Pull Ups
-
ఆర్మీ ఆఫీసర్ ఏకబిగిన 25 పుల్-అప్లు : నెటిజన్లు ఫిదా
మంచి రోగ నిరోధక శక్తి, శారీరక దృఢత్వం కావాలంటే నిరంతర వ్యాయాయం చాలా కీలకం. దీనికి వయసుతో సంబంధంలేదు. అందులోనూ సైన్యంలో పనిచేసేవాళ్లకి ఫిట్నెస్ చాలా అవసరం. భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ప్రసన్న జోషి ఇదే నిరూపించారు. ఈయన్ ఫిట్‌నెస్‌కు ముగ్ధుడైన మాజీ సైనికాధికారి ఎక్స్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.మేజర్ జనరల్ ప్రసన్న జోషి 56 ఏళ్ల వయసులో ఏకబిగిన 25 పుల్-అప్లు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ జేఎస్ సోధి షేర్ చేశారు. ‘ఆయన ఫిట్నెస్కి సెల్యూట్..2022, అక్టోబరులో భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట శక్తిగా జర్మన్ ప్రచురణ స్టాటిస్టా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. భారత సైన్యానికి గర్వకారణం... జై హింద్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ చేశారు. దీంతో యువ ఆర్మీ అధికారులు, నెటిజన్లు జోషి ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించారు. ‘సిగ్గు పడుతున్నాను.. ఈ వీడియో జిమ్‌కు వెళ్లేలా ప్రేరేపించింది’ అంటూ భారతీయ వైమానిక దళ అనుభవజ్ఞుడు వినోద్ కుమార్ తెలిపారు. ప్రసన్న జోషి శారీరక దృఢత్వం భారత సైన్యం అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబం. ఆయన అంకితభావం, దేశానికి చేసిన సేవకు వందనం చేస్తున్నామంటూ మరో యూజర్ రాహుల్ థాపా పేర్కొన్నారు.Salute and respect to the physical fitness of Major General Prasanna Joshi of the Indian Army. No wonder the Indian Army has been rated as the finest fighting force in the world by the German publication Statista in October 2022. Proud of the Indian Army. Jai Hind🇮🇳 #IndianArmy… pic.twitter.com/xuCPTcHqfh— Lt Col JS Sodhi (Retd) (@JassiSodhi24) June 29, 2024 -
Pull-ups: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు..
కాన్బెర్రా: వ్యాయామం చేసే వారు తమ బాడీ ఫిట్‌గా ఉండేందుకు కచ్చితంగా పుల్ అప్స్ చేస్తారు. వీటి వల్ల వీపు, ఛాతీ, భుజాల ఖండరాలు ఉత్తేజితమవుతాయి. అయితే ఇవి చేయడం కాస్త కఠినమే. రోజుకు 1,000 పుల్ అప్స్ చేయడమంటే గగనమే. అయితే ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు మాత్రం పుల్ అప్స్లో గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 24 గంటల్లో 8,008 పుల్ అప్స్ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. గత రికార్డు 7,715 పుల్ అప్స్‌ను చెరిపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జాక్సన్ ఇటాలియోనో తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ రికార్డు కోసం తాను 8 నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు. ఎట్టకేలకు తన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందన్నాడు. View this post on Instagram A post shared by Jaxon Italiano (@jaxon_italiano) గతంలో మరొకరి పేరుపై ఉన్న 12 గంటల్లో 5,900 పుల్ అప్స్ రికార్డును కూడా జాక్సన్ అధిగమించాడు. కాగా.. మొత్తం 24 గంటల్లో చివరి 3.5 గంటలను జాక్సన్ వినియోగించుకోలేదు. తీవ్రంగా అలసిపోవడంతో ఈ సమయంలో ఒక్క పుల్ అప్ కూడా చేయలేదు. అయినా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సత్తా చాటాడు. జాక్సన్ పుల్ అప్స్ రికార్డుతో పాటు ఈ ఒక్క రోజే చారిటీ కోసం రూ.5లక్షల విరాళాలు కూడా సేకరించడం గమనార్హం. చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి! -
ఎగురుతున్న హెలికాప్టర్‌పై పులప్స్
సాధారణ పుషప్స్, పులప్స్, చేయాలంటేనే ఎంతో ఫిట్నెస్ కావాలి. ఇక ఎగురుతున్న హెలికాప్టర్‌కు వేలాడుతూ పులప్స్ చేయడమంటే.. ఫిట్నెస్ ఫ్రీక్స్ అయి ఉండాలి. రికార్డుల పిచ్చయినా ఉండాలి. అలాంటి సాహసాన్ని చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు డచ్ ఫిట్‌నెన్ ఇన్ఫ్లూయెర్స్ స్టాన్ బ్రూనింక్. యూట్యూబ్‌లో ఫిట్నెస్ చానల్‌తో స్టాన్ బ్రౌనీగా పాపులర్ అయిన బ్రూనింక్... అతని కోహోస్ట్–ఆర్జెన్ ఆల్బర్స్.. ఇద్దరూ బెల్జియమ్, ఆంట్వెర్ప్లోని హోవెనన్ ఎయిర్‌ఫీల్డ్‌లో గిన్నిస్ అధికారుల సమక్షంలో వరల్డ్ ఫీట్ కోసం ప్రయత్నించారు. నిమిషానికి 25 పులప్స్‌తో బ్రూనింక్ రికార్డును నెలకొల్పాడు. అది కూడా రెండు సార్లు. ఇక మొదట 24 పులప్స్ చేసిన ఆల్బర్స్ అంతకుముందు 23 పులప్స్‌తో ఉన్న ఓ రోమెనియన్ రికార్డును బ్రేక్ చేశాడు. తరువాత బ్రూనింక్ 25 పులప్స్‌తో ఆ రికార్డునూ బద్దలు కొట్టాడు. ఎగురుతున్న హెలికాప్టర్... విపరీతమైన గాలి, భయంకరమైన ధ్వని. అది ఊగుతూ ఉంటే.. దానికి వేలాడుతూ పులప్స్ చేసి, ఇద్దరూ సాహసమే చేశారు. ఇలా కదులుతున్న వాహనాల మీద సాహసాలు చేసిన రికార్డులు గతంలోనూ ఉన్నాయి. 1 నిమిషం 30 సెకన్లలో కదులుతున్న కారు టైర్ మార్చి రికార్డు నెలకొల్పగా.. అంతకంటే తక్కువ సమయం 1నిమిషం 13 సెకన్లలోనే మార్చేసి.. ఆ రికార్డును బ్రేక్ చేశారు ఇద్దరు ఇటాలియన్లు. -
TN: గుణపాఠం నేర్వరా? : హైకోర్టు
సాక్షి, చెన్నై: చెన్నై జలదిగ్బంధంపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ఐదేళ్లు ఏం చేశారంటూ కార్పొరేషన్ అధికారులపై ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా గుణపాఠం నేర్వరా..? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ, న్యాయమూర్తి ఆది కేశవులు బెంచ్ ముందు మంగళవారం చెన్నై నగరంలో రోడ్ల విస్తరణ, ఫుట్పాత్లలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్రంగా∙స్పందించారు. 2015లో చెన్నై నీట మునిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఐదేళ్లుగా ఏం చేశారు? అని కార్పొరేషన్ వర్గాల్ని ప్రశ్నించారు. ఒకసారి చెన్నై నీట మునిగినానంతరం, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదా..?, తీసుకుని ఉంటే, రెండు రోజుల వానకే జలదిగ్బంధంలో ఈ నగరం చిక్కేదా..? అని ప్రశ్నించారు. చెన్నైను వరద విలయం నుంచి గట్టెక్కించే పథకాలు చేపట్టలేరా..? అని ప్రశ్నిస్తూ, గుణపాఠం నేర్వాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో చెన్నైలో సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నామని, లేనిపక్షంలో కోర్టు ధిక్కారం కేసును ఎదుర్కోక తప్పదని కార్పొరేషన్ అధికారుల్ని సీజే బెంచ్ హెచ్చరించింది. -
60 సెకన్లలో 51 పుల్లప్స్
అమెరికన్ ఫిట్నెస్ మాస్టర్ గిన్నిస్ రికార్డు వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ ఫిట్నెస్ మాస్టర్ పుల్లప్స్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించాడు. నిమిషంలో అత్యధికంగా పుల్లప్స్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. వాషింగ్టన్ నగరానికి చెందిన 31 ఏళ్ల ఆడమ్ శాండెల్ 60 సెకన్లలో 51 పుల్లప్స్ చేసి గిన్నిస్ బుక్కులోకెక్కాడు. ‘పుల్లప్స్‌లో వీలైనన్ని గిన్నిస్ రికార్డులు సాధించడమే నా లక్ష్యం. గతంలో 50 పుల్లప్స్ చేసిన వ్యక్తిగా కూడా రికార్డు నా పేరిటే ఉంది. ఇప్పుడు దానిని మళ్లీ నేనే అధిగమించాను. భవిష్యత్తులో కూడా మరిన్ని రికార్డులు సాధిస్తాను. ఇక ఈ రికార్డు వెనుక ఎలాంటి కృషి ఉందంటూ గిన్నిస్ ప్రతినిధులు అడిగారు. శరీరాన్ని బాణంలా నిలువుగా ఉంచడమే ఈ రికార్డు వెనుక ఉన్న సీక్రెట్. నిజానికి నిమిషంలో 53 పుల్లప్స్ చేశాను. కానీ అందులో రెండు డిస్క్వాలిఫై అయ్యాయి. దీంతో రికార్డు 51కే పరిమితమైంది. భవిష్యత్తులో 60 సెకన్లలో 60 పుల్లప్స్ చేయడమే నా లక్ష్యం’ అని శాండెల్ ధీమా వ్యక్తం చేశాడు.