Onam celebrate
-
ఓనమ్ స్పెషల్: కసావు చీర... కాటుక కళ్లు...
ఓనమ్ పండగకి కళకళలాడిపోయారు తారలు. పండగ ప్రత్యేకమైన కసావు చీర కట్టుకుని, సంప్రదాయ నగలు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని మెరిసిపోయారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అమ్మ చీర కట్టుకుని, కొప్పున పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమా పరమేశ్వరన్ ‘ఇవాళ ఓనమ్ పెన్నే...’ అంటూ పలు ఫొటోలను షేర్ చేశారు.భర్త జగత్ దేశాయ్, కుమారుడు ఇలయ్తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు అమలా పాల్. ‘ఇవాళ ఓనమ్ థీమ్ ఏంటంటే పాయసమ్’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. భర్త, హీరో గౌతమ్ కార్తీక్‌తో కలిసి పండగ చేసుకున్నారు మంజిమా మోహన్. ఓనమ్ పండగకి అంబారీ స్వారీ చేయకపోతే ఎలా అంటూ నటుడు కాళిదాస్ జయరాం సందడి చేశారు. చేతిలో కలువ పువ్వు పట్టుకుని అనిఖా సురేంద్రన్, మియా జార్జ్ కనువిందు చేశారు. జడకు తామర పువ్వు పెట్టుకుని ప్రెట్టీగా అన్నా బెన్, జుత్తుకి మల్లెలు చుట్టి బ్యూటిఫుల్‌గా మిర్నా మీనన్, అరిటాకులో పువ్వులు పెట్టి చిరునవ్వుతో అందంగా మహిమా నంబియార్, సింపుల్‌గా స్టిల్ ఇచ్చినా సూపర్‌గా కనిపించిన అతుల్యా రవి, అంతే అందంగా కనిపిం చిన అనంతికా సనీల్‌కుమార్, నవ్యా నాయర్... ఇలా ఎవరికి వారు చక్కగా రెడీ అయి, ‘ఓనమ్ శుభాకాంక్షలు’ తెలిపారు. -
ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వడం ఖాయం
తిరువతనంపురం: పండుగలు, వేడుకలకు కళ తీసుకువచ్చేదే ఆడవాళ్లు. మహిళలు లేకుండా జరిపే వేడుకలు జీవం లేకుండా కళావిహీనంగా ఉంటాయి. ఒకవేళ పురుషులే మహిళల్లా అలంకరించుకుని వేడుకలో పాల్గొంటే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ వీడియో. దీన్ని చూసిన వారంతా పగలబడి నవ్వుతున్నారు. కేరళ వారికి ఓనమ్ ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేరళ మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటారు. పండుగనాడు మహిళలు ప్రత్యేకమైన ఓనమ్ చీరను ధరించి.. ఓ చోట చేరి పువ్వులతో రంగవల్లులు వేసి.. నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఒకవేళ పురుషులు ఓనమ్ వేడుకల్లో పాల్గొంటే.. అది కూడా మహిళల్లా అలంకరించుకుని డ్యాన్స్ చేస్తే.. ఊహించుకుంటేనే బలే సరదాగా ఉంది కదా. ఇక ఇందుకు సంబధించిన వీడియోను చూస్తే.. నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో కొందరు పురుషులు కేరళ మహిళల మాదిరి చీరను ముండు స్టైల్లో ధరించి.. మెడలో బంగారు ఆభరణాలు వేసుకుని.. తలపై పువ్వులు ధరించి ముస్తాబయ్యారు. అంతటితో ఊరుకోక ‘మనమెంతాయి’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. రాధికా తిలక్ నిర్మించిన స్నేహం చిత్రంలోని ఈ పాట కేరళ జానపద నృత్యం కైకొట్టి కాళి ప్రదర్శనలో పాడతారు. ఓనమ్, తిరువతీర వంటి వేడుకల సందర్భంగా కేరళ మహిళలు గుంపుగా చేరి ఈ కైకొట్టి కాళి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ వ్యక్తులు కూడా అదే పని చేశారు. వీడియో చూసిన వారు ఆఫీసులో మహిళా ఉద్యోగులు లేకపోతే.. ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
వైభవంగా ఓనం
బెంగళూరులోని మలయాళీలు సోమవారం భక్తి శ్రద్ధలతో ఓనం పండుగను ఆచరించారు. సంప్రదాయ నార చీరలను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి మైమమరచిపోయారు. కేరళీయులకు అత్యంత ఇష్టుడైన రాజు మహా బలి ఇంటికి పునరాగమనాన్ని ‘తిరుఓనం’గా ఈ పండుగను ఆచరించడం ఆనవాయితీ.