ఆర్మీ ఆఫీసర్‌ ఏకబిగిన 25 పుల్‌-అప్‌లు : నెటిజన్లు ఫిదా | Major General Prasanna Joshi Pull-Ups Without Break goes viral on social media | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఆఫీసర్‌ ఏకబిగిన 25 పుల్‌-అప్‌లు : నెటిజన్లు ఫిదా

Published Mon, Jul 1 2024 11:34 AM | Last Updated on Mon, Jul 1 2024 1:17 PM

Major General Prasanna Joshi Pull-Ups Without Break goes viral on social media

మంచి రోగ నిరోధక శక్తి, శారీరక దృఢత్వం కావాలంటే నిరంతర వ్యాయాయం  చాలా కీలకం. దీనికి వయసుతో సంబంధంలేదు. అందులోనూ  సైన్యంలో పనిచేసేవాళ్లకి ఫిట్‌నెస్‌ చాలా అవసరం. భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ప్రసన్న జోషి ఇదే నిరూపించారు. ఈయన్‌ ఫిట్‌నెస్‌కు ముగ్ధుడైన మాజీ సైనికాధికారి ఎక్స్‌లో   షేర్‌ చేసిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.

మేజర్ జనరల్ ప్రసన్న జోషి 56 ఏళ్ల వయసులో ఏకబిగిన 25 పుల్-అప్‌లు తీశారు.  దీనికి సంబంధించిన వీడియోను రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ జేఎస్‌ సోధి షేర్ చేశారు.  ‘ఆయన ఫిట్‌నెస్‌కి సెల్యూట్‌..2022, అక్టోబరులో భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట శక్తిగా జర్మన్ ప్రచురణ స్టాటిస్టా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. భారత సైన్యానికి గర్వకారణం... జై హింద్‌’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్‌ చేశారు.  దీంతో యువ ఆర్మీ అధికారులు, నెటిజన్లు జోషి ఫిట్‌నెస్‌పై  ప్రశంసలు కురిపించారు. ‘సిగ్గు పడుతున్నాను.. ఈ వీడియో జిమ్‌కు వెళ్లేలా ప్రేరేపించింది’ అంటూ భారతీయ వైమానిక దళ అనుభవజ్ఞుడు వినోద్ కుమార్ తెలిపారు. ప్రసన్న జోషి శారీరక దృఢత్వం భారత సైన్యం అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబం. ఆయన అంకితభావం, దేశానికి చేసిన సేవకు వందనం చేస్తున్నామంటూ మరో యూజర్‌ రాహుల్ థాపా  పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement