
సాక్షి, హైదరాబాద్ : ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లాన్స్ నాయక్‌లాన్స్ అనే ఆర్మీ అధికారి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ అపాయింట్‌మెంట్ కాపీలు ఇచ్చి మొహం చాటేయడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మీ అధికారిని శనివారం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహరంలో లాన్స్ నాయక్‌లాన్స్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ కొరకు నిందితుల్నికోర్టులో హాజరు పరచామని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment