రైలు పట్టాలపై ఆర్మీ ఆఫీసర్ మృతదేహం | The body of the train Army Officer | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై ఆర్మీ ఆఫీసర్ మృతదేహం

Published Thu, Sep 11 2014 12:28 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

రైలు పట్టాలపై ఆర్మీ ఆఫీసర్ మృతదేహం - Sakshi

రైలు పట్టాలపై ఆర్మీ ఆఫీసర్ మృతదేహం

విశాఖపట్నం : మణిపూర్ బెటాలియన్‌కి చెందిన ఆర్మీ ఆఫీసర్  బుధవారం ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ మూడో నంబరు ప్లాట్‌ఫాం సమీపంలో పట్టాలపై శవమై కనిపించాడు. విధి నిర్వహణలో ఉన్న స్టేషన్ సూపరింటెండెంట్ కె.సన్యాసిరావు ఉదయం ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని గమనించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి రెండు భాగాలుగా విడిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. బీహార్ రాష్ట్రం రాజ్‌పూర్‌కు చెందిన పి.రంగేష్‌కుమార్‌గా గుర్తించారు.
 
ఆయన లాన్స్‌నాయక్(ఎల్.ఎన్.కె) కేడర్‌లో మణిపూర్ ఆర్మీ బె టాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో గల 13వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ శిక్షణ నిమిత్తం వచ్చాడు. మృతుని వద్ద దొరికిన పాస్‌పోర్టు, అతను శిక్షణ పొందుతున్న ఎన్‌సీసీ క్యాంపు ఆఫీసు నుంచి సమాచారాన్ని సేకరించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసుని విశాఖరైల్వే జీఆర్పీపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement