సీసీ టీవీలో రికార్డయిన కాల్పుల నాటి దృశ్యాలు
బ్రెసిలియా : రోడ్డుపై వెళుతున్న మహిళలకు తుపాకి గురి పెట్టి దోచుకోవాలని చూసిన ఓ దొంగను మహిళా ఆర్మీ అధికారి కాల్చి చంపింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో చోటుచేసుకుంది. స్థాన్కి మీడియా తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం సావో పాలోలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలోని రోడ్డుపై వెళుతున్న మహిళలపై అదే ప్రాంతానికి చెందిన ఎలివెల్టన్ నెవెస్ మొరైరా(21) గన్ను గురి పెట్టాడు. వారి దగ్గర ఉన్న నగదు, ఆభరణాలు ఇవ్వాలని లేకపోతే కాలుస్తానని బెదిరించాడు.
దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ పరుగులు తీయటం మొదలుపెట్టారు. కానీ అక్కడే సాధారణ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా ఆర్మీ కార్పోరల్ కటియా సాట్రె అధికారి మాత్రం ధైర్యంగా తన వద్ద ఉన్న తుపాకితో అతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బుల్లెట్ గాయాలతో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆదివారం దొంగ మరణించాడు.
మహిళా ఆర్మీ అధికారి కార్పోరల్ కటియా సాట్రె ధైర్య సాహసాలకు మెచ్చిన అక్కడి ప్రభుత్వం ‘మదర్స్ డే’ రోజున ఆమెను ఘనంగా సత్యరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆ క్షణంలో అక్కడున్న వారిని ఎలా కాపాడాలని మాత్రమే ఆలోచించానని, అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దొంగపై కాల్పులు జరిపాన’ని తెలిపారు. సాట్రె పదర్శించిన ధైర్య సాహసాలకు ఆమెను అందురు సూపర్ మామ్ అని పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment