60 సెకన్లలో 51 పుల్లప్స్‌ | New Guinness World Record For Most Pull-Ups In A Minute | Sakshi
Sakshi News home page

60 సెకన్లలో 51 పుల్లప్స్‌

Published Wed, Aug 30 2017 11:05 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

60 సెకన్లలో 51 పుల్లప్స్‌ - Sakshi

60 సెకన్లలో 51 పుల్లప్స్‌

అమెరికన్‌ ఫిట్‌నెస్‌ మాస్టర్‌ గిన్నిస్‌ రికార్డు  
వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ ఫిట్‌నెస్‌ మాస్టర్‌ పుల్లప్స్‌లో గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. నిమిషంలో అత్యధికంగా పుల్లప్స్‌ చేసిన వ్యక్తిగా నిలిచాడు. వాషింగ్టన్‌ నగరానికి చెందిన 31 ఏళ్ల ఆడమ్‌ శాండెల్‌ 60 సెకన్లలో 51 పుల్లప్స్‌ చేసి గిన్నిస్‌ బుక్కులోకెక్కాడు. ‘పుల్లప్స్‌లో వీలైనన్ని గిన్నిస్‌ రికార్డులు సాధించడమే నా లక్ష్యం. గతంలో 50 పుల్లప్స్‌ చేసిన వ్యక్తిగా కూడా రికార్డు నా పేరిటే ఉంది. ఇప్పుడు దానిని మళ్లీ నేనే అధిగమించాను. భవిష్యత్తులో కూడా మరిన్ని రికార్డులు సాధిస్తాను.

ఇక ఈ రికార్డు వెనుక ఎలాంటి కృషి ఉందంటూ గిన్నిస్‌ ప్రతినిధులు అడిగారు. శరీరాన్ని బాణంలా నిలువుగా ఉంచడమే ఈ రికార్డు వెనుక ఉన్న సీక్రెట్‌. నిజానికి నిమిషంలో 53 పుల్లప్స్‌ చేశాను. కానీ అందులో రెండు డిస్‌క్వాలిఫై అయ్యాయి. దీంతో రికార్డు 51కే పరిమితమైంది. భవిష్యత్తులో 60 సెకన్లలో 60 పుల్లప్స్‌ చేయడమే నా లక్ష్యం’ అని శాండెల్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement