ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే! | Sakshi
Sakshi News home page

ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!

Published Fri, Mar 15 2024 11:45 AM

Fitness Coach Shares 3 Easy Ways To Lose Weight - Sakshi

ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధిక బరువు. పెద్దగా తినకపోయినా కూర్చొని గంటలు, గంటలు పనిచేయడం వల్ల వచ్చేస్తుంటుంది. మరికొందరికీ తిండి కంట్రోల్‌ లేకపోవడం వల్లే వచ్చేస్తుంటుంది. దీంతో జిమ్మ్‌ల్లో గంట తరబడి వర్కౌట్లతో మునిగిపోతుంటారు. తొందరగా బరువు తగ్గాలన్న భావనతో చాలా తక్కువ తినేలా డైట్‌ ప్లాన్‌ చేస్తుంటారు. కానీ బరువు తగ్గుతారా అంటే? లేదనే చెప్పాలి. పైగా బాబోయ్‌ మావల్ల కాదంటూ మధ్యలో వదిలేస్తుంటారు. మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోవడం షరా మాములైపోతుంది. అయితే ఇలాంటి సమస్యకు ప్రముఖ విమెన్‌ వెయిట్‌ లాస్‌ ఫిట్‌నెస్‌ కొచ్చ్‌ తాను చెప్పే ఆ మూడే పద్ధతులతో చెక్‌ పెట్టొచ్చు అంటోంది. అవేంటో చూద్దామా!.

జార్జియాకు చెందిన ప్రముఖ కోచ్‌ జెన్నా రిజ్జో వేసవి సమీపించేలోపు బరువు తగ్గాలనుకుంటే ఈ మూడింటిని ఫాలో అయితే చాలని చెబుతుంది. అలాగే తొందరగా తగ్గాలన్న తాపత్రయం కంటే నిధానంగా తగ్గడమే మేలని చెబుతోంది రిజ్జో. అంతేగాదు జిమ్‌లో ఎక్కువ వర్కౌట్‌లతో గడపాల్సిన పనిలేదంటోంది. ముఖ్యంగా ఆహ్లాదభరితంగా చేయాలనే సన్నద్ధంతో ఉండమని చెబుతోంది. జస్ట్‌ 30 నిమిషాలు తాను చేయగలిగే సింపుల్‌ వ్యాయామాలు జోష్‌ఫుల్‌గా చేయమని చెబుతుంది. అదేలా ఉండాలంటే.. అబ్బా రేపు ఈ వ్యాయామం చేయాలి అనే ఉత్సుకతను రేకెత్తించేలా చేస్తే చాలట.

దశల వారిగా ఒక్కో వ్యాయామాన్ని పెంచండి. మనసుకి ఇష్టం లేకపోతే కొద్దిగా చేసి స్కిప్‌ చేయమంటోంది. ఏదో భారంగా లేదా దాన్నో పెద్ద పనిలా చేస్తే.. ఎప్పుడూ మానేద్దామా? అనే ఫీల్‌ ఆటోమేటిగ్గా మనలో వస్తే మాత్రం చేసిందంతా.. వేస్ట్‌ అని ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పేస్తోంది. ముఖ్యంగా డైట్‌ విషయంలో కూడా మరీ నోటిని కుట్టేసుకునేలా కాకుండా నచ్చినవన్నీ ఆస్వాదిస్తూ కొంచెం అంటూ మనసుకు చెప్పుకునేలా రెడీ అవ్వాలి. అలాగే ఆ డైట్‌లో ఒక్కో ఫ్రూట్‌ వెరైటీని యాడ్‌ చేసుకుంటూ పోతూ తినే భోజనం పరిమాణం తగ్గేలా చేయాలి. చివరిగా అతి ముఖ్యమైనది నిద్ర. ఇది కంటి నిండా ఉండాలని చెబుతోంది.

కనీసం ఏడు గంటలు తప్పనిసరిగా నిద్రపోతేనే ఎన్ని వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉండేదని బల్లగుద్ది మరీ చెబుతోంది రిజ్జో. ఈ మూడింటిని చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ ఫాలో అయితే బరువు ఇట్టే తగ్గిపోతారని అంటోంది. ఈ మూడింటి కారణంగా మంచి ఫిట్‌నెస్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. పైగా శరీరంపై ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవ్వవు, మంచి యాక్టివ్‌గా ఉంటారని చెబుతోంది రిజ్జో. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. పైగా స్పీడ్‌గా బరువు తగ్గడం అనేది అనారోగ్య సమస్యలకు మూలం అవుతుందని హెచ్చరిస్తోంది. సో..! మీరు కూడా సింపుల్‌గా ఈజీగా ఉండే ఈ మూడు మార్గాలను అనుసరించి బరువు తగ్గిపోండి మరీ..!

(చదవండి: ఆ ఒక్క ఎక్క్‌ర్‌సైజుతో..అధిక బరువుకి చెక్‌ పెట్టిన నర్సు!)

Advertisement
 
Advertisement
 
Advertisement