ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్ గా, పృధ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సలార్’ తొలిపార్టు ‘సలార్: సీజ్‌ఫైర్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది.
రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రభాస్, ప్రశాంత్ అండ్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌తో బిజీగా ఉంటున్నారు. రీసెంట్‌గా ‘సలార్: సీజ్‌ఫైర్’ సినిమాకు బెంగళూరులో డబ్బింగ్ చెప్పారట ప్రభాస్. ఈ సినిమాలో ఆద్య అనే జర్నలిస్ట్ పాత్రలో శ్రుతీహాసన్ నటిస్తున్నారని ప్రచారం సాగింది. అయితే ఈ చిత్రంలో ఆమెది జర్నలిస్ట్ పాత్ర కాదని, టీచర్ ఆద్య పాత్ర అని తాజాగా తెరపైకి వచ్చింది. కాగా హిందీ, తెలుగు, తమిళంలో మూడు రోజుల్లో మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పారు శ్రుతీహాసన్.
Comments
Please login to add a commentAdd a comment