ఈ వీడియోసాంగ్‌కి కోటి వ్యూస్..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది. వెలిపాడింతే పుస్తకం అనే మలయాళ చిత్రంలోని ‘జిమ్మికి కమ్మల్’ పాట. మలయాళుల సుప్రసిద్ధ పండుగ ఓనంకు ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ కళాశాల, విద్యార్థులు, ఉపాధ్యాయులు డాన్స్ చేసిన ఈవీడియో ఆన్‌లైన్‌లో విపరీతమైన వైరల్‌గా మారింది. ఎంతలా అంటే ఏకంగా కోటి 18 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
విద్యార్థుల డ్యాన్స్ నెట్‌జన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఓనం సంప్రదాయ దుస్తుల్లో వారు చేసిన డ్యాన్స్ యువతకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా 'సెరిల్' అనే అమ్మాయి డ్యాన్స్‌కి బాగా పేరొచ్చింది. రెండు వారాలకు ముందే ఆఅమ్మాయి ఆ కళాశాలలో చేరింది. పండుగ సందర్భంగా ఏదైనా భిన్నమైన వీడియోను రూపొందించాలని భావించి అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ‘జిమ్మికి కమ్మల్’ వీడియోకు శ్రీకారం చుట్టారు. దీంతో సెరిల్ సహా ఆ పాటలో నటించిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈసందర్భంగా సెరిల్ సంతోషం వ్యక్తం చేసింది. తన డాన్స్‌కు ఇంత మంచి స్సందన వస్తుందని ఊహించలేదని తెలిపింది. సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని పేర్కొంది. తమిళంలో తనకు అజిత్ అంటే చాలా ఇష్టమని సెరిల్ చెప్పింది. కాగా, హాలీవుడ్‌లో జిమ్మీ కిమ్మల్ అనే నటుడు ఈ వీడియో చూసి ట్వీట్ చేయడం విశేషం.
not until now, but I love it! https://t.co/6Qv9StTdpY
— Jimmy Kimmel (@jimmykimmel) September 8, 2017