
శ్రీనగర్: కశ్మీర్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖకు దగ్గర్లో అనేకమంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది కూడా ఆ ఉగ్రవాదులకు సహకరించడానికేనని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణ రేఖకు ఆవల భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారమొచ్చింది’ అని శ్రీనగర్‌లోని లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ చెప్పారు. ఉగ్రవాదులు గుంపులు గుంపులుగా ఒక్కో చోట 30 నుంచి 40 మంది ఉన్నారని వెల్లడించారు.