దొడ్డబళ్లాపురం: అపార్ట్‌మెంట్‌లో నివసించే కేరళీయులు ఓనం పండుగ కావడంతో పూలతో సుందరంగా ముగ్గు వేశారు. ఇది గిట్టని మరో మహిళ ముగ్గును కాళ్లతో చెరిపివేసి వీరంగం సృష్టించింది. నా అనుమతి లేకుండా ఎవరు ముగ్గు వేసింది అని దూషించింది. బెంగళూరు సంపిగెహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని థణిసంద్ర మోనార్క్ సెరెనిటీ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది.
రాకేశ్ క్రిష్ణన్‌సింహ అనే వ్యక్తి ఈ దృశ్యాలను ఎక్స్‌లో పోస్టు చేశాడు. తమ కేరళ సంస్కృతిని మహిళ అవమానించిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ సంఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో పెరిగిపోతున్న అసహనానికి ఇది అద్దం పడుతోందని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment