హీరో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా మారారు. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రం రూపొందుతోంది కదా. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్ పాత్ర అని ఫిల్మ్‌నగర్ టాక్. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయట. మరి... ప్రభాస్ ఇందులో రెండు పాత్రలు చేస్తున్నది నిజమే అయితే ఇంకో పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది.
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘సలార్’ షూటింగ్‌కి బ్రేక్ పడింది. కోవిడ్ వ్యాప్తి తగ్గిన తర్వాత తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment