
ఓనమ్ పండగకి కళకళలాడిపోయారు తారలు. పండగ ప్రత్యేకమైన కసావు చీర కట్టుకుని, సంప్రదాయ నగలు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని మెరిసిపోయారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అమ్మ చీర కట్టుకుని, కొప్పున పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమా పరమేశ్వరన్ ‘ఇవాళ ఓనమ్ పెన్నే...’ అంటూ పలు ఫొటోలను షేర్ చేశారు.

భర్త జగత్ దేశాయ్, కుమారుడు ఇలయ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు అమలా పాల్. ‘ఇవాళ ఓనమ్ థీమ్ ఏంటంటే పాయసమ్’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. భర్త, హీరో గౌతమ్ కార్తీక్‌తో కలిసి పండగ చేసుకున్నారు మంజిమా మోహన్. ఓనమ్ పండగకి అంబారీ స్వారీ చేయకపోతే ఎలా అంటూ నటుడు కాళిదాస్ జయరాం సందడి చేశారు. చేతిలో కలువ పువ్వు పట్టుకుని అనిఖా సురేంద్రన్, మియా జార్జ్ కనువిందు చేశారు.

జడకు తామర పువ్వు పెట్టుకుని ప్రెట్టీగా అన్నా బెన్, జుత్తుకి మల్లెలు చుట్టి బ్యూటిఫుల్‌గా మిర్నా మీనన్, అరిటాకులో పువ్వులు పెట్టి చిరునవ్వుతో అందంగా మహిమా నంబియార్, సింపుల్‌గా స్టిల్ ఇచ్చినా సూపర్‌గా కనిపించిన అతుల్యా రవి, అంతే అందంగా కనిపిం చిన అనంతికా సనీల్‌కుమార్, నవ్యా నాయర్... ఇలా ఎవరికి వారు చక్కగా రెడీ అయి, ‘ఓనమ్ శుభాకాంక్షలు’ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment