోనే ఉంటున్నారు. అమ్మానాన్నలు నాతో ఉన్న ప్రతి రోజూ స్పెషలే.